మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ముగిసిన సాగర్ పరిక్రమ దశ X


ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో జరిగిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ విఆర్ సిలో పాల్గొన్న 2000 మందికి పైగా మత్స్యకారులు, మహిళలు, ఎఫ్ఎఫ్ పీఓలు, పారిశ్రామికవేత్తలు, ఇతర వాటాదారులు

నెల్లూరు వీఆర్‌సీ గ్రౌండ్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా
సుమారు 8000 కి.మీ తీర రేఖ వెంబడి నివసిస్తున్న సుమారు 3 కోట్ల మంది మత్స్యకారులు, మత్స్య కుటుంబాలు మత్స్య రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి.. కేంద్ర మంత్రి శ్రీ రూపాలా

సుమారు 1.58 లక్షలమంది మత్స్యకారులకు కేసీసీ
దేశంలో మత్స్యకారుల అందరికీ కేసీసీ అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు అమలు : శ్రీ రూపాలా

Posted On: 14 OCT 2023 3:17PM by PIB Hyderabad

సాగర్ పరిక్రమ దశ X ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ముగిసింది. ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో జరిగిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ వి ఆర్ సి లో     2000 మందికి పైగా మత్స్యకారులు, మహిళలు,  ఎఫ్‌ఎఫ్‌పిఓలు , పారిశ్రామికవేత్తలు,  ఇతర వాటాదారులు పాల్గొన్నారు. 

సాగర్ పరిక్రమ ఫేజ్-X నేడు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం చేరుకుంది.ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి శ్రీ రూపాలా కృష్ణపట్నంలోని రామ్‌నగర్ ఫిషింగ్ గ్రామాన్ని సందర్శించి  మత్స్యకారుడు శ్రీ ప్రసాద్‌తో మాట్లాడి ఆయన అనుభవాలు తెలుసుకున్నారు. 

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల నేతృత్వంలో సాగర్ పరిక్రమ దశ X తమిళనాడులోని చెన్నై పోర్ట్ నుంచి 2023 అక్టోబర్ 13న  ప్రారంభమైంది.

నెల్లూరు VRC గ్రౌండ్‌లో ఏర్పాటైన  ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి  వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. పారిశ్రామికవేత్తలు, ఎఫ్‌ఎఫ్‌పిఓలు, మత్స్యకారులతో కూడా ఆయన మాట్లాడారు.  ఫెస్టివల్‌లో సహజ చేప ఉత్పత్తులను ప్రదర్శించడాన్ని కేంద్ర మంత్రి అభినందించారు.

కేంద్ర మంత్రి శ్రీ రూపాలా తన ప్రసంగంలో మత్స్య రంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దేశంలో  సుమారు 8000 కి.మీ తీర రేఖ వెంబడి సుమారు 3 కోట్ల మత్స్యకారులు మత్స్య రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి తెలిపారు. మత్స్య పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన పాత్ర ఉందని తెలిపిన మంత్రి దేశంలో ఉత్పత్తి అవుతున్న చేపల ఉత్పత్తిలో 30% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయని ఆయన వివరించారు. 

మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు/పథకాలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. పీఎంఎస్ ఎస్ వై తో సహా 100కి పైగా  కార్యకలాపాలు/ప్రాజెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. . 20050 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.   మత్స్యకారుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న  సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని   ఒక బృహత్తర కార్యక్రమంగా మంత్రి వర్ణించారు.  మంత్రులు, అధికారులు, ఇతర సంబంధిత వర్గాలను మత్స్యకారులు కలిసి తమ సమస్యలకు పరిష్కారం పొందడానికి కార్యక్రమం అవకాశం కలిగిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.   

మత్స్యకారులకు సుమారు 1.58 లక్షల కెసిసి అందించామని తెలిపిన కేంద్ర మంత్రి  దేశంలో మత్స్యకారుల అందరికీ కెసిసి అందించాలని లక్ష్యంగా పెట్టుకొనిను పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌లో ప్రత్యక్ష ,సహజమైన చేపల ఉత్పత్తులను ప్రదర్శించిన  వివిధ పారిశ్రామికవేత్తలు, ఎఫ్‌ఎఫ్‌పిఓలు, చేపల పెంపకందారులను  ఆయన అభినందించారు.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన  కింద శ్రీ ఎ. చందన, శ్రీ వై. బలరామ కృష్ణ, శ్రీమతి ఎస్. పద్మజ, శ్రీమతి టి. రేణుక రెడ్డి, ఇ. రమణయ్య, శ్రీమతి వి. జయలక్ష్మి లకు  లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్‌లను  కేంద్ర మంత్రి అందజేశారు. శ్రీ బి. చెన్నరాయుడు, శ్రీ కె. వాసు, శ్రీ ఎం. లక్ష్మీ ప్రసన్న మరియు శ్రీ లబ్దిదారులకు లైవ్ ఫిష్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం/ ఇన్సులేటెడ్ వెహికల్‌ని కూడా అందచేశారు.

సాగర్ పరిక్రమ పర్యటనలో అందిన అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, , మత్స్య రంగం సమగ్ర అభివృద్ధి,మత్స్యకారులు, తీర ప్రాంత వర్గాలు , మత్స్య రంగ వాటాదారుల సంక్షేమం కోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని  కేంద్ర మంత్రి శ్రీ రూపాలా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యకారులతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ లో  లో సాగర్ పరిక్రమ యాత్ర త్వరలో నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

 ఆంధ్ర ప్రదేశ్  మత్స్య శాఖ మంత్రి శ్రీ ఎస్. అప్పల రాజు తన ప్రసంగంలో మత్స్య రంగం యొక్క ప్రాముఖ్యత, మత్స్యకారులు,మత్స్యకార  కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న  వివిధ పథకాలనువివరించారు.  ఆంధ్రప్రదేశ్,  తమిళనాడు రాష్ట్రాల  మధ్య నెలకొన్న  అంతర్ రాష్ట్ర మత్స్యకార వివాదాలను ఆయన కెంరమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.  రెండు రాష్ట్రాలతో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

 ఆంధ్ర ప్రదేశ్  మత్స్య శాఖ మంత్రి,   శ్రీ ఎస్. . అప్పలరాజు, పార్లమెంట్ సభ్యులు శ్రీజి.వి.ఎల్.  నరసింహారావు, శ్రీ బీద మస్తాన్ రావు, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ కమిషనర్,  శ్రీ కె. కన్నబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మత్స్యకారులు, ఎఫ్‌ఎఫ్‌పిఓలు,మత్స్య పారిశ్రామికవేత్తలతో పాటు మత్స్యశాఖ, జిఓఐ, ఎన్‌ఎఫ్‌డిబి అధికారులు కూడా హాజరయ్యారు.

 మత్స్యకారులకు, చేపల పెంపకందారులకు మరియు సంబంధిత వాటాదారులకు సంఘీభావం తెలిపేందుకు తీర ప్రాంతం వెంబడి "సాగర్ పరిక్రమ" యాత్ర నిర్వహిస్తున్నారు. 

 

***



(Release ID: 1967856) Visitor Counter : 39


Read this release in: English , Urdu , Hindi , Tamil