బొగ్గు మంత్రిత్వ శాఖ

సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 13 OCT 2023 5:11PM by PIB Hyderabad

అక్టోబర్ నెలను జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలగా పాటిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ సవాళ్ల గురించి మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న పిఎస్యు లు, సంస్థలకు  అవగాహనా కలిపిస్తారు. వారి సంస్థలలో ఉత్తమ పద్ధతులు అమలు చేయడానికి, మెరుగైన సైబర్ భద్రత చర్యలు చేపట్టడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ శనివారం “సైబర్ సెక్యూరిటీపై వర్క్‌షాప్” నిర్వహించింది. 

 

 

కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా తన ప్రధాన ఉపన్యాసంలో సైబర్ సెక్యూరిటీకి పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించారు. ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం పెరుగుతున్నందున, బెదిరింపులు మరింత అధునాతన మవుతున్నాయని ఆయన చెప్పారు. సంస్థలు, వ్యాపారాలు, వ్యక్తులు సైబర్-దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తాజా పోకడలు, జరిగే ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం అని అన్నారు. 

 జాయింట్ సెక్రటరీ శ్రీ సంజీవ్ కుమార్ కాస్సీ తన స్వాగత ప్రసంగంలో సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. సైబర్ సెక్యూరిటీ అనేది డిజిటల్ ఆస్తులను రక్షించడమే కాకుండా మన జీవన విధానాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం అని ఆయన తెలిపారు.  సాంకేతికతపై మన ఆధారపడటం మరింతగా పెరగడంతో, సైబర్ భద్రత ప్రాముఖ్యత మరింత పెరుగుతోందని ఆయన అన్నారు.

 

 వర్క్‌షాప్‌లో బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు, సిఐఎల్, దాని అనుబంధ సంస్థలు, ఎస్సిసిఎల్, ఎన్ఎల్సిఐఎల్, సీఎంపిఎఫ్ఓ, సీసీఓ నుండి సీనియర్ ప్రతినిధులు, అలాగే ఎన్ఎల్సి , సైబర్ సెక్యూరిటీ గ్రూప్, హోంమంత్రిత్వ శాఖ కింద ఉన్న I4సి (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) నుండి ప్రముఖ వక్తలు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యం, విలువైన పరిజ్ఞానాన్ని, అంతర్దృష్టులతో సన్నద్ధం చేయడం, వారి సంబంధిత సంస్థలలో అత్యుత్తమ సైబర్ భద్రతా పద్ధతులను అమలు చేయడానికి వీలు కల్పించడం. ఈ కార్యక్రమం సైబర్ సెక్యూరిటీ కోసం నేషనల్ స్ట్రాటజీకి అనుగుణంగా ఉంటుంది, ఇది మరింత సురక్షితమైన డిజిటల్ ల్యాండ్‌స్కేప్ దిశగా కీలకమైన దశగా మారుతుంది. అదనంగా, ఉద్యోగులు, వాటాదారులలో అవగాహన పెంచడానికి క్విజ్‌లు, ఇన్ఫర్మేటివ్ సెషన్‌లతో సహా ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని పిఎస్‌యులకు సూచించారు. 

 

 శ్రీ డీప్ బన్సాల్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. 

****



(Release ID: 1967804) Visitor Counter : 36


Read this release in: Kannada , English , Urdu , Hindi