వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
లక్ష్యాల మేరకు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్న పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం
Posted On:
16 OCT 2023 4:33PM by PIB Hyderabad
లక్ష్యాల మేరకు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని అమలు చేయడానికి పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం చర్యలు తీసుకుంటున్నది. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం పరిధిలో పనిచేస్తున్న 19 ఉప-సంస్థల కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి, పనితీరు మెరుగుపరచడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని అమలు చేయడానికి 2023 సెప్టెంబర్ 15 నుండి 30 వరకు సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
సన్నాహక దశలో ప్రత్యేక ప్రచారం 3.0లో అమలు చేయాల్సిన ప్రణాళికపై డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 26 సెప్టెంబర్ 2023న విభాగం అధికారులు,సిబ్బంది స్వచ్ఛతా హి సేవ ప్రతిజ్ఞచేపట్టారు.గాంధీ జయంతి సందర్భంగా 2023. అక్టోబర్ 02న డీపీఐఐటీ అధికారులు,సిబ్బంది కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో శ్రమదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తామని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) వినియోగానికి వ్యతిరేకంగా ప్రమాణం చేశారు.పారిశుధ్య సిబ్బందిని సత్కరించారు. 2023 సెప్టెంబర్ 15 నుండి 30 వరకు విభాగం ఆధ్వర్యంలో మొత్తం 47 కార్యక్రమాలు జరిగాయి.
02.10.2023 నుంచి ప్రారంభమైన స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 కార్యక్రమంలో భాగంగా పెండింగ్ లో ఉన్నప్రజా ఫిర్యాదులు,పార్లమెంట్ సభ్యుల నుంచి అందిన సిఫార్సులు,, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి అందిన సూచనలు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన సూచనలు పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. పనికిరాని ఫైళ్లను తొలగించడం ప్రారంభించారు. 2023 అక్టోబర్ 31 వరకు కార్యక్రమం అమలు జరుగుతుంది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి డీపీఐఐటీ,
దాని 19 ఉప-సంస్థలు స్వచ్ఛత కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.
***
(Release ID: 1968351)