జల శక్తి మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో జరిగిన
ఎన్.ఎం.సి.జి ‘ మహిళలు ,నీరు ’ చర్చాకార్యక్రమ ముగింపు సమావేశంజ
ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో మహిళలు రాయబారులుగా సేవలు అందిస్తారు : డిజి, ఎన్.ఎం.సి.జి
Posted On:
12 OCT 2023 2:04PM by PIB Hyderabad
మహిళలు , నీటి కి సంబంధించిన చర్చాకార్యక్రమ సిరీస్‌లో భాగంగా ఐదవది, చివరిది అయిన సమావేశం, 2023 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో గల బోట్ క్లబ్ హౌస్ లో జరిగింది. మహిళలు, నీటికి సంబంధించిన చర్చా కార్యక్రమ సీరీస్ ను గంగా ఉత్సవ్ 2022 సందర్భంగా ప్రారంభించారు. ఇది జలవనరుల రంగంలో మహిళల కీలకపాత్రను ప్రముఖంగా ప్రస్తావించేందుకు నిర్దేశించినది. ఇందుకు సంబంధించిన నాలుగు ఈవెంట్‌లు వారణాసి, కాన్పూర్, న్యూఢల్లీి, రిషీకేష్‌లలో జరిగాయి, 5 వది, చివరిది అయిన ఈ సమావేశ ముగింపు కార్యక్రమం అంతర్జాతీయ బాలికా దినోత్సవం రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కార్యక్రమ డైరక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్, ఇతరులు పాల్గొన్నారు. ఇందులో లారా సుస్టెరిసిక్, ఎస్‌జిఆర్, జిఐజెడ్ ప్రోగ్రామ్ డైరక్టర్ పాల్గొన్నారు. కాన్పూర్ అడిషనర్ లేబర్ కమిషనర్ శ్రీమతి సౌమ్యా పాండే, డవలప్ మెంట్‌ఆల్టర్నేటివ్స్ నుంచి డాక్టర్ స్వయం ప్రభ దాస్, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శ్రీమతి సుపర్ణ దేబరాయ్, పంచతత్వ ప్రతినిధి శ్రీమతి షిప్ర పాథక్, ఎస్.ఎం.సి.జిలు, జిల్లా గంగా కమిటీలు, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక కమ్యూనిటీలు, మహిళలు ఇందులో పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో సంగీత కార్యక్రమం నది ఔర్ నారి జరిగింది.
‘స్త్రీపురుషలను సమానంగా చూడడానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ, శ్రీ కుమార్, భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో బాలికల కీలక పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందుకు బాలికలకు గట్టి పునాది వేసేందుకు చర్యలు తీసుకున్నట్టు వారు తెలిపారు. భవిష్యత్తులో వారు ఒక గొప్ప శక్తిగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దడం జరుగుతోంది. ఇందుకు ప్రపంచ బాలికా దినోత్సవాన్ని ఎంచుకున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు వారు జిఐజెడ్‌కు అభినందనలు తెలిపారు.మహిళలు , నీటివనరులకు సంబంధించిన చర్చ గంగా వెంబడి అన్ని కీలక పట్టణాలలో చేపట్టడం జరిగింది. ఇది వారణాసి, కాన్పూర్, ఢల్లీి, రిషీకేష్ లలో చేపట్టారు. అన్ని కార్యక్రమాలూ, ఈ రోజుతో ముడిపడి ఒకదానితో ఒకటి ఉన్నవి. ఇది ప్రజలతో అనుసంధానమైనవి అని శ్రీ కుమార్ తెలిపారు.
డిజి, ఎన్.ఎం.సి.జి, మాట్లాడుతూ 2001`02 లో తాను నిజామాబాద్‌ఖ జిల్లా మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు, 1.4 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, వెయ్యి పాఠశాలల్లో మూడువేల టాయిలెట్లు నిర్మించినట్టు తెలిపారు.
మహిళలు ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. వారు ఈ విషయంలో ఎక్కువగా ప్రయోజనం పొందారని చెప్పారు. ఆవాస మంచినటీ కమిటీలు ఐదుగురు వంతున మహిళలతో ఏర్పడ్డాయని, ఆ రకంగా వారి మంచినీటి వనరులను కాపాడే బాధ్యతను వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలు డయేరియా కేసులను ఈప్రాంతంలో గణనీయంగా తగ్గించగలిగాయని చెప్పారు. మహిళల సాధికారత, లక్షిత మార్పుల విషయంలో భహువిధమైన ప్రభావం కలిగిఉంటుందని చెప్పారు. ఈ విషయంలో మహిళలే ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో రాయబారులుగా వ్యవహరిస్తారని డిజి ఎన్.ఎం.సి.జి తెలిపారు.
జల్‌జీవన్ మిషన్ లో స్వచ్ఛతా అభియాన్‌లో మహిళాసాధికారతకు లభించిన ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను దార్శనికుడైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మార్గనిర్దేశంలో అమలుచేస్తున్నది. నమామి గంగే పథకం కింద చేపట్టిన జలజ్ కార్యక్రమం గురించి శ్రీ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివరించారు.‘‘ గంగా బేసిన్ లో మేము 40 ప్రాంతాలలో జలజ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. జలజ్‌అవేర్‌నెస్, మేనేజ్‌మెంట్ (జె.ఎ.ఎం) సెంటర్‌ను ఇటీవల న్యూఢల్లీిలోని ధిల్లీ హాత్‌లో ప్రారంభించడం జరిగింది. ఇందులో స్వయంసహాయక బృందాలు చేసిన ఉత్పత్తులు ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు అందులోనూ, గంగా బేసిన్ లోని వారు ఉత్పత్తి చేసిన వాటికి ఆదరణ బాగా ఉంది ’’ అని శ్రీ కుమార్ తెలిపారు. జలజ్ కార్యక్రమం, గంగా బేసిన్ లోని మహిళల సాధికారతకు కూడా నిర్దేశించినది. ఇది వారు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి , వారిజీవనోపాథిని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడినట్టు ఆయన తెలిపారు.
ఎన్.ఎం.సి.జి డైరక్టర్‌జనరల్, నమామి గంగే కింద చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఇది నీటి నాణ్యతను ఏమేరకు పెంచిందో తెలిపారు. అలాగే నదిలో జలచరాల సంఖ్య పెరగడానికి దోహదపడడమే కాక ఆప్రాంత వాసుల జీవనోపాధిని కూడా మెరుగుపరిచిందన్నారు.
ఎన్.ఎం.సి.జి , జిఐజెడ్ ల కొలాబరేషన్‌తో సమగ్ర మహిళా, జల వనరుల చర్చా కార్యక్రమాల సిరీస్‌ను చేపట్టడం జరిగింది. ఇది జలవనరుల రంగంలో మహిళల పాత్ర ప్రాధాన్యతను ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చింది. సంప్రదాయకంగా భూమి, నీటి నిర్వహణ వంటి వాటి విషయంలో పురుషులే ఎక్కువగా నిర్ణయాలలో భాగస్వాములుగా ఉంటూ వస్తారు.ఈ విషయంలో మహిళల మేధస్సును ఉపయోగించుకోకుండా, వారి హక్కులను పట్టించుకోకుండా ఉంటూ వస్తుండడం జరుగుతోంది. ఇది పలు పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది. నీటివనరుల కాలుష్యం, వరదలు వంటివి ఈ వనరులు సక్రమంగా కాపాడుకోలేనందువల్ల కలుగుతున్నాయి. వాస్తవానికి నీటి సంరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. ఇంటి స్థాయిలో నీటి నిర్వహణలో మహిళలు ప్రధానంగా బాధ్యత కలిగి ఉంటారు. నదులు కలుషితం కావడం, పారిశ్రామిక ప్రాజెక్టులు, వ్యవసాయ సంబంధ రసాయనాలు వచ్చి నీటివనరులలో కలవడం వంటి వాటివల్ల జలవనరులు కలుషితమై పోతున్న పరిస్థితి.
జలవనరుల రంగానికి సంబంధించిన వివిధ కోణాలలో మహిళల పాత్ర గురించి ఈ వేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. అలాగే మహిళల పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలను ఇందులో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యక్తిగత సమావేశాలు, హైబ్రిడ్ ఈవెంట్ లు గంగా బేసిన్ వెంట పలు చోట్ల నిర్వహించడం జరిగింది. స్థానిక, ప్రాంతీ, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల స్థాయిలో చర్చలు నిర్వహించడం జరిగింది. ఇందులో పేనల్ చర్చలు, సైడ్ ఈవెంట్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, నీటి సంబంధిత కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం వంటి వాటిని చర్చించడం ఈ సమావేశాలలో ప్రముఖంగా చర్చించారు. జలవనరుల పరిరక్షణ రంగంలో మహిళల ప్రాధాన్యతను మరింత గా తెలియజేసేందుకు , వారి ప్రమేయాన్ని పెంచేందుకు. వారికి సాధికారత కల్పించే వ్యూహాలను రూపొందించేందుకు, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
***
(Release ID: 1967602)
Visitor Counter : 65