మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీలో రేపు జరగనున్న ‘పిల్లల్లో పోషకాహార లోపం నిర్వహణ ప్రోటోకాల్ ’పై రేపు న్యూ ఢిల్లీలో జాతీయ కార్యక్రమం ప్రారంభం


వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ సమకూర్చిన వివరాలతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసిడి) తొలిసారిగా రూపొందించిన ప్రామాణిక జాతీయ ప్రోటోకాల్, పోషకాహార లోపం ఉన్న పిల్లల గుర్తింపు, నిర్వహణ కోసం వివరణాత్మక చర్యలను వెల్లడించనున్నది.

Posted On: 09 OCT 2023 3:49PM by PIB Hyderabad

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షతన అక్టోబర్ 10, 2023న విజ్ఞాన్ భవన్‌లో జరిగే జాతీయ కార్యక్రమంలో 'పిల్లలలో పోషకాహార లోపం నిర్వహణ కోసం ప్రోటోకాల్' ప్రారంభించనున్నారు. డబ్ల్యూసిడి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్, మహిళా, ]శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసిడి), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్&ఎఫ్డబ్ల్యూ) కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

దేశవ్యాప్తంగా డబ్ల్యూసీడీ, ఆరోగ్య శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యూనిసెఫ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఇంటర్నేషనల్ పీడియాట్రిక్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ బ్యాంక్, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బిఎంజిఎఫ్) వంటి కీలక అంతర్జాతీయ, ఇతర సంస్థల నుండి ప్రముఖులు, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న సిడిపిఓలు, లేడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లతో సహా ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా, చిన్నారుల్లో పోషకాహార లోపం నిర్వహణలో ఆదర్శప్రాయమైన అంకితభావం, నిబద్ధత ప్రదర్శించిన వివిధ రాష్ట్రాలు/యూటీల నుండి అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి సత్కరిస్తారు.

పోషకాహార లోపం అనే సంక్లిష్ట సవాలును సమిష్టి చర్యతో ఎదుర్కోవాలి. అవసరమయ్యే ఈ లక్ష్యం వైపు, ఆశించిన ఫలితాలను సాధించడానికి ఏకీకృత ప్రయత్నాలు అవసరం. ఎండబ్ల్యూసిడి ‘సాక్షం అంగన్‌వాడీ, మిషన్ పోషణ్ 2.0’ ఆధ్వర్యంలో, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కీలకమైన మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల సహకారంతో, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుండి తిరుగులేని మద్దతు, నిబద్ధతతో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించడం, వారి చికిత్స మిషన్ పోషణ్ 2.0 అంతర్భాగమైన అంశం. అంగన్‌వాడీ కేంద్రాలలో, కమ్యూనిటీలలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించడం, చికిత్స చేయడం, నిర్వహించడం, వారిని పోషకాహార పునరావాస కేంద్రాలకు (ఎన్ఆర్సి) లేదా వైద్య సహాయం కోసం ఎప్పుడు సూచించాలో అర్థం చేసుకోవడం, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మధ్య సన్నిహిత సహకారం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 

ఇటీవలి వరకు, తీవ్రమైన పోషకాహార లోపం (ఎస్ఏఎం) ఉన్న పిల్లల చికిత్స సౌకర్యాల ఆధారిత విధానాలకు పరిమితం చేయబడింది. ఈ సందర్భంలో, మొదటిసారిగా, ఎంహెచ్&ఎఫ్డబ్ల్యూ నుండి వచ్చిన వివరాలతో ఎండబ్ల్యూసిడి ద్వారా ఒక ప్రామాణిక జాతీయ 'ప్రోటోకాల్ ఫర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ మాల్‌నోరిష్డ్ చిల్డ్రన్' ('ప్రోటోకాల్') రూపొందించడం జరిగింది. ఇది అంగన్‌వాడీ స్థాయిలో పోషకాహార లోపం ఉన్న పిల్లల గుర్తింపు, నిర్వహణ కోసం రిఫెరల్, పోషకాహార నిర్వహణ, తదుపరి సంరక్షణ కోసం నిర్ణయం తీసుకోవడంతో సహా వివరణాత్మక చర్యలను అందిస్తుంది. 

***


(Release ID: 1966215) Visitor Counter : 162