గనుల మంత్రిత్వ శాఖ

ప్ర‌త్యేక ప్ర‌చారం 3.0 కింద 100% ప్ర‌జా ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించిన గ‌నుల మంత్రిత్వ శాఖ‌

Posted On: 16 OCT 2023 5:26PM by PIB Hyderabad

 ప్ర‌త్యేక ప్ర‌చారం 3.0 కింద గ‌నుల మంత్రిత్వ శాఖ‌,  క్షేత్ర నిర్మాణాలు,  సిపిఎస్ఇలు నిబంధ‌న‌లు/  ప్ర‌క్రియ‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం, రికార్డుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కారం, త‌న నియంత్ర‌ణ‌లో ఉన్న కార్యాల‌యాల‌లో ప‌ని ప్ర‌దేశ అనుభ‌వాన్ని ఉన్న‌తీక‌రించ‌డం స‌హా ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. 
పెండింగ్‌లో ఉన్న ఆదేశాలు, ఉల్లేఖ‌న‌ల ప‌రిష్కారానికి చేసిన ప్ర‌త్యేక కృషి ప్ర‌జా ఫిర్యాదుల‌ను, ఐఎంసి ఆదేశాలు (కేబినెట్) ప్ర‌తిపాద‌న‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అందుకున్న ప్ర‌స్తావ‌న‌లను విచారించి ప‌రిహ‌రించ‌డంలో 100% విజ‌యాన్ని సాధించాయి. వీటితో పాటుగా పిఎంఒ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డంలో కూడా 100%నికి  అత్యంత స‌మీపంలో గ‌నుల మంత్రిత్వశాఖ ఉంది. 
ప్ర‌కృతికి తిరిగి ఇవ్వ‌డం అన్న దానిపై తీవ్ర దృష్టిని పెట్టి, మంత్రిత్వ శాఖ‌, క్షేత్ర నిర్మాణాలు  దేశంలోని ప‌లు మారు మూల ప్రాంతాల్లో కూడా జీవ‌వ్య‌ర్ధాల గుంట‌లు, ఔష‌ధీయ మొక్క‌ల వ‌నాలు, చెరువుల‌ను శుభ్రం చేయ‌డం, త‌మ ఉద్యోగుల కోసం బ‌హిరంగ వినోద సౌక‌ర్యాలు ఏర్పాటు చేసింది.
రికార్డు నిర్వ‌హ‌ణ కింద‌,  భౌతిక ఫైళ్ళ స‌మీక్ష‌లో మంత్రిత్వ శాఖ త‌న ల‌క్ష్యంలో 63%న్ని సాధించ‌గా, దాదాపు 2000కు పైగా ఇ-ఫైళ్ళ‌ను ఇప్ప‌టివ‌ర‌కూ మూసివేసింది. భౌతిక‌ఫైళ్ళ‌ను తొల‌గించే ప్ర‌క్రియ కార‌ణంగా దాదాపు 29,050 చ‌ద‌ర‌పు అడుగుల సంచిత కార్యాల‌య స్థ‌లాన్ని ఖాళీ చేయ‌గా, త‌క్కును విస‌ర్జించ‌డం అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 13,08,496 ఆదాయాన్ని ఆర్జించింది. 
ప్ర‌త్యేక డ్రైవ్‌గా గ‌నుల మంత్రిత్వ శాఖ ఇ0 ఆఫీస్‌లో గ‌త ప్ర‌చార స‌మ‌యంలో  ఇ- ఆఫీస్ స్కాన్డ్ ఫైళ్ళ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించే ప‌నిని చేప‌ట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కూ 4,000 స్కాన్డ్ ఫైళ్ళ‌ను ఇ-ఆఫీస్‌లో ఇ- ఫైళ్ళ‌గా ప్ర‌త్యేక ప్ర‌చారం 3.0 సంద‌ర్భంగా అప్‌లోడ్ చేసింది. 
అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష్యంగా పెట్టుకున్న 344 పారిశుద్ధ్య ప్ర‌చారాల‌లో 210ని అమ‌లును పూర్తి చేసింది. ఈ ప్ర‌చార ద‌శ సంద‌ర్భంగా 100% ఫ‌లితాల‌ను సాధించేందుకు మంత్రిత్వ శాఖ క‌ట్టుబ‌డి ఉంది.  

 

***
 



(Release ID: 1968284) Visitor Counter : 44