రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 3.0 కింద అపరిష్కృత సమస్యలను తొలగించి & పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంపై కీలకంగా దృష్టి పెట్టనున్న మాజీ సైనికోద్యోగుల విభాగం
Posted On:
09 OCT 2023 12:12PM by PIB Hyderabad
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం (డిఇఎస్‌డబ్ల్యు) పలు చొరవలను చేపట్టింది. పెండెన్సీని తొలగించడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి అంశాలను కీలకమైన దృష్టి పెట్టవలసిన అంశాలుగా గుర్తించింది. ఫలితంగా మెరుగైన రికార్డుల నిర్వహణ, పని సామర్ధ్యం మెరుగుపరచడమే కాక పారదర్శకతను పెంచి, స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేస్తుంది.
ప్రభుత్వ దస్త్రాల నిర్వహణ, నిరుపయోగంగా ఉన్న వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక ప్రచారం 3.0 స్వచ్ఛతను సంస్థాగతీకరించడానికి, పెండెన్సీని తొలగించడానికి ఒక పర్యాయ ఉత్తమ అభ్యాసంగా మాత్రమే కాక, రోజువారీ పనితీరులో వాటిని అలవాటుగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.
ఈ ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖ, దాని విభాగాలు/ అనుబంధ/ అనుషంగిక కార్యాలయాలకు సంబంధించి ్రపచారంపై ఎంత దృష్టిపెట్టారన్నది సమీక్షించనుంది. సమీక్షించి, తొలిగించేందుకు డిఇఎస్‌డబ్ల్యు 500 ఫైళ్ళను గుర్తించింది.
భారతదేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ, వివిధ జిల్లా సైనిక్ బోర్డులు, మాజీ సైనికోద్యోగుల కాంట్రిబ్యూటరీ ఆరోగ్య పథకపు పాలీక్లినిక్‌లు, జోనల్ రీసెటిల్‌మెంట్ కార్యాలయాలు వంటి అత్యధిక ప్రజా జోక్యం ఉన్న మారుమూల ప్రాంతాలు, కార్యాలయాలను చేర్చడానికి వివిధ ప్రాంతాలను గుర్తించింది.
గుర్తించిన మాజీ సైనికోద్యోగుల సంఘాలు కూడా స్వచ్ఛతా ర్యాలీలు, ఏకపర్యాయం వినియోగించే వినియోగాన్ని తగ్గించడం, గ్రామంలోని ఉమ్మడి ప్రాంతాలను శుభ్రం చేయడం తదితర కార్యకలాపాలను పలు ప్రాంతాలలో చేపడుతున్నాయి. ఉత్తమ అభ్యాసాలను నమోది చేసి, ప్రచార సమయంలో గణనీయమైన సహకారం అందించిన వారిని సత్కరించనున్నారు.
***
(Release ID: 1966216)
Visitor Counter : 112