రక్షణ మంత్రిత్వ శాఖ
విద్యా శాఖ సీనియర్ అధికారుల కోసం సుసంపన్నత కార్యక్రమాన్ని నిర్వహించిన భారతీయ నావికాదళం
Posted On:
09 OCT 2023 9:58AM by PIB Hyderabad
వార్షిక విద్యా అధికారుల ఎన్‌రిచ్‌మెంట్ కార్యక్రమం 2023ను న్యూఢిల్లీలో 5&6 అక్టోబర్ 2023న భారతీయ నావికాదళం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతీయ నావికాదళ అకాడమీ ప్రిన్సిపల్ రేర్ అడ్మిరల్ రజవీర్ సింగ్, కమడోర్ జి రాంబాబు, కమడోర్ (నావల్ ఎడ్యుకేషన్, భారతీయ నావికదళపు విద్యా శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ శాఖకు సంబంధించిన వివిధ విధానపరమైన చొరవలను, సమకాలీన అంశాలను చర్చించి, భారతీయ నావికాదళ వృద్ధి, అభివద్ధి దిశగా క్రియాత్మక సామర్ధ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఇపిఎ), ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఐజిఎన్ఒయు)కు చెందినవారిని ఉన్నత విద్యతో సహా విద్యారంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఉపన్యసించేందుకు గెస్ట్ స్పీకర్‌లుగా ఆహ్వానించారు. అదనంగా, ఉపచారికసేవలు, ఇతర విద్యా సంస్థలు, నావికాదళ కేంద్రకార్యాలయంలోని ఇతర డైరెక్టొరేట్లు సహేతుకమైన, సమకాలీన అంశాలపై ప్రసంగించారు. తన ముగింపు ఉపన్యాసంలో విద్యా రంగం, శిక్షణ, నావికాదళ ఉద్యోగుల సంక్షేమంలో శాఖ పాత్రలో డైరెక్టొరేట్ ఆఫ్ నేవల్ ఎడ్యుకేషన్ ఇటీవలి కాలంలో తీసుకున్న చొరవలను సిబ్బంది& సిబ్బంది సేవల కంట్రోలర్ వైస్ అడ్మిరల్ కె. స్వామినాథన్ ప్రశంసించారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నభారతీయ నావికాదళం పాత్రకు అనుగుణంగా శాఖను రూపొందించడంలో సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించడాన్ని కొనసాగించాలని ఆయన ప్రతినిధులను ప్రోత్సహించారు.
***
(Release ID: 1966219)
Visitor Counter : 123