బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 కింద స్క్రాప్‌ను శిల్పాలుగా మార్చిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్


రూ.7 కోట్ల విలువైన 1344 మెట్రిక్ టన్నుల స్క్రాప్‌ ప్రక్షాళన

Posted On: 11 OCT 2023 12:32PM by PIB Hyderabad

స్పెషల్ క్యాంపెయిన్ 3.0 కింద, కోల్ ఇండియా అనుబంధ సంస్థ, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసిఎల్) ప్రక్షాళన  కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తోంది, స్క్రాప్ మెటీరియల్‌ని విక్రయించి కానీ ఇతరత్రా కానీ తొలగించి స్థలాన్ని ఖాళీ చేస్తుంది. అయితే, మరో అడుగు ముందుకు వేసి, మైనింగ్ స్క్రాప్ మెటీరియల్‌ను అందమైన శిల్పాలుగా మార్చడం ద్వారా వ్యర్థాల నుండి ఉత్తమమైన వాటిని రూపొందించడానికి ఈ పిఎస్యు ఈ ప్రచారాన్ని ఒక అవకాశంగా తీసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు  ప్రత్యేక ప్రచారాన్ని 3.0 నిర్వహించనున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛత, ప్రభుత్వ కార్యాలయాల్లో సంతృప్త విధానంతో పెండెన్సీని తగ్గించడం. ఇకపై ఉపయోగపడని స్క్రాప్ మెటీరియల్‌లను పారవేయడం అనేది ప్రచారంలో ప్రధాన భాగం.

ఎస్ఈసిఎల్  కి చెందిన జమున కొత్మా ఏరియా ప్రత్యేక ప్రచారం 3.0 కార్యకలాపాల క్రింద "స్క్రాప్ టు స్కల్ప్చర్"  చొరవను చేపట్టింది. ఈ ప్రాజెక్ట్  ప్రధాన లక్ష్యం బొగ్గు గనుల స్క్రాప్ పదార్థాలను వివిధ సృజనాత్మక శిల్పాలుగా మార్చడం.

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలోని బంకిం విహార్, జమున కొత్మా ప్రాంతంలో స్క్రాప్‌తో చేసిన ఈ శిల్పాలను ఉంచడానికి, ప్రదర్శించడానికి కొలీరీ పబ్లిక్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. స్క్రాప్-నిర్మిత శిల్పాలలో బొగ్గు గని కార్మికుడు, సింహం, క్రేన్ పక్షి, పువ్వు ప్రముఖమైనవి.

బొగ్గు గని కార్మికుడి శిల్పం టోర్ రాడ్ల స్క్రాప్, తేలికపాటి స్టీల్ కట్ ముక్కలు, బేరింగ్ హాల్వ్స్,  కన్వేయర్ బెల్ట్‌ల రోలర్‌లతో తయారు చేశారు. ఈ శిల్పం  బరువు దాదాపు 1.7 టన్నులు. 

 

 

సుమారు 1.5 టన్నుల బరువుతో, సింహం శిల్పం స్క్రాప్ టార్ రాడ్‌లు, తేలికపాటి స్టీల్ కట్ ముక్కలు, మెటల్ స్ట్రిప్స్, బేరింగ్ హాల్వ్‌లు, బేరింగ్ బాల్స్ మరియు కన్వేయర్ బెల్ట్ రోలర్‌లతో తయారు చేశారు.

 

క్రేన్ పక్షి, పూల శిల్పాలు స్క్రాప్ టోర్ రాడ్‌లు, తేలికపాటి స్టీల్ కట్ ముక్కలు, మెటల్ స్ట్రిప్స్, బేరింగ్ హాల్వ్‌లు, బేరింగ్ బోల్స్, వివిధ పరిమాణాల పైపుల ముక్కలు, కన్వేయర్ బెల్ట్‌ల రోలర్‌లతో తయారు చేశారు.  ఒక్కొక్కటి వరుసగా 2.3 టన్నులు మరియు 1.2 టన్నుల బరువు ఉంటాయి.

 

        

బొగ్గు గనులు పెద్ద మొత్తంలో స్క్రాప్ మెటీరియల్స్, సాధారణంగా సుదీర్ఘకాలం ఉపయోగించకుండా వదిలేసి, చివరికి వేలం వేసి, సామాన్య ప్రయోజనాల కోసం ఉత్పాదక ఉపయోగాలుగా మార్చే పరిస్థితుల  నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. 

ఈ శిల్పాలు రీజనల్ వర్క్‌షాప్, కొత్మా కొలీరీలో రూపొందించి తయారు చేశారు. ఈ శిల్పాలను రూపొందించడంలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

కొనసాగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ 3.0 సమయంలో, కోల్ పిఎస్యు  ఇప్పటికే దాదాపు 1344 మెట్రిక్ టన్నుల స్క్రాప్‌ను పారవేయడం ద్వారా రూ. 7 కోట్లు  కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. ఎస్ఈసిఎల్ ప్రధాన కేంద్రం, దాని అన్ని కార్యాచరణ ప్రాంతాలలో వివిధ సైట్‌లు ప్రక్షాళిస్తున్నారు. కంపెనీ సీపీగ్రామ్స్  ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల సగటు పరిష్కరించే  సమయం (1.10.2021 - 30.09.2022) కాలానికి 23 రోజుల నుండి (01.10.2022 - 30.09.2023) 08 రోజులకు గణనీయంగా తగ్గింది.

ప్రత్యేక ప్రచారం 2.0లో ఎస్ఈసిఎల్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన బొగ్గు పిఎస్యు లో ఒకటి. కంపెనీ మొత్తం 13 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న 45 సైట్‌లను క్లీన్ చేసింది.  1250 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ స్క్రాప్‌ను పారవేయడం ద్వారా దాదాపు రూ. 5.97 కోట్లు. ప్రచారం సమయంలో ఎస్ఈసిఎల్ ద్వారా క్లియర్ అయిన అన్ని కోల్ ఇండియా అనుబంధ సంస్థలలో ఇది అత్యధికం.

 

***


(Release ID: 1966879) Visitor Counter : 73