ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియాఏఐ నివేదికకు సంబంధించిన మొదటి ఎడిషన్‌ను సమర్పించిన ఏడు ఎంఇఐటివై ఏఐ గ్రూపులు
"ఇండియాఏఐ నివేదిక ప్రధానమంత్రి మోదీచే రూపొందించబడిన భారతదేశ ఏఐ వ్యూహానికి సంబంధించిన పూర్తిస్థాయిని నిర్దేశిస్తుంది":ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్
“మన 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ఇండియాఏఐ గతితార్కిక ఎనేబుల్‌గా ఉండబోతోంది”: ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్
"గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ డిసెంబర్ 10, 2023న నిర్వహించబడుతుంది. ఇందులో ఏఐ మరియు సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు చెందిన ప్రభావవంతమైన నాయకులు పాల్గొంటారు: ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
13 OCT 2023 7:07PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) ఏడు వర్కింగ్ గ్రూపులు ఈరోజు ఇండియాఏఐ యొక్క మొదటి ఎడిషన్ నివేదికను సమర్పించాయి. ఈ నివేదికను కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మరియు ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్‌కు అధికారికంగా అందజేశారు. ఏఐ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఈ నివేదిక భారతదేశానికి మార్గదర్శక రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
“నెలల పాటు అంకితభావంతో పరిశోధన చేసిన తర్వాత ఇండియాఏఐ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యాలను రూపొందించడానికి ఏర్పాటైన ఏడు వర్కింగ్ గ్రూపులు ఈరోజు తమ అధికారిక నివేదికను సమర్పించాయి. ఈ సమగ్ర నివేదికలో ప్రధాని మోదీ రూపొందించిన ఇండియాఏఐ వ్యూహం ఏవిధంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆయన భారతదేశం కోసం ఏఐ మరియు ఏఐ కోసం భారతదేశంపై మాట్లాడాడు. ఈ రోడ్‌మ్యాప్ ద్వారా ఇండియాఏఐ 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీకి గతితార్కికంగా పని చేస్తుంది” అని మంత్రి చెప్పారు.
ఏఐ పట్ల భారత ప్రభుత్వ యొక్క విధానం సంపూర్ణంగా మరియు ప్రతిష్టాత్మకంగా ఉంది.ఇండియాఏఐ కింద ప్రభుత్వ జోక్యాల విస్తృతి మరియు పరిధికి ఈ కార్యక్రమం నిదర్శనం.
ఇండియాఏఐ ఓ మిషన్ సెంట్రిక్ విధానాన్ని కలిగి ఉంది. ఇది ఇప్పటికే ఉన్న ఏఐ పర్యావరణ వ్యవస్థలోని అంతరాలను పూడ్చడానికి ఖచ్చితమైన మరియు బంధన వ్యూహాన్ని నిర్ధారిస్తుంది. ఏఐలో భారతదేశ పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా, ఏఐ ఫైనాన్సింగ్, పరిశోధన మరియు ఆవిష్కరణ, లక్ష్య నైపుణ్యం మరియు డేటా కోసం సంస్థాగత సామర్థ్యం సంభావ్యతను పెంచుతాయి.
స్టార్టప్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్‌కు మాత్రమే కాకుండా ఇండియా డేటాసెట్ ప్రోగ్రామ్ మరియు ఇండియా ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫారమ్ వంటి ఇతర రంగాలకు కూడా ఇంటియాఏఐ ఉత్ప్రేరకాన్ని మరియు మద్దతునిస్తుందని మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ హైలైట్ చేశారు.
“స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం మరియు స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను అందించడమే కాకుండా, ఇండియా ఏఐ ప్రోగ్రామ్ అనేక కీలక అంశాలను కలిగి ఉంటుంది. భారతదేశ డేటాసెట్‌ల ప్లాట్‌ఫారమ్‌లో ఒక కీలకమైన భాగం ఉంటుంది. ఇది భారతీయ పరిశోధకులు వారి బహుళ పారామీటర్ మోడల్‌లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే అనామక డేటాసెట్‌ల యొక్క అతిపెద్ద సేకరణలలో ఒకటి. అప్పుడు ఇండియా ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫారమ్ ఉంటుంది, ఇది మా స్టార్టప్‌లు మరియు పరిశోధకుల కోసం గణనీయమైన జీపియు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) సామర్థ్యాన్ని సృష్టించే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్. స్కిల్లింగ్‌తో పాటు, సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్‌తో భాగస్వామ్యంతో ఏఐ చిప్‌ల అభివృద్ధికి కూడా ఇండియా ఏఐ మద్దతు ఇస్తుంది” అని మంత్రి తెలిపారు.
నేషనల్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్ (ఎన్‌డిఎంఓ) ద్వారా డేటా సేకరణ, నిర్వహణ, ప్రాసెసింగ్ మరియు నిల్వను నియంత్రించే సంస్థాగత ఫ్రేమ్‌వర్క్ మరియు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈలు) ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ అంశాలను వర్కింగ్ గ్రూపులు వివరించాయి. భారతదేశంలో ఏఐ నైపుణ్యాలను మరింతగా పెంపొందించడానికి, పబ్లిక్-ప్రైవేట్ ద్వారా ఏఐ ఆవిష్కరణకు మద్దతుగా భారతదేశంలో ఏఐ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి భారతదేశం తన జనాభా డివిడెండ్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చు మరియు ఐటీ సూపర్‌పవర్‌గా దాని బలాన్ని ఎలా పొందగలదో కూడా నివేదికలో సిఫార్సులు ఉన్నాయి.
ఈ నివేదిక డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్‌ఐ) స్కీమ్‌పై సిఫార్సులను అందిస్తుంది. ఇది దేశీయ కంపెనీలు మరియు స్టార్టప్‌లు/ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడంతోపాటు డిజైన్ మౌలిక సదుపాయాల మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమ లక్ష్యం ఇండియాఏఐ యొక్క అన్ని కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాన్ని చేపట్టడం మరియు “అందరికీ ఏఐ” లక్ష్యాన్ని సాధించడానికి పని చేయాల్సిన తదుపరి చర్య అంశాలను గుర్తించడం.
“భారతదేశం కోసం ఏఐ మరియు ఏఐ కోసం భారతదేశం” అనే ప్రధాని మోదీ నిర్దేశం మేరకు డిసెంబర్ 2023లో మొదటి గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్‌ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ డిసెంబర్ 10, 2023న నిర్వహించబడుతుంది. ఇందులో ఏఐ మరియు మొత్తం సాంకేతిక పర్యావరణ వ్యవస్థ నుండి ప్రభావవంతమైన నాయకులు పాల్గొంటారు.ఏఐ పట్ల మన విధానం ట్రెండ్‌ను అనుసరించడం గురించి కాదు మన 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక లక్ష్యానికి ఏఐ గతితార్కిక ఎనేబుల్‌గా ఉండబోతోందనే లోతైన నమ్మకం మరియు నిబద్ధత. ఇది స్టార్టప్ మరియు రీసెర్చ్ ఎకోసిస్టమ్‌లో లోతైన సామర్థ్యాలను సృష్టిస్తుంది, నిజ జీవిత ఏఐ వినియోగ కేసుల పరంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. పాలసీ, ఫైనాన్సింగ్ మరియు వనరుల కోసం మొత్తం సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఇది మనకు మంచి లాంచింగ్ ప్యాడ్ అని నేను భావిస్తున్నాను" అని తెలిపారు.
***
(Release ID: 1967787)
Visitor Counter : 94