వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ ఆవిష్కరణలు అమలు
దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాల కోసం అగ్రి-టెక్ రంగంలో సాధించిన అభివృద్ధి అమలు జరిగేలా చూసేందుకు వ్యూహాత్మక చర్యలు, ప్రణాళికలు అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
రైతుల సంక్షేమం కోసం ఉపయోగపడే ఆవిష్కరణలను గుర్తించి, విశ్లేషించడానికి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, నైపుణ్యాలు పంచుకోవడానికి అగ్రి టెక్‌లు, స్టార్టప్‌లు మొదలైన వాటి నుండి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించిన మంత్రిత్వ శాఖ
Posted On:
14 OCT 2023 3:44PM by PIB Hyderabad
సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న విధానాలు అమలు కావడంలో భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పనిచేస్తున్న . అగ్రి-స్టార్ట్-అప్‌లు ప్రైవేట్ రంగ సంస్థలు వ్యవసాయ రంగంలో ప్రవేశించడంతో మరింత వేగంగా వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం , పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ ఇప్పటికే వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి. హైపర్‌స్పెక్ట్రల్ డేటా విశ్లేషణ, ఫోటో-ఎనలిటిక్స్, జియోస్టేషనరీ ఉపగ్రహాల ద్వారా వాతావరణంపై ఖచ్చితమైన సమాచారం పొందడం వంటి ప్రత్యేకమైన విధానాలు వ్యవసాయ రంగంలో అమలు జరుగుతున్నాయి.సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పంట విధానం, పంట మార్పిడి వంటి అంశాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల వ్యవసాయ పద్ధతుల సామర్థ్యాన్ని పెంపొందించి ఖచ్చితత్వాన్ని సాధించడానికి అవకాశం కలుగుతుంది.వ్యవసాయ దిగుబడులు పెరిగి రైతు ఆదాయం పెరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత గుర్తించిన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సాంకేతిక వినియోగాన్ని మరింత ఎక్కువ చేసి రైతులకు ప్రయోజనం కలిగించడానికి వ్యూహాత్మక చర్యలు, ప్రణాళికలు అమలు చేస్తోంది.
వ్యవసాయ రంగంలో ఆవిష్కరణ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చూసేందుకు ఐఐటీ,ఐఐఎం,ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన వ్యవసాయ రంగ నిపుణులతో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పరిశ్రమల నుండి డొమైన్ నిపుణులు మరియు నిపుణులు కూడా ఉన్నారు. . రైతుల శ్రేయస్సుపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉన్న వినూత్న పరిష్కారాలను ఈ కమిటీ అంచనా వేస్తుంది. దీని కోసం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వివిధ అంశాలను గుర్తించింది. ఈ అంశాలపై పనిచేయడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న లేదా పని చేయడానికి ఇష్టపడే సంస్థలకు ఇది ఒక అవకాశం అందిస్తుంది. వ్యవసాయ రంగం స్వాభావిక సమస్యలు పరిష్కరించడానికి వారి వినూత్న పరిష్కారాలను వర్తింపజేస్తుంది. గత దశాబ్దంలో అగ్రి-టెక్ రంగం విపరీతమైన వృద్ధిని సాధించింది, వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ రంగంలో యువ ప్రతిభావంతులు పనిచేస్తున్నారు. అయితే, విశ్వసనీయమైన డేటా లేకపోవడం, వ్యూహాత్మక మార్గదర్శకత్వం లేకపోవడంతో అగ్రి-టెక్ రంగం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అగ్రి-టెక్ రంగానికి వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారం అందించి సమస్యల పరిష్కారానికి అవసరమైన వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అగ్రి-టెక్ రంగం అందించే వినూత్న విధానాలు అనువుగా ఉంటే వాటిని అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది.
ప్రభుత్వం కలిసి పనిచేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి నైపుణ్యాన్ని పంచుకోవడానికి ఆసక్తి ఉన్నఅగ్రి టెక్‌లు, స్టార్టప్‌లు మొదలైన వాటి నుంచి .మంత్రిత్వ శాఖ ఆసక్తి వ్యక్తీకరణ (దరఖాస్తును ఆహ్వానించింది. ఈ సమగ్ర విధానం ఆలోచనలు, జ్ఞానం మార్పిడిని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుంది, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సమగ్ర విధానాన్ని నిర్ధారిస్తుంది. ఈ కమిటీ నిర్దిష్ట సాంకేతికతలను గుర్తించి, భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఉండే లక్ష్య జోక్యాలు గుర్తించే లక్ష్యంతో ఆసక్తి కనబరిచిన సంస్థల పనితీరును పరిశీలిస్తుంది. సంస్థలు ప్రతిపాదించిన కార్యక్రమాలు ఈ మేరకు అమలు చేయడానికి వీలవుతుంది, ఖర్చు తదితర అంశాలను కమిటీ అంచనా వేస్తుంది. ఈ అంచనా నివేదిక ఆధారంగా మంత్రిత్వ శాఖ సంస్థలను గుర్తించి ఎంపిక చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రో-బోనో భాగస్వామ్యాలను మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించడానికి అవకాశం కలిగించే ఆవిష్కరణలను ప్రయోగాత్మకంగా అమలు చేసి తదనంతరం వాటి వినియోగం ఎక్కువ చేయడానికి మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సమస్యల పరిష్కారం కోసం గుర్తించిన ఆవిష్కరణల వివరాలు, వ్యవస్థల వివరాలు, దరఖాస్తు పత్రం నమూనాను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (www.agricoop.gov.in)లో పొందుపరిచారు. గల సంస్థలు దరఖాస్తు పత్రం నమూనాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతిపాదన సమర్పణ కోసం నిర్ణయించిన కార్యక్రమం:
క్ర.సంఖ్య.
|
ముఖ్యమైన తేదీలు
|
తేదీ నుంచి)
|
వరకు (తేదీ)
|
సమయం
|
1.
|
పత్రాలు డౌన్‌లోడ్
|
12.10.2023
|
31.10.2023
|
1000 గం
|
2.
|
ప్రతిపాదన సమర్పణ
|
18.10.2023
|
07.11.2023
|
1500 గం
|
***
(Release ID: 1967827)
Visitor Counter : 83