రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతను (పారిశుద్ధ్యాన్ని వ్యవస్థీకృతం చేయడం, మంత్రిత్వ శాఖ, దాని ఆధీన కార్యాలయాలైన ఎన్‌హెచ్ఎఐ, ఎన్‌హెచ్ఐడిసిఎల్ & ఐఎహెచ్ఇలలో అపరిష్కృతంగా ఉన్న అంశాలను కనీస స్థాయికి తీసుకురావాలని ప్రత్యేక ప్రచారం 3.0 కింద లక్ష్యంగా పెట్టుకున్న రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ
Posted On:
16 OCT 2023 7:55PM by PIB Hyderabad
స్వచ్ఛతను (పారిశుద్ధ్యాన్ని వ్యవస్థీకృతం చేయడం, మంత్రిత్వ శాఖ, దాని ఆధీన కార్యాలయాలైన ఎన్‌హెచ్ఎఐ, ఎన్‌హెచ్ఐడిసిఎల్ & ఐఎహెచ్ఇలలో అపరిష్కృతంగా ఉన్న అంశాలను కనీస స్థాయికి తీసుకురావాలని లక్ష్యంతో ప్రత్యేక ప్రచారం 3.0 కింద రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు కార్యకలాపాలను చేపట్టింది. కార్యాలయాలలో, వివిధ టోల్ ప్లాజాలలో, ప్రాజెక్టు ప్రాంతాలు తదితర ప్రదేశాలలో స్వచ్ఛతా అభియాన్ (పారిశుద్ధ్య డ్రైవ్)ను చేపట్టి, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళను పరిష్కరించి, తొలగించి, తక్కును విసర్జించి, రహదారులను గుంటల రహితం చేయడం ఈ కార్యకలాపాలలో కొన్ని.
అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ ప్రచారం, 31 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు, ఆర్‌టి&హెచ్ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ మార్గదర్శనంలో ఈ మొత్తం ప్రచార ప్రణాళికను రూపొందించారు.
ప్రచారాన్ని ప్రారంభిస్తూ, ఎంఒఆర్‌టిహెచ్ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ ఇటీవలే ఇక్కడ గల కార్యాలయాలను, ట్రాన్స్‌పోర్ట్ భవన ఆవరణను తనిఖీ చేశారు. ఆయన పారిశుద్ధ్యంలో అత్యున్నత ప్రమాణాలను పాటించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ, కార్యాలయాలకు మంచి చురుకైన రూపాన్ని ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఆయన ప్రజా ఫిర్యాదులు, పిఎంఒ ఆదేశాలు తదితరాలు సహా బహిర్గత కమ్యూనికేషన్‌ను నిర్వహించే మంత్రిత్వ శాఖ సెంట్రల్ రిజిస్ట్రీ (సిఆర్) సెక్షన్ (డాక్ సెక్షన్) వద్ద కొంత సమయాన్ని గడిపి, దాని సామర్ధ్యాన్ని మెరుగుపరచుకునేందుకు తగిన సూచనలను, ఆదేశాలను ఇచ్చారు. ఈ తనిఖీ సమయంలో సంయుక్త కార్యదర్శి శ్రీ కమలేష్ చతుర్వేదీ, ఇతర సీనియర్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు.
ఈ ప్రచారానికి పూర్వగామిగా, స్వచ్ఛతా హీ సేవ (ఎస్‌హెచ్ఎస్) ప్రచారాన్ని 15 నుంచి 30 సెప్టెంబర్ వరకు నిర్వహించి, అనంతరం ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ ప్రత్యేక ప్రచారాన్ని దేశవ్యాప్తంగా 1 అక్టోబర్‌న నిర్వహించారు.స్వచ్ఛతా ప్రచారం 3.0 ప్రారంభిస్తున్నట్టు సంకేతంగా మహాత్మా గాంధీ జయంతి రోజైన 2 అక్టోబర్‌న స్వచ్ఛతా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని, పారిశుద్ధ్య డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎంఒఆర్‌టిహెచ్ అదనపు కార్యదర్శి శ్రీ అమిత్ కుమార్ ఘోష్, సంయుక్త కార్యదర్శి శ్రీ కమలేష్ చతుర్వేది, శ్రీ ఎస్‌పి సింగ్ సహా పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు.
అక్టోబర్ 16 వరకు మంత్రిత్వ శాఖ 601 ప్రజా ఫిర్యాదులను, 162 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళను, 147 ఎంపిల నిర్దేశాలను, 4 పిఎంఒ ఆదేశాలను, 10 పార్లమెంటరీ హామీలను పరిష్కరించారు. అంతేకాకుండా, 4,270 భౌతిక ఫైళ్ళను తొలగించారు. దాదాపు 11,958 పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమాలను దేశంలో పలు ప్రాంతాలలో నిర్వహించారు. మంత్రిత్వ ఇప్పటి వరకూ ప్రచారం సందర్భంగా కార్యాలయ ఆవరణలో 200 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయగలిగింది. పారిశుద్ధ్య ప్రచారాలను ఎంఒఆర్‌టిహెచ్/ ఎన్‌హెచ్ఎఐ/ ఎన్‌హెచ్ఐడిసిఎల్‌కు చెందిన టోల్ ప్లాజాలు, ప్రాంతీయ కార్యాలయాలు & పిఐయు/ పిఎంయులలో నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా, ఎంపీల ఆదేశాలు, ప్రజా ఫిర్యాదులు, ఫైళ్ళ రికార్డు నిర్వహణ తదితరాల పర్యవేక్షణను దానికే అంకితం చేసిన పోర్టల్ ద్వారా ప్రతి రోజూ ఎంఒఆర్‌టిహెచ్ చేస్తున్నది. వివిధ కార్యాలయాల మధ్య సమన్వయం ద్వారా వాటి శ్రేణి, యోగ్యత ఆధారంగా పరిష్కరించడం లేదా విసర్జించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
***
(Release ID: 1968285)
Visitor Counter : 82