సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్, 2023 నెలలో సిపిజిఆర్‌ఏఎంఎస్‌పై కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల పనితీరుపై 17వ నివేదిక విడుదల చేసిన డిఏఆర్‌పిజి


సెప్టెంబరు, 2023లో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు పరిష్కరించిన మొత్తం ఫిర్యాదులు 1,06,810

సెంట్రల్ సెక్రటేరియట్‌లో వరుసగా 14వ నెలలో నెలవారీ కేసుల సంఖ్య లక్ష దాటింది.

సెప్టెంబరు,2023 నెలలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ గ్రూప్ ఏ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాయి

సెప్టెంబర్, 2023 నెలలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ గ్రూప్ బి విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాయి

Posted On: 10 OCT 2023 11:29AM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్‌పిజి) సెప్టెంబరు, 2023కి సెంట్రల్‌లైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిపిజిఆర్‌ఏఎంఎస్) నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఇది ప్రజా ఫిర్యాదుల రకాలు మరియు వర్గాలను మరియు పరిష్కరించే స్వభావం యొక్క వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది.డిఏఆర్‌పిజి ప్రచురించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలపై ఇది 17వ నివేదిక.

సెప్టెంబరు, 2023 పురోగతి కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు పరిష్కరించిన 1,06,810 ఫిర్యాదులను సూచిస్తుంది. 2023 సంవత్సరంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో సగటు ఫిర్యాదుల పరిష్కార సమయం జనవరి నుండి సెప్టెంబర్ వరకు 19 రోజులు. ఈ నివేదికలు 10-దశల సిపిజిఆర్‌ఏఎంఎస్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో నాణ్యతను మెరుగుపరచడం మరియు సమయాన్ని తగ్గించడం కోసం డిఏఆర్‌పిజి ద్వారా స్వీకరించబడింది.

సెప్టెంబర్, 2023లో బిఎస్‌ఎన్‌ఎల్ కాల్ సెంటర్ 87,520 మంది పౌరుల నుండి అభిప్రాయాన్ని సేకరించింది. వీరిలో సుమారు 39% పౌరులు తమ సంబంధిత ఫిర్యాదులకు అందించిన పరిష్కారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఐఐటీ-కాన్పూర్ అభివృద్ధి చేసిన ఐజీఎంఎస్ 2.0 మరియు ఆటోమేటెడ్ అనాలిసిస్‌ను ట్రీ డాష్‌బోర్డ్ పోర్టల్‌లో 29 సెప్టెంబర్ 2023న గౌరవనీయమైన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.ఐఐటీ కాన్పూర్ అవగాహనా ఒప్పందాన్ని అనుసరించి ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ (ఐజిఎంఎస్‌) 2.0 డ్యాష్‌బోర్డ్‌ను అమలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో సిపిజిఆర్‌ఏఎంఎస్ అప్‌గ్రేడ్ చేయడానికి డిఆర్‌ఆర్‌పిజి.డ్యాష్‌బోర్డ్ దాఖలు చేసిన & పరిష్కరించబడిన ఫిర్యాదులు, రాష్ట్రాల వారీగా & జిల్లాల వారీగా దాఖలు చేయబడిన ఫిర్యాదులు మరియు మంత్రిత్వ శాఖల వారీగా డేటా యొక్క తక్షణ పట్టిక విశ్లేషణను అందిస్తుంది. అంతేకాకుండా ఫిర్యాదు యొక్క మూల కారణాన్ని గుర్తించడానికి డ్యాష్‌బోర్డ్ అధికారులకు సహాయం చేస్తుంది.

సెప్టెంబర్ 29, 2023న భారత్ జీపిటి బృందంతో డిఏఆర్‌పిజి నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్‌డిఏ)పై సంతకం చేసిందని కూడా నివేదిక పేర్కొంది. ప్రతి భారతీయుడు అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉండే భారతీయ సందర్భ డేటాను రూపొందించే ఆలోచనను భారత్‌జీపీటీ కలిగి ఉంది.ఎన్‌డీఏ ఆధ్వర్యంలో డిఏఆర్‌పిజి భారత్ జీపీటీతో డేటాను పంచుకుంటుంది. వారు సిపిజీఆర్‌ఏఎంఎస్‌ కోసం పెద్ద భాషా నమూనాను రూపొందించారు.

కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల కోసం సెప్టెంబర్, 2023కి సంబంధించిన డిఏఆర్‌పిజి నెలవారీ సిపిజీఆర్‌ఏఎంఎస్ నివేదిక యొక్క ముఖ్య ముఖ్యాంశాలు:

1. పీజీ కేసులు:

 

  • సెప్టెంబర్, 2023లో సిపిజిఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌లో 109098 పీజీకేసులు అందాయి. వీటిలో 106810 పీజీ కేసులు పరిష్కరించబడ్డాయి మరియు 30 సెప్టెంబర్ 2023 నాటికి 66835 పీజీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • సెంట్రల్ సెక్రటేరియట్‌లో పెండింగ్‌లు ఆగస్ట్, 2023 చివరి నాటికి 63461 పీజీ కేసుల నుండి సెప్టెంబర్ 2023 చివరి నాటికి 66835 పీజీ కేసులకు పెరిగాయి.

 

2. పీజీ అప్పీల్స్:

 

  • సెప్టెంబర్ 2023లో 20868 అప్పీళ్లు రాగా 19640 అప్పీళ్లను పరిష్కరించారు. సెంట్రల్ సెక్రటేరియట్‌లో సెప్టెంబర్, 2023 చివరి నాటికి 24258 పీజీ అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి
  • సెంట్రల్ సెక్రటేరియట్‌లో అప్పీళ్ల పెండెన్సీ ఆగస్ట్, 2023 చివరి నాటికి 23030 అప్పీళ్ల నుండి సెప్టెంబర్ 2023 చివరి నాటికి 24258 అప్పీళ్లకు పెరిగింది.


3. ఫిర్యాదుల పరిష్కార అంచనా మరియు సూచిక (జీఆర్‌ఏఐ)- ఆగస్టు, 2023
 

  • వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్, 2023 గ్రూప్ ఏ లోని ఫిర్యాదుల పరిష్కార అసెస్‌మెంట్ & ఇండెక్స్‌లో అగ్రగామిగా ఉన్నాయి
  • ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ సెప్టెంబరు, 2023 గ్రూప్ బీలో ఫిర్యాదుల పరిష్కార అసెస్‌మెంట్ & ఇండెక్స్‌లో అగ్రగామిగా ఉన్నాయి.

 

****


(Release ID: 1966322) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Marathi , Hindi