నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"జీవ ఇంధన పరిశోధనల్లో ఇటీవలి పురోగతిపై అంతర్జాతీయ సదస్సు"ను ఈ నెల 9-12 తేదీల్లో కపుర్తలాలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌ఎస్‌-ఎన్‌ఐబీఈ

Posted On: 07 OCT 2023 4:43PM by PIB Hyderabad

"జీవ ఇంధన పరిశోధనల్లో ఇటీవలి పురోగతిపై అంతర్జాతీయ సదస్సు"ను (ఐసీఆర్‌ఏబీఆర్‌ - 2023) ఈ నెల 9-12 తేదీల్లో సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో-ఎనర్జీ (ఎస్‌ఎస్‌ఎస్‌-ఎన్‌ఐబీఈ) నిర్వహిస్తోంది. ఇది, కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ. పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న సంస్థ ప్రాంగణంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సు నాలుగో ఎడిషన్ ద్వారా ప్రభుత్వం, బయోఎనర్జీ రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు ఒకచోటకు వస్తారు.

సదస్సు ఇతివృత్తాలు బయోమాస్ వనరుల నిర్వహణ; బయోమాస్/వ్యర్థాలను శక్తిగా మార్చడం; బయోమాస్‌కు విలువ కల్పించడం/వ్యర్థాల నుంచి విలువ ఆధారిత సరుకు/ఉత్పత్తులు; జీవ ఇంధన వ్యవస్థల మోడలింగ్; జీవ ఇంధనాల శుద్ధి కర్మాగారం, జీవ హైడ్రోజన్. ఈ ఇతివృత్తాలపై ప్రసంగాలు, సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయి.

కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా ఈ సదస్సును ప్రారంభిస్తారు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతీయ జీవ ఇంధన కార్యక్రమ ప్రచారం & అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భూపిందర్ సింగ్ భల్లా, ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.కె.పంత్ కూడా ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

ప్రపంచ దేశాల నుంచి పాల్గొనే ప్రతినిధులు మౌఖిక/పోస్టర్ ప్రదర్శనలు ఇస్తారు. సదస్సు చివరి రోజున ప్రతినిధులు జీవ ఇంధన ప్లాంటును కూడా సందర్శిస్తారు.

సమావేశం వివరాలను ఇక్కడ చూడవచ్చు.

శిలాజ ఇంధనాలను విపరీతంగా వినియోగించడం వల్ల ఇంధన భద్రత & పర్యావరణ పరిరక్షణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోంది. శిలాజ ఇంధనాలను భర్తీ చేయగల సామర్థ్యం కారణంగా బయోహైడ్రోజన్, బయోడీజిల్, బయోఇథనాల్, బయో మెథనేషన్, బయో-రిఫైనరీ, బయోమాస్ గ్యాస్‌, బయోమాస్ వంట స్టవ్‌లు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎస్‌ఎస్‌ఎస్‌-ఎన్‌ఐబీఈ, "జీవ ఇంధన పరిశోధనల్లో ఇటీవలి పురోగతి"పై 2011 నుంచి మూడు సదస్సులు నిర్వహించింది. జీవ ఇంధన రంగంలో ఆర్‌&డి ప్రయత్నాలు, విధానాలు, క్షేత్రస్థాయి అనుభవాలను పరిశోధకులు పంచుకున్నారు. విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, విధాన రూపకర్తల నుంచి ఉత్సాహభరిత భాగస్వామ్యం కనిపించింది. ఇప్పుడు నిర్వహించే నాలుగో సమావేశం వీటి పరిధిని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సదస్సు గురించి మరింత సమాచారాన్ని https://www.icrabr.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

***


(Release ID: 1965495) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi , Tamil