అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 21న "గగన్ యాన్ " టెస్ట్ వెహికల్ స్పేస్ ఫ్లైట్ (,"గగన్ యాన్ " టెస్ట్ వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ (టీవీ -డి 1) ప్రయోగం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


మానవ సహిత "గగన్ యాన్ " మిషన్‌కు ముందు వచ్చే ఏడాది మహిళా రోబోట్ వ్యోమగామి "వ్యోమిత్ర" ప్రయోగం.. డాక్టర్

"ప్రధానమంత్రి మోడీ భారతదేశ అంతరిక్ష రంగంలో విప్లవాత్మక చర్యలు అమలు చేసి తొమ్మిది సంవత్సరాల కాలంలో అభివృద్ధికి బాటలు వేశారు.. డాక్టర్ జితేంద్ర సింగ్

అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలలో వివిధ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు భారతదేశ నారీశక్తికి ప్రతి రూపంగా నిలిచారు.. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 10 OCT 2023 5:25PM by PIB Hyderabad

అక్టోబర్ 21న "గగన్ యాన్ " టెస్ట్ వెహికల్ స్పేస్ ఫ్లైట్ (,"గగన్ యాన్ " టెస్ట్ వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ (టీవీ -డి 1) ప్రయోగం జరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణు శాస్త్రం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) వెల్లడించారు. ఈరోజు ఇక్కడ జరిగిన చంద్రయాన్ మిషన్‌తో సంబంధం ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల సన్మాన కార్యక్రమంలో  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

"గగన్‌యాన్" మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ సామర్థ్యాన్ని కూడా ఇస్రో  పరీక్షిస్తుందని మంత్రి తెలిపారు.  2024 నాటికి మానవ రహిత, మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ఇస్రో పూర్తి స్థాయిలో  సన్నాహాలు ప్రారంభిస్తుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్   పరీక్ష శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహిస్తారు. గగన్‌యాన్ మిషన్ సమయంలో క్రూ మాడ్యూల్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళుతుంది.

క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని తిరిగి భూమికి తీసుకురావడం, బంగాళాఖాతంలో దిగిన  తర్వాత మాడ్యూల్‌ ను  వెలికి తీసే అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. మాడ్యూల్‌ను వెలికితీసేందుకు భారత నావికా దళం  ఇప్పటికే మాక్ ఆపరేషన్లు ప్రారంభించింది. 

ఈ పరీక్ష విజయంపై ఆధారపడి మొదటి మానవ రహిత "గగన్‌యాన్" మిషన్‌ ప్రయోగం జరుగుతుంది. తక్కువ భూ కక్ష్యలో అంతరిక్షంలోకి మానవ సహిత మిషన్‌ ను చేపట్టడానికి నదిగా ప్రయోగం జరుగుతుందని  మంత్రి తెలిపారు. మానవ సహిత "గగన్‌యాన్" మిషన్‌కు ముందు వచ్చే ఏడాది మరో పరీక్షా  ప్రయోగం జరుగుతుందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్  ఇది మహిళా రోబోట్ వ్యోమగామి "వ్యోమిత్ర"ని తీసుకు వెళుతుందని వెల్లడించారు. 

 400 కి.మీ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, వ్యోమ నౌకను  భారతీయ సముద్ర జలాల్లో దింపి వ్యోమగాములను  సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం లక్ష్యంగా గగన్ యాన్ ప్రయోగం నిర్వహిస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గగన్ యాన్ మిషన్ చేపట్టేందుకు వ్యోమగాములను  సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు  ప్రయోగ వాహనం, అంతరిక్షంలో  భూమి వంటి పర్యావరణాన్ని అందించడానికి అవసరమైన సౌకర్యాలు,,అత్యవసర పరిస్థితిలో బయటపడడానికి ఎస్కేప్ సదుపాయం, శిక్షణ, రికవరీ కోసం సిబ్బంది నిర్వహణ అంశాలు వంటి అనేక క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయడం, సిబ్బందికి  పునరావాసం  కల్పించడం కీలక అంశాలుగా ఉంటాయి అని  అన్నారు. 

 అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా ఉందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్ ‘‘చంద్రుడి ఉపరితలం  దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ఇటీవల చరిత్ర సృష్టించింది. సూర్యునిపై అధ్యయనం చేయడానికి  మిషన్ ఆదిత్య -1 ను ప్రయోగించి అంతరిక్ష రంగంలో తన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించి   అంతరిక్ష శాస్త్ర, సాంకేతిక రంగంలో శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన దేశాలలో తాన ఒకటి అనే స్పష్టమైన సందేశాన్ని అందించింది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  

అంతరిక్ష రంగంలో ఆంక్షలు సడలించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమ శక్త సామర్ధ్యాలు ప్రదర్శించేందుకు  భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అవకాశం కలిగించారని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. శ్రీ నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహంతో   విక్రమ్ సారాభాయ్ కలను సాకారం చేయడానికి,  భారతదేశం అపారమైన సామర్థ్యం, ప్రతిభను భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రదర్శిస్తున్నారని మంత్రి అన్నారు. 

"2020 జూన్ నెలలో అంతరిక్ష రంగంలో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆంక్షలు తొలగించిన తర్వాత  స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య  4 నుంచి  150 కి  పెరిగింది" అని ఆయన చెప్పారు.

తక్కువ ఖర్చుతో భారతదేశ అంతరిక్ష యాత్రలు జరుగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

రైల్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, జల వనరుల గుర్తింపు,  స్మార్ట్ సిటీలు, టెలిమెడిసిన్ మరియు రోబోటిక్ సర్జరీ వంటి వివిధ రంగాల్లో  స్పేస్ టెక్నాలజీ వినియోగం పెరిగిందని దీంతో ప్రజలకు సులభతరం జీవన విధానం అందుబాటులోకి వచ్చిందని మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి  ఒక్కరూ  స్పేస్ టెక్ ని ప్రతి గృహంలో వినియోగిస్తున్నారని మంత్రి అన్నారు. 

"తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ హయాంలో భారతదేశం  విపత్తు సామర్థ్యాలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి.  పొరుగు దేశాలకు కూడా భారతదేశం  విపత్తు సూచనలు అందిస్తోంది " అని ఆయన చెప్పారు.

భారత నారీశక్తికి ఇస్రో ప్రతిరూపమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు - మహిళా శాస్త్రవేత్తలు  పరిశోధన కార్యక్రమాలలో వివిధ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

 చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వీరముత్తువేల్, చంద్రయాన్-3 అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి కె. కల్పన, చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ M. శ్రీకాంత్,  ఆదిత్య L1 ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి నిగర్ షాజీని కేంద్ర మంత్రి సత్కరించారు.

 

<><><>


(Release ID: 1966871) Visitor Counter : 126


Read this release in: English , Hindi , Marathi , Urdu , Odia