ఆర్థిక మంత్రిత్వ శాఖ

డీఎఫ్ఎస్ దాని సంస్థలు పెండెన్సీని తొలగించేందుకు,.. పరిశుభ్రతను మెరుగుపరచేందుకు


ప్రత్యేక ప్రచారం 3.0ని చురుకుగా చేపట్టాయి

- 2023 అక్టోబరు 2 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా 25,000 కంటే ఎక్కువ ప్రదేశాలలో పరిశుభ్రత ప్రచారాలు చేపట్టబడతాయి

Posted On: 11 OCT 2023 2:35PM by PIB Hyderabad

ఆర్థిక సేవల విభాగం (DFS), ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు దాని సంస్థలు పెండింగ్‌ను తగ్గించడానికి మరియు స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి 2 అక్టోబర్ 2023 నుండి ప్రత్యేక ప్రచారం 3.0 కింద కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా చేపట్టిన బహుళ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్ 5 అక్టోబర్ 2023న ఆర్థిక సేవల శాఖను సందర్శించారు.  డా. కరాద్ డీఎఫ్ఎస్ యొక్క రికార్డు గదిని కూడా సందర్శించారు. రికార్డు నిర్వహణ యొక్క ప్రస్తుత విధానాల ప్రకారం రికార్డులను నిర్వహించడానికి ప్రచార వ్యవధిని ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 10,000 కంటే ఎక్కువ ప్రజా ఫిర్యాదులు మరియు అప్పీళ్లు పరిష్కరించబడతాయి. డీఎఫ్ఎస్ సంస్థలు దేశవ్యాప్తంగా 25,000 స్థానాలకు తగ్గకుండా పరిశుభ్రత ప్రచారాలను చేపట్టాలని భావిస్తున్నారు.  వివిధ సంస్థలు 2 అక్టోబర్ నుండి 31 అక్టోబర్, 2023 వరకు తాము చేపట్టే కార్యకలాపాల రకాలపై బ్యానర్‌లను ప్రదర్శించాయి. డీఫ్ఎస్ యొక్క అన్ని సంస్థలు క్రమం తప్పకుండా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం గురించి సోషల్ మీడియా పోస్ట్‌లు చేస్తున్నాయి.

 

***



(Release ID: 1966873) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi