రక్షణ మంత్రిత్వ శాఖ
నాగా రెజిమెంట్, మూడవ బెటాలియన్‌కు ప్రెసిడెంట్స్ కలర్స్‌ను అందచేసిన సైన్యాధ్యక్షుడు
Posted On:
13 OCT 2023 5:09PM by PIB Hyderabad
రాణిఖేత్ (ఉత్తరాఖండ్)లోని కుమావో రెజిమెంటల్ సెంటర్‌లో జరిగిన ఆకట్టుకునే కలర్ ప్రెజెంటేషన్ పరేడ్‌లో సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ పాండే, నాగా రెజిమెంట్ థర్డ్ బెటాలియన్‌కి 13 అక్టోబర్ 2023 ప్రతిష్ఠాత్మకమైన ప్రెసిడెంట్స్ కలర్స్‌ను అందించారు.
కవాతును సమీక్షించిన తర్వాత సైన్యాధ్యక్షుడు ఆపరేషన్లు, శిక్షణ, క్రీడలు సహా అన్ని రంగాల సైనిక కార్యకలాపాలను కలిగి ఉన్న నాగా రెజిమెంట్ సుసంపన్నమైన సంప్రదాయాలను ప్రశంసించారు.
తక్కువ వ్యవధిలో వారి అద్భుతమైన పనితీరు కోసం ఏర్పాటు చేసిన కొత్త యూనిట్‌ను సిఒఎఎస్ అభినందిస్తూ, దేశం గర్వపడేలా సేవ చేయాలంటూ అన్ని ర్యాంకులకు తన శుభాకాంక్షలను తెలిపారు.
కలర్ ప్రెజెంటేషన్ కవాతును పెద్ద సంఖ్యలో పని చేస్తున్న, పదవీ విరమణ చేసిన సిబ్బందితో కలిసి కుమావ్ స్కౌట్స్ & నాగారెజిమెంట్, కుమావ్ కల్నల్, తూర్పు కమాండు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ ఆర్‌పి కలితా, సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి వీక్షించారు.
***
(Release ID: 1967802)
Visitor Counter : 60