శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
హరిత భవిష్యత్తును శక్తిమంతం చేసేందుకు అత్యాధునిక క్వాంటం- సాంకేతికత మద్దతుతో హరిత హైడ్రొజెన్ ఉత్పత్తి ఆవిష్కరణ
Posted On:
11 OCT 2023 9:32AM by PIB Hyderabad
కొత్త ప్రక్రియ ద్వారా పదార్ధాల రాశి (త్రూపుట్) ఆధారిత హరిత/ పర్యావరణ అనుకూల హైడ్రొజెన్ ఉత్పత్తి సాంకేతికత అన్నది భారీ మొత్తంలో హరిత హైడ్రొజెన్ ఉత్పత్తిని పెద్ద మొత్తంలో పెంచుతుంది.
బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వచ్చిన గ్రీన్ కెప్లెరేట్ బృందం అభివృద్ధి చేసిన సాంకేతికతను పర్యావరణ మార్పు& స్వచ్ఛ శక్తి విభాగం, డిఎస్‌టి అధిపతి డాక్టర్ అనితా గుప్తా, పర్యావరణ మార్పు& స్వచ్ఛ శక్తి విభాగం, డిఎస్‌టి డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ రంజిత్ కృష్ణ పాయ్, ఐఐటి ఢిల్లీ నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ఆర్ సోండే లు వారణాశిలో దేశం నలుమూలల నుంచి ఆహ్వానించిన ఆ రంగ నిపుణుల సమక్షంలో ప్రారంభించారు.
పర్యావరణ అనుకూల ఇంధన ప్రత్యామ్నాయాలుగా హరిత హైడ్రొజెన్ ఉపయోగాలను డాక్టర్ సోమేనాథ్ గరాయ్, ప్రొఫెసర్ ఎస్.శ్రీకృష్ణతో కూడిన బృందం ప్రదర్శించింది. ఈ సాంకేతికతను ఈ బృందమే అభివృద్ధి చేసింది. వారు అధిక ప్రోటాన్ లభ్యత, చలనశీలతతో పాటు ఛార్జ్ బదిలీ వ్యవస్థతో తదుపరి తరం క్వాంటం- శక్తితో కూడిన ఫోటో ఉత్రేరకాన్ని ప్రవేశపెట్టడమే కాక శక్తి ఉత్పత్తి కోసం క్వాంటం ఉత్ప్రేరక అనువర్తనాలను అందించారు.
క్వాంటం ఎన్‌కాప్సులేషన్ కెమిస్ట్రీ గుణాలను ఉపయోగించడం ద్వారా హెచ్2 ఆర్ధిక వ్యవస్థను పెంచడంః హైడ్రొజెన్ & ఫ్యూయెల్ సెల్ కార్యక్రమం, స్వచ్ఛమైన శక్తి పరిశోధన చొరవ కింద నిర్బంధంలో నీటి విభజన చర్య కోసం వేగం పెంచడం అన్న ప్రాజెక్టు కింద సహాయాన్ని అందుకున్న ఈ సాంకేతికతకు సంబంధించిన పేటెంట్ పెండింగ్‌లో ఉంది.
అత్యాధునిక ఫోటో కెమికల్- రియాక్టర్ డిజైన్ సౌర శక్తిని గరిష్టంగా సంగ్రహించడానికి అంతర్నిర్మిత ప్రకాశం సమ్మేళనం, బాహ్య పుటాకార పరివర్తన ప్యానెళ్ళను కలిగి ఉంది.
ఈ బృందం ఒక నిరంతర ఎలక్ట్రాన్ తో కలిపిన ప్రోటాన్ సరఫరా వ్యవస్థను రూపొందించింది. పారిశ్రామిక లోహ వ్యర్ధాలను ఉపయోగించి ఎలక్ట్రాన్ ఇంజెక్టర్ (లోపలికి ప్రవేశపెట్టే) ఏర్పాటుతో ముందుకు సాగుతుంది. అంతేకాక, కఠినమైన సర్వోత్తమీకరణం తర్వాత, ల్యాబ్ స్కేల్‌లో హరిత హైడ్రొజన్ ఉత్పత్తి గరిష్ట రేటు 10రేటు 10 గ్రాముల ఫోటోకాటలిస్టులకి 1 లీటర్/ నిమిషానికి చేరుకుంది.
ఉత్పత్తి చేసిన హైడ్రొజన్ వాయువు అధిక స్వచ్ఛత కారణంగా, ఇంధనాన్ని అదనపు శుద్ధీకరణ లేకుండా ఉపయోగించగలగడం ద్వారా సాంకేతికత వ్యయాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఈ పరివర్తనాత్మక ఆవిష్కరణ శక్తి ఉత్పత్తి నుంచి రవాణా నుంచి వ్యవసాయంలో అనువర్తనాల వరకు వివిధ రంగాలలో విస్త్రత శ్రేణి అనువర్తనకు అవకాశాలను అందిస్తుంది.
గ్రీన్ కెప్లెరేట్ బృందం, నిల్వ అవసరంలేని ప్రత్యక్ష హైడ్రొజన్ అంతర్గత దహన ఇంజిన్ సాంకేతికతలను ఊహించింది. డిఎస్‌టి ద్వారా సమకూర్చిన నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులో భాగంగా వివిధ రకాల ఇంజిన్/ సిలిండర్ సామర్ధ్యాలను, కార్యాచరణలు కలిగిన ఆటోమొబైళ్ళకు అనువర్తింప చేస్తూ ప్రదర్శించింది.
***
(Release ID: 1966877)
Visitor Counter : 95