సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వచ్ఛతా ప్రచారం 3.0


చెత్తను పారవేయడం ద్వారా 1050 చ.అ.ల స్థలాన్ని మంత్రిత్వ శాఖ ఆదా చేసింది.

స్మారక చిహ్నాలు మరియు ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా 400 ప్రదేశాలలో ఏ ఎస్ ఐ పరిశభ్రత ప్రచారం నిర్వహిస్తోంది

Posted On: 13 OCT 2023 6:17PM by PIB Hyderabad

ప్రత్యేక స్వచ్ఛత ప్రచారం 3.0 అమలు దశ రెండవ వారంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (ఎం ఓ సీ) దాని అనుబంధిత, సబార్డినేట్ మరియు స్వయంప్రతిపత్త సంస్థలతో కలిసి పెండింగ్‌ను తగ్గించడం మరియు పరిశభ్రతను సంస్థాగతీకరించడం లక్ష్యంగా గుర్తించిన అన్ని కార్యకలాపాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

 

ఈ కాలంలో మంత్రిత్వ శాఖ సాధించిన సంచిత విజయాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఇంకా, మంత్రిత్వ శాఖ  చెత్తను పారవేయడం ద్వారా సుమారు 1050 చ.కి. అడుగుల విస్తీర్ణం స్థలం ఆదా మరియు రూ.3,57,999 ఆదాయం సమకూరింది. అంతేకాకుండా 15,969 ఫిజికల్ ఫైల్‌లలో 80 ఫైల్‌లు, 2058  ఫైల్‌లు మరియు 2133 ఇ-ఫైళ్లు వరుసగా సమీక్షించబడ్డాయి మరియు మూసివేయబడ్డాయి.

 

స.నెం.

వస్తువులు

 

లక్ష్యం

విజయాలు

 

1.

ఎం పీ సూచనలు

176

31

 

2

పీ ఎం ఓ సూచనలు

33

9

 

3

రాష్ట్ర ప్రభుత్వ సూచనలు

28

4

 

4

పార్లమెంటరీ హామీ

41

1

 

5

ప్రజా ఫిర్యాదులు

412

82

 

6

పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీల్స్

465

21

 

ఉత్తమ చొరవలు: ఉత్తమ కార్యక్రమాలలో భాగంగా ఎం ఓ సీ క్రింద ఉన్న కొన్ని సంస్థలు ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టాయి:-

 

ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, జడ్గల్‌పూర్ సుస్థిరత మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి స్థానిక గిరిజన యువకుల సహాయంతో శక్తివంతమైన "వృక్ష గృహం"ని ఏర్పాటు చేసింది.

       

తూర్పు జోనల్ కల్చరల్ సెంటర్, కోల్‌కతా ప్రత్యేక ప్రచారం 3.0 సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని శాంతి నికెంతన్‌లోని సృజని శిల్పగ్రామ్‌లో “చెత్త రహిత భారతదేశం” అనే అంశంపై ‘వేస్ట్ టు వండర్’ అనే వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించింది. విరిగిన మరియు విసర్జించిన వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మా దుర్గా దేవి యొక్క శిల్పం రూపొందించబడింది. ప్లాస్టిక్  భూతాన్ని నాశనం చేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

 

(వ్యర్థ పదార్థాలతో రూపొందించిన దుర్గా మాత శిల్పం)

 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్, 'వేస్ట్ టు ఆర్ట్' క్రియేషన్స్‌లో భాగంగా ప్లైవుడ్ బోర్డు, లైట్‌బల్బ్-హోల్డర్ మరియు వైర్లు వంటి వ్యర్థ పదార్థాలతో రూపొందించిన జింక యొక్క వినోదభరితమైన శిల్పాన్ని రూపొందించింది.

 

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా స్మారక చిహ్నాలు మరియు 25 ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా మంత్రిత్వ శాఖ గుర్తించిన 449 ప్రదేశాలలో 400 ప్రదేశాలలో పరిశుభ్రత డ్రైవ్‌ను ఉత్సాహంగా నిర్వహిస్తోంది.

 

(యునెస్కో, వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన చిత్తోర్ ఘర్ ఫోర్ట్ సైట్లలో పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించబడింది)

 

నేషనల్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా తన సేకరణలలో సుమారు 2.25 కోట్ల పేజీల రికార్డుల పునరుద్ధరణను అందించడానికి భారీ సంరక్షణ డ్రైవ్‌ను ప్రారంభించాలని ప్రణాళిక చేసింది. దీనికి 1,000 మంది కన్జర్వేటర్‌ల కోసం పని స్థలం అవసరం, వారు ఒక్కొక్కరు 500 వందల మందితో రెండు షిఫ్టులలో పని చేస్తారు. అంతేకాకుండా, వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు, అటాచ్డ్/సబార్డినేట్ కార్యాలయాలు మరియు పీ ఎస్ యూ ల నుండి గ్రూప్ 'బీ' మరియు అంతకంటే ఉన్నత మరియు తత్సమాన స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక ప్రచారం 3.0 వ్యవధిలో 2023 అక్టోబర్ 18 నుండి 20వ తేదీ వరకు రికార్డ్ మేనేజ్‌మెంట్‌లో ఓరియంటేషన్ కోర్స్ నిర్వహించబడుతోంది.  రోజువారీ పురోగతిని పర్యవేక్షించడం మరియు https://scdpm.nic.in వద్ద  ఎస్ సి డి పీ ఎం పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడుతోంది. 

 

***


(Release ID: 1967786) Visitor Counter : 56


Read this release in: English , Urdu , Hindi