వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మరియు దాని పీ ఎస్ యూ లు/అనుబంధ/సబ్-ఆర్డినేట్ కార్యాలయాలు ప్రత్యేక ప్రచారం 3.0 కింద కార్యకలాపాలను నిర్వహిస్తాయి

Posted On: 07 OCT 2023 2:52PM by PIB Hyderabad

ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ వివిధ ప్రాంతాలలో ఉన్న దాని అనుబంధ కార్యాలయాలైన  ఎఫ్ సీ ఐ, సీ డబ్ల్యూ సీ, డబ్ల్యూ డీ ఆర్ ఏ, ఎన్ ఎస్ ఐ, మరియు ఐ జీ ఎం ఆర్ ఐ యి లో పెండింగ్‌లో ఉన్న విషయాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రచారాన్ని 3.O నిర్వహిస్తోంది. ప్రచార వ్యవధిలో పరిశుభ్రత కోసం తీసుకోవలసిన లక్ష్యాలను గుర్తించడానికి సెప్టెంబర్ 15, 2023 నుండి సన్నాహక దశ ప్రారంభమైంది. 2 అక్టోబర్ 2023 నుండి అమలు దశ ప్రారంభమై  31 అక్టోబర్ 2023 వరకు కొనసాగుతుంది.

 

ప్రత్యేక ప్రచారం 3.O యొక్క సన్నాహక దశ ప్రారంభం నుండి, డిపార్ట్‌మెంట్ దాని అనుబంధ కార్యాలయాలతో పాటు దేశవ్యాప్తంగా 1256 పరిశుభ్ర స్థలాలను గుర్తించింది. సమీక్షా సమావేశాల సందర్భంగా, సెక్రటరీ డి ఎఫ్ పీ డీ ప్రచారం కోసం చేపట్టిన కార్యకలాపాల పురోగతిని చర్చించారు. డి ఎఫ్ పీ డీ మరియు దాని అనుబంధ కార్యాలయాల సీనియర్ అధికారులందరినీ ప్రచార వ్యవధిలో లక్ష్యాన్ని సాధించడానికి వారి ఉత్తమ ప్రయత్నాలను అందించడానికి అవగాహన కల్పించారు. సెక్రటరీ డి ఎఫ్ పీ డీ  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని మానేసి, చెత్త రహిత భారతదేశాన్ని సృష్టిస్తామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ ఈ శాఖలోని అధికారులందరితో చేయించారు. జాయింట్ సెక్రటరీ(అడ్మిన్) కార్యాలయ ప్రాంగణంలో గుర్తించబడిన అన్ని పరిశుభ్రత స్థలాలను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో కనిపించే పరిశుభ్రతను నిర్ధారించడానికి డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు / అధికారులు అందరూ తమ శాయశక్తులా కృషి చేయాలని అభ్యర్థించారు.  నోడల్ అధికారులు రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. డీ ఏ ఆర్ పీ జీ  ద్వారా హోస్ట్ చేయబడిన ఎస్ సీ పీ డి ఎం  పోర్టల్‌లో పురోగతి అప్‌లోడ్ చేస్తారు. అన్ని పీ ఎస్ యూ లు/అనుబంధ/సబ్-ఆర్డినేట్ కార్యాలయాలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటాయి. దీనిని పరిశుభ్రత పండుగగా జరుపుకుంటున్నాయి.

 

ఇప్పటి వరకు లక్ష్యాలను గుర్తించడంలో గొప్ప విజయం సాధించింది. ఈ సంవత్సరం చెత్త పారవేసిన తర్వాత చాలా స్థలం ఖాళీ అవుతుందని అంచనా.చెత్త అమ్మకం ద్వారా తగిన ఆదాయం సంపాదించబడుతుంది. అమలు దశలో ఉన్న  షెడ్యూల్ ప్రకారం 1,94,542 భౌతిక రికార్డులు/ఫైళ్లు సమీక్ష కోసం గుర్తించారు. పీ ఎం ఓ / ఎం పీ /రాష్ట్ర ప్రభుత్వాలు/ఐ ఎం సీ మరియు పౌర సమస్యలు మరియు పార్లమెంట్ హామీల నుండి పెండింగ్‌లో ఉన్న అన్ని సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సన్నాహక దశలో గుర్తించబడిన చెత్త మరియు అనవసరమైన అంశాలు జీ ఎఫ్ ఆర్ లో సూచించిన విధానం ప్రకారం పారవేస్తారు. ఈ విభాగం యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ మరియు దాని అనుబంధ సంస్థ ద్వారా X (గతంలో ట్విట్టర్ అని పిలువబడేది)లో  ప్రచారంపై అవగాహన కల్పించడానికి 292 కంటే అధికంగా ట్వీట్లు పోస్ట్ చేసారు. ఈ శాఖ నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశగా ప్రచారం జోరుగా సాగుతోంది.

 

****



(Release ID: 1965488) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi , Tamil