శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎన్‌ఎం-ఐసిపిఎస్ మిషన్ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలతో అన్ని స్థాయిలలో గణనీయమైన ప్రగతి.. సాంకేతిక అనువాదానికి కేంద్రాలు కీలకం: డీఎస్ టీ కార్యదర్శి

Posted On: 07 OCT 2023 9:45AM by PIB Hyderabad

  నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్‌ఎం-ఐసిపిఎస్)  నెలకొల్పిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌ల (టిఐహెచ్‌లు) వల్ల సాంకేతిక పరిజ్ఞానం వినియోగం  ఎక్కువ అయ్యిందని  3వ నేషనల్ వర్క్‌షాప్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (టిప్స్) అభిప్రాయపడింది. జాతీయ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ దేశంలో గుర్తించిన అత్యుత్తమ  వ్యవసాయం,ఇంధనం , నీరు, రవాణా మొదలైన రంగాలలో హబ్ లు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. 4 సంవత్సరాల వ్యవధిలో అనేక కార్యక్రమాలు అమలు చేసిన హబ్ లు సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ఎక్కువ చేశాయని ఆయన వివరించారు. క్లిష్టమైన రంగాల్లో దేశం స్వావలంబన సాధించేలా చూసేందుకు సాంకేతిక వినియోగం ఎక్కువగా జరిగేలా చూడాలని ఆయన  సాంకేతిక నిపుణులకు సూచించారు.

శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ  సీనియర్ సలహాదారు డాక్టర్ అఖిలేష్ గుప్తా కేంద్రాల మధ్య మరింత సహకారం అవసరమని అన్నారు.  ఇతర మంత్రిత్వ శాఖలు , విభాగాలతో కలిసి అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందించి, మరిన్ని సంస్థలు ఏర్పాటు అయ్యేలా చూసేందుకు కృషి జరగాలని ఆయన అన్నారు.  

సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (TIPS)లో సాంకేతిక ఆవిష్కరణలపై జరిగిన  3వ జాతీయ వర్క్‌షాప్‌  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నెలకొల్పిన  సైబర్-సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (TIH) ఆధ్వర్యంలో జరిగింది.  నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ కింద కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ  ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించింది.

సైబర్-సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ లో  యుటిలిటీల ఎగ్జిక్యూటివ్‌లకు ప్రయోగాత్మకంగా శిక్షణ ఇస్తున్నామని  ఐఐటీ  కాన్పూర్ అఫిషియేటింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్  గణేష్ తెలిపారు దీనివల్ల  సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రత్యేక కేడర్‌ను ఏర్పాటు చేయడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.  సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, సైబర్ దాడులు అరికట్టే అంశాలపై సమగ్ర శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు. 

భారతదేశంలో ఏర్పాటైన  మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సెంటర్  సైబర్-సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్  అని ఐఐటీ  కాన్పూర్ ప్రాజెక్ట్ డైరెక్టర్  ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. దీనిలో నీరు, మురుగునీటి వ్యవస్థలు, పవర్ గ్రిడ్, న్యూక్లియర్ ప్లాంట్లు, రాకెట్‌ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడం, క్షిపణి నియంత్రణ అంశాలపై దృష్టి సారించి  సైబర్-సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని  ఆయన వివరించారు. 

ఎన్‌ఎం-ఐసిపిఎస్  మిషన్ డైరెక్టర్ డాక్టర్ . ఏక్తా కపూర్ మాట్లాడుతూ సిపిఎస్ రంగంలో భారతదేశాన్ని  అగ్రగామిగా మార్చడం,  సిపిఎస్ పరిజ్ఞానాన్ని   సామాజిక, వాణిజ్య వినియోగం లోకి తీసుకు రావడం వంటి   లక్ష్యాలను సాధించడంలో మిషన్ విజయవంతమైందని అన్నారు.  స్టార్టప్‌లను పెంపొందించడంలో, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, సిపిఎస్ రంగంలో   తదుపరి తరం సాంకేతిక నిపుణులను సిద్ధం చేయడం లాంటి అంశాలపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. 

కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ ( ఎన్‌ఎం-ఐసిపిఎస్   ) డిసెంబర్ 2018లో ప్రారంభమయింది.  పెరుగుతున్న సాంకేతిక అవసరాలను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అందుబాటులోకి తీసుకు రావడానికి , తదుపరి తరం సాంకేతిక నిపుణులను సిద్ధం చేయడానికి మిషన్ కార్యక్రమాలు అమలు చేస్తుంది. 

మిషన్ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టిట్యూట్‌లలో అధునాతన సాంకేతికతల్లో 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లు (ఏర్పాటు అయ్యాయి.సాంకేతికత అభివృద్ధి,అమలు, మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపకత,  స్టార్టప్‌ల అభివృద్ధి, అంతర్జాతీయ సహకార పరిశోధనలపై దృష్టి సారించి హబ్‌లు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.  మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి , మిషన్ కార్యాలయం, నిపుణుల కమిటీ సభ్యులు హబ్‌ల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్య కోసం తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. 

***



(Release ID: 1965401) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi , Tamil