నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

భారతదేశం మరియు సౌదీ అరేబియా నూతన మరియు పునరుత్పాదక విద్యుత్ లో పెట్టుబడులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాయి

Posted On: 10 OCT 2023 12:13PM by PIB Hyderabad

భారతదేశం మరియు సౌదీ అరేబియా పరస్పరం నూతన మరియు పునరుత్పాదక విద్యుత్ రంగంలో  పెట్టుబడులను ప్రోత్సహించడానికి అంగీకరించాయి. నిన్న తన పర్యటన 2వ రోజు కేంద్ర విద్యుత్ & ఎన్ ఆర్ ఈ మంత్రి శ్రీ. ఆర్.కె. సింగ్ సౌదీ పెట్టుబడుల మంత్రి హెచ్‌ఈ ఖలీద్ అల్-ఫాలిహ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తరువాత శ్రీ సింగ్ సౌదీ వ్యాపార ప్రముఖులు మరియు పెట్టుబడిదారుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సౌర శక్తి, పవన శక్తి, హరిత హైడ్రోజన్ మొదలైన కొత్త మరియు పునరుత్పాదక ఇంధన రంగాలలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఏ సీ డబ్ల్యూ ఏ పవర్‌తో సహా సౌదీ అరేబియాలోని అన్ని ప్రధాన వ్యాపార సంస్థలు, అల్ఫానార్, ఏ డబ్ల్యూ జే ఎనర్జీ, అల్మజ్దూయీ, అబ్దుల్కరీమ్, అల్జోమైః ఎనర్జీ అండ్ వాటర్ కంపెనీ, కానూ ఇండస్ట్రియల్ & ఎనర్జీ, ఎల్ & టీ,నెస్మా రెన్యూవబుల్ ఎనర్జీ, పెట్రోమిన్, నెక్స్ట్‌జెన్ ఇన్‌ఫ్రా  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

సౌదీ అరేబియా వ్యాపార సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టగల విద్యుత్ శక్తి రంగ ప్రాంతాలపై ఇన్వెస్ట్ ఇండియా సంక్షిప్త ప్రదర్శనను అందించింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్‌లు, విద్యుత్ నిల్వ, విద్యుత్ పంపణీ మరియు హరిత హైడ్రోజన్ వంటి రంగాలలో భారతదేశంలో పెట్టుబడి అవకాశాలు ఈ సమావేశ సందర్భంగా  ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి.

 

రియాద్‌లోని సుడైర్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను కూడా ప్రతినిధి బృందంతో కలిసి శ్రీ ఆర్.కె.సింగ్ సందర్శించారు. ఈ ప్లాంట్ దేశం లో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ అలాగే ఈ పనిని భారతీయ కంపెనీ నిర్వహిస్తుంది. సౌదీ-ఇండియా బిజినెస్ కౌన్సిల్ గౌరవ మంత్రి గౌరవార్థం విందును కూడా ఏర్పాటు చేసింది.

 

అక్టోబర్ 08న మొదటి రోజు పర్యటనలో, రియాద్‌లో జరుగుతున్న మధ్య ప్రాచ్య మరియు ఉత్తర ఆఫ్రికా (మెనా) వాతావరణ వారం 2023 యొక్క ఉన్నత స్థాయి  భారత ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్ & ఎన్ ఆర్ ఈ మంత్రి నాయకత్వం వహించారు. మెనా వాతావరణ వారంలో భాగంగా, “మెనా ప్రాంతంలో ఇంధన పరివర్తనను అభివృద్ధి చేయడం: న్యాయమైన మరియు సమానమైన శక్తి పరివర్తనల కోసం సమ్మిళిత మరియు వలయ ఆర్థిక నమూనాను మెరుగుపరచడం” అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల ప్యానెల్‌లో  శ్రీ. ఆర్.కె.సింగ్ పాల్గొన్నారు. తదనంతరం, ఆయన "జీ ఎస్ టీ ప్రాంతీయ సంభాషణ: రియాద్ బౌలేవార్డ్ ఆశయం మరియు నగరాన్ని కలుపుకొనిపోయే సమ్మిళిత పరివర్తన కోసం చోదక శక్తులు మరియు సాంకేతికతలను హైలైట్ చేయడం" అనే అంశంపై కూడా ప్రసంగించారు. ఈ ప్రసంగాల సందర్భంగా, కేంద్ర మంత్రి మా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వాతావరణ మార్పు, సరసమైన మరియు నమ్మదగిన శక్తి నుండి అనేక ముఖ్యమైన సమస్యలను స్పృశించారు మరియు యూ ఏ ఈ లో రాబోయే కాప్ 28 వెలుగులో అనేక సమస్యలను లేవనెత్తారు.

 

రియాద్‌లో 08 అక్టోబర్ 2023న మెనా వాతావరణ వారోత్సవాల సందర్భంగా భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య విద్యుత్ అనుసంధానం, హరిత / స్వచ్ఛ హైడ్రోజన్ మరియు సప్లై చెయిన్‌ల రంగాలలో ఒక అవగాహన ఒప్పందం పై కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ మరియు సౌదీ అరేబియా ప్రభుత్వ ఇంధన మంత్రి మిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్-సౌద్లు సంతకాలు చేశారు. ఈ ఎమ్ఒయు రెండు దేశాల మధ్య  విద్యుత్ అనుసంధానం ఫీల్డ్; పీక్ సమయాల్లో మరియు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ మార్పిడి; ప్రాజెక్టుల సహ-అభివృద్ధి; హరిత / స్వచ్ఛ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక శక్తి యొక్క సహ-ఉత్పత్తి; మరియు హరిత / స్వచ్ఛ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో ఉపయోగించే పదార్థాల సురక్షితమైన, నమ్మదగిన మరియు నిలకడైన సరఫరా గొలుసులను కూడా ఏర్పాటు చేయడం లో సహకారం కోసం ఒక సాధారణ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

తదనంతరం, సౌదీ ఇంధన శాఖ మంత్రి హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌తో కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాలపై లోతైన చర్చలు జరిపారు. పైన పేర్కొన్న ఇంధన రంగ సహకార రంగాలలో పూర్తి సరఫరా మరియు విలువ గొలుసులను స్థాపించడానికి రెండు దేశాల మధ్య బీ2బీ బిజినెస్ సమ్మిట్‌లు మరియు సాధారణ బీ2బీ పరస్పర చర్యలను నిర్వహించాలని ఇద్దరు ఇంధన మంత్రులు నిర్ణయించారు.  రియాద్‌లో మెనా వాతావరణ వారోత్సవాల సందర్భంగా యూ ఎన్ ఎఫ్ సీ సీ సీ  కార్యనిర్వాహక కార్యదర్శి  సైమన్ స్టీల్న్‌తో కూడా గౌరవ మంత్రి సమావేశమయ్యారు. ప్రత్యేకంగా యూ ఏ ఈ లో రాబోయే కాప్28 నేపథ్యంలో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు.

 

వివిధ స్థాయిలలో నిరంతర చర్చల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో ఇండో-సౌదీ భాగస్వామ్యం గణనీయంగా బలపడింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసింది మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన రంగాలలో ఉమ్మడి సహకారాలు మరియు పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది.

 

***



(Release ID: 1966318) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi , Tamil