ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశమంతటా శ్రమదాన్, జన్ భాగీదారి, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల క్రింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)
Posted On:
09 OCT 2023 2:36PM by PIB Hyderabad
"స్వచ్ఛ భారత్ సుందర్ భారత్" అనే దృక్కోణంతో డైరెక్టరేట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) శ్రమదాన్ మరియు జన్ భాగిదరి మరియు స్వచ్ఛతా హి సేవ కింద ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా సంస్థ సబ్ నేషనల్ యూనిట్లు, జోనల్ యూనిట్లు మరియు రీజినల్ యూనిట్ల ద్వారా భారతదేశం అంతటా కార్యాలయ ప్రాంగణాలు మరియు బహిరంగ ప్రదేశాలు/పార్కులలో విస్తృతంగా పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టింది. అధికారులు, సిబ్బంది అనేక చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానికులు కూడా ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు. నినాదాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులకు అవగాహన కల్పించి జనపనార సంచులను పంపిణీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టే విషయమై అవగాహన కల్పించారు. అవగాహన పెంచడం ద్వారా డీజీజీఐ పరిశుభ్రమైన, పచ్చదనం మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా అనేక పార్కింగ్ ప్రాంతాలు, మార్కెట్ స్థలాలు, పార్కులు, పాఠశాలలు, పురాతన/వారసత్వ దేవాలయాలు, అండర్ పాస్‌లు మొదలైనవి శుభ్రం చేయబడ్డాయి. సఫాయి మిత్రలను కూడా సత్కరించారు. పరిశుభ్రతకు భరోసా ఇవ్వడంలో వారు చేసిన కృషికి ప్రశంసించారు. స్వచ్ఛతపై ప్రత్యేక కార్యక్రమం 3.0 కింద డీజీజీఐ పాత రికార్డులు, ఈ-వ్యర్థాలు మరియు చెడిపోయిన వాహనాలతో సహా వాడుకలో లేని వస్తువులను పారవేసేందుకు కట్టుబడి ఉంది. ఈ దిశగా కార్యక్రమంలో చర్యలు చేపట్టారు.
***
(Release ID: 1966213)
Visitor Counter : 141