సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
నిర్ణయం తీసుకోవడంలో, ఎంతో కాలంగా మూల పడి ఉన్న వస్తువుల ప్రక్షాళనలో సమర్థతను సాధించడానికి పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపిపిడబ్ల్యూ)లో జోరుగా సాగుతున్న ప్రత్యేక ప్రచారం 3.0
డిఓపిపిడబ్ల్యూ, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్‌లు, వాటి అనుబంధ సంఘాల ద్వారా క్లీన్లీనెస్ డ్రైవ్, వ్యర్థాల నిర్మూలన కోసం 50 కంటే ఎక్కువ సైట్‌లు గుర్తింపు
ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లు, హామీలు, ఇంటర్ డివిజనల్ రిఫరెన్స్‌ల నిరంతర సమీక్ష
భౌతిక రికార్డులను సమీక్షించడం, నిలుపుదల షెడ్యూల్ ప్రకారం పాత ఫైళ్లను తొలగించడం, రికార్డు గదిని పునరుద్ధరించడం ద్వారా సమర్థవంతమైన రికార్డ్ నిర్వహణ
Posted On:
12 OCT 2023 12:36PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్ల వెల్ఫేర్ (డిఓపిపిడబ్ల్యూ), కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్‌లు, వాటి అనుబంధ సంఘాలతో పాటు, ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా పరిశుభ్రతను పెంపొందించడానికి, ప్రజల ఫిర్యాదుల పెండింగ్‌ను తగ్గించడానికి, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి, సుపరిపాలన కార్యక్రమాల ద్వారా నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంపొందించదానికీ, వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి గణనీయమైన చర్యలు చేపట్టింది. ప్రత్యేక ప్రచారానికి ముందస్తు సన్నాహాలు 15 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమయ్యాయి. డిఓపిపిడబ్ల్యూలో సమయానుకూలంగా తమ ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలను ఉత్సాహంగా నిర్వహిస్తోంది.
ప్రత్యేక ప్రచారం 3.0 సమయంలో సమీక్ష కోసం డిపార్ట్‌మెంట్ వెయ్యికి పైగా భౌతిక ఫైళ్లను గుర్తించింది. ఇప్పటివరకు, రికార్డులను పరిశీలించిన తర్వాత, దాదాపు వంద పాత భౌతిక రికార్డులు/ఫైళ్లు కలుపు తీయడం కోసం గుర్తించారు. షెడ్యూల్ పరంగా సుమారు తొమ్మిది వందల ఇ-ఫైళ్లు సమీక్ష కోసం గుర్తించారు.
ఈహెచ్ఆర్ఎంఎస్ 2.0 అనేది ఇంటిగ్రేటెడ్ సేవలు, పెన్షనర్ల సేవల సంతృప్తిని పెంపొందించడానికి వీలు కల్పించే కీలకమైన డిజిటల్ సేవల డెలివరీగా గుర్తించడం జరిగింది.
ప్రత్యేక ప్రచారం 3.0 అక్టోబర్ 2, 2023 నుండి ప్రారంభమైంది. 31 అక్టోబర్ 2023 వరకు కొనసాగేలా షెడ్యూల్ చేశారు. వారు నిరంతరం పర్యవేక్షిస్తున్న డిఓపిపిడబ్ల్యూ సీనియర్ అధికారులు, ప్రచార కార్యకలాపాలపై వ్యక్తిగత ఆసక్తిని కనబరిచారు. తద్వారా పాల్గొనే శ్రామిక శక్తిని ఉత్సాహపరిచారు, తదనుగుణంగా ప్రత్యేక ప్రచారం 3.0 స్ఫూర్తితో సత్ఫలితాలు సాధించారు.
***
(Release ID: 1967233)
Visitor Counter : 63