గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత దేశం త్వరలోనే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ కలిగిఉండనుంది : శ్రీ హర్ దీప్ ఎస్.పూరి.


దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్చలు.
కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ సమావేశం

Posted On: 13 OCT 2023 4:46PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అనుబంధంగా గల పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.
ఈ సమావశేశ అజెండా, పట్టణ రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడం.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ కౌశల్ కిషోర్, పార్లమెంటు సభ్యుడు (లోక్సభ) శ్రీ తిరు ఎ.కె.పి చిన రాజ్,
లోక్సభ సభ్యులు శ్రీ ఎం.వి.వి సత్యనారాయణ, డాక్టర్ శ్రీ కాంత్ ఎక్నాథ్ షిందే, శ్రీ రమేష్ బిధూరి, రాజ్యసభ సభ్యులు
శ్రీ అబిర్ రంజన్ బిశ్వాస్,శ్రీమతి వందనా చవాన్,శ్రీ మనోజ్ జోషి కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల శాఖ కార్యదర్శి,
మంత్రిత్వశాఖకు చెందిన పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.కేంద్ర గృహ  పట్టణ  వ్వవహారాల మంత్రిత్వశాఖ పట్టణ రవాణా విభాగం జాయింట్ సెక్రటరీ ,
  ఒ.ఎస్.డి, శ్రీ జయదీప్,  పట్టణ రవాణా వ్యవస్థకు సంబంధించి సభ్యుల ముందు సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.
దేశ వ్యాప్తంగగా మెట్రో నెట్ వర్క్ విస్తరణ, ప్రగతికి సంబంధించిన వివరాలు ఈ ప్రెజెంటేషన్లో ఉన్నాయి.
ఈ సమావేశంలో పాల్గొన్న వారికి ‘ఒక దేశం, ఒక కార్డు’,దేశీయంగా రూపొందించిన  ‘జాతీయ ఉమ్మడి
 ప్రయాణ కార్డు (ఎన్.సి.ఎం.సి) గురించి వివరించారు. దీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019లో ప్రారంభించారు.
మెట్రో , రైలు, బస్సు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలలో వాడకానికి అలాగే రిటైల్ షాపులు, రెస్టరెంట్లు, ఎటిఎంలు, కియోస్క్లు,
ఇంధన కొనుగోలుకు, పార్కింగ్ చెల్లింపులకు, రిటైల్ కౌంటర్లలో ఒకే ఒక కార్డు ద్వారా కొనుగోళ్లు చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.
ఎన్.సి.ఎం.సి కార్డు క్యు స్పార్క్ ( క్విక్ స్పెసిఫికేషన్ పర్ పేమెంట్ అప్లికేషన్ ఆప్ రూపీ   చిప్) ఆధారంగా  రూపుదిద్దుకున్నది.
దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) రూపొందించింది. ప్రస్తుతం ఎన్సిఎంసిలో ఉన్న మెట్రో రైలు కంపెనీలు కింది విధంగా ఉన్నాయి.
–– ఢిల్లీ మెట్రో (డి.ఎం.ఆర్.సి)
–– బెంగళూరు మెట్రో (బి.ఎం.ఆర్.సి.ఎల్)
–– ముంబాయి మెట్రో
–– చెన్నై మెట్రో (సి.ఎం.ఆర్.ఎల్)
–– అహ్మదాబాద్ మెట్రో (జి.ఎం.ఆర్.సి.ఎల్)
–– కాన్పూర్ మెట్రో (యుపిఎంఆర్.సి.ఎల్)
వీటికి తోడు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు (ఎస్.ఆర్.టి.యులు) ఎన్.సి.ఎం.సి ఇకో సిస్టమఠ్లను అమలు చేస్తున్నాయి. ఇందులో
కదంబ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, గోవా, బి.ఇ.ఎస్.టి అండర్ టేకింగ్, ముంబాయి, హర్యానా రోడ్ వేస్ లు ఉన్నాయి.
 ఈ సమావేశం సందర్భంగా సభ్యులు తమ తమ నియోజకవర్గాలు, రాష్ట్రాలలో పట్టణ ప్రాంత ప్రయాణానికి సంబంధించిన అంశాలు,
మెట్రో అనుసంధానత, దేశంలో మెట్రో కార్యకలాపాలను మరింత గా విస్తరించడం,  సులభతర ప్రయాణ,
 ప్రయాణికుల సదుపాయాలు మెరుగు పరచడం వంటి వాటి గురించి ప్రస్తావించారు.
పార్లమెంటు సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరీ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం,
20 నగరాలలో సుమారు 874 కిలో మీటర్ల మేర మెట్రో రైలు కార్యకలాపాలు నడుస్తున్నాయని ,మరో 986 కిలోమీటర్ల మెట్రో రైలుమార్గం నిర్మాణంలో ఉందని చెప్పారు.
త్వరలోనే ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గల దేశంగా రూపుదిద్దుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నదని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా మెట్రోనెట్వర్క్ కింది విధంగా ఉంది.:
పి.ఎం. ఈ బస్ సేవా పథకం గురించి కూడా కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి ప్రస్తావించారు. సిటీ బస్ ఆపరేషన్లను మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ పథకాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ పథకం కింద పది వేల ఈ బస్లను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద(పిపిపి నమూనాలో) ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.

–– పిపిపి నమూనాలో పదివేల ఈ –బస్ల ఏర్పాటు
–– పది సంవత్సరాలపాటు బస్ ల కార్యకలాపాలకు మద్దతు
–– బస్ డిపోల ఉన్నతీకరణ, అభివృద్ధికి మద్దతు
––అక్కడికక్కడే ఇంధనం తయారయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతు
––3 లక్షలకు పైబడిన జనాభా గల పట్టణాలకు వర్తింపు.
––ఛాలెంజ్ పద్ధతిలో పట్టణాల ఎంపిక.

 

***


(Release ID: 1967826) Visitor Counter : 72