రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్ము & కశ్మీర్‌లోని షెరేబీబీ వద్ద రూ.12 కోట్ల అంచనా వ్యయంతో 224 మీటర్ల వయాడక్ట్ (2-లైన్లు) నిర్మాణం విజయవంతంగా పూర్తయిందన్న శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 16 OCT 2023 12:09PM by PIB Hyderabad

జమ్ము & కశ్మీర్‌లోని షెరేబీబీ వద్ద రూ.12 కోట్ల అంచనా వ్యయంతో 224 మీటర్ల వయాడక్ట్ (2-లైన్లు) నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని, కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్‌ చేశారు.

ఎన్‌హెచ్‌-44లోని రాంబాన్ నుంచి బానిహాల్ సెక్షన్‌లో ఈ నిర్మాణం జరిగిందన్నారు. ఈ 224 మీటర్ల వయాడక్ట్‌, 125 మీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాదు, ఏటవాలు ప్రయాణాన్ని, కొండ వాలులో 80 డిగ్రీలకు పైగా వంపు తిరగాల్సిన అవసరాన్ని కూడా నివారిస్తుంది. వాహనాలు సాఫీగా వెళ్లేలా ప్రయాణాన్ని మారుస్తుంది.

ఈ ప్రాజెక్టు షెరేబీబీ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని, ఆ ప్రాంతంతో అనుసంధానతను పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. జమ్ము & కశ్మీర్‌కు అద్భుతమైన జాతీయ రహదారి మౌలిక సదుపాయాలు అందించేందుకు నిబద్ధులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తామంతా సిద్ధంగా ఉన్నామని శ్రీ గడ్కరీ ట్వీట్‌ చేశారు.

***


(Release ID: 1968298) Visitor Counter : 65