ఆయుష్
ఆయుష్ మంత్రిత్వ శాఖలో పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్న పరిశుభ్రత ప్రత్యేక ప్రచారం 3.0
ప్రత్యేక ప్రచారం 3.0 మొదటి వారంలో 83 శాతం ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లు పరిష్కరించిన మంత్రిత్వ శాఖ
Posted On:
06 OCT 2023 7:22PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖలో పరిశుభ్రత ప్రత్యేక ప్రచారం 3.0 పూర్తి స్థాయిలో అమలు జరుగుతోంది. పరిశుభ్రతకు, పనితీరు మెరుగు పరిచే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ప్రచారం 3.0 కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన మంత్రిత్వ శాఖ వారం రోజుల వ్యవధిలో ( 2023 అక్టోబర్ 2 నుంచి 6 వరకు) లక్ష్యంలో 83 శాతం లక్ష్యం సాధించింది. అదేవిధంగా, ఈ వారంలో ప్రజా ఫిర్యాదుల కింద 65% లక్ష్యం సాధించింది
దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న కార్యక్రమాన్ని మంత్రిత్వ శాఖలో పెండింగ్ లో ఉన్న అంశాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించింది. పార్లమెంట్ సభ్యుల నుంచి అందిన 30 సూచనలు, పార్లమెంట్ లో ఇచ్చిన 17 హామీలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఒక ప్రతిపాదన,75 ప్రజా ఫిర్యాదులు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మూడు సూచనలు, 21 అప్పీళ్లు, 305 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని సన్నాహక కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ గుర్తించింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజా ఫిర్యాదుల అప్పీల్ , ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించింది. గుర్తించిన 24 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లలో 20 అప్పీళ్లు ఈ వారంలో పరిష్కారం అయ్యాయి. అదేవిధంగా ప్రజల నుంచి అందిన 75 ఫిర్యాదుల్లో 49 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన 3 సూచనల్లో 2 సూచనలు అమలు జరిగాయి. . ప్రత్యేక ప్రచారం 3.0 కింద నిర్ణయించుకున్న అన్ని ఇతర లక్ష్యాలను సాధించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో పని చేస్తోంది.
ప్రత్యేక ప్రచారం 3.0 అధికారికంగా 15 సెప్టెంబర్ 2023న ప్రారంభమయ్యింది. దేశవ్యాప్తంగా పరిశుభ్రత లక్ష్యాలను సాధించడానికి అమలు చేయాల్సిన కార్యక్రమాలను సన్నాహక దశలో గుర్తించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రచారం అమలు దశ ప్రారంభమైంది.కార్యాలయాలలో స్థల నిర్వహణ, పనితీరు మెరుగుపరచడానికి కార్యక్రమంలో ప్రాధాన్యత ఇస్తారు. అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలను సాధించడానికి, సమస్యల పరిష్కారానికి ప్రచారం 3.0 లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కార్యక్రమంలో భాగంగా మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనికిరాని వస్తువులు తొలగించి ఎక్కువ స్థలాన్ని అందుబాటులోకి తేవడం,కార్యాలయ ప్రాంగణాలను సుందరీకరించదానికి ప్రాధాన్యత ఇస్తారు.దీనివల్ల పని వాతావరణం మెరుగు పది ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుంది.
స్వచ్ఛత హి సేవ పక్వాడా లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛత ప్రతిజ్ఞ తీసుకున్నారు. చెత్త రహిత భారతదేశం నిర్మాణానికి కృషి చేస్తామని ప్రకటించారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి తమ వంతు కృషి చేయాలని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులందరినీ ఆదేశించింది. రోజువారీ పురోగతిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. సంస్థలు, సంస్థలు, కౌన్సిల్‌లు తమ ప్రాంగణాలు, పరిసరాలు, బస్టాండ్‌లు, పార్కులు, ఔషధ తోటలు , సరస్సులు, చెరువులు మొదలైన బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచాయి. సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయుష్ భవన్, పరిసరాలను శుభ్రం చేశారు. .
స్వచ్ఛత కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు , పరిశోధన సంస్థలు, జాతీయ సంస్థలు,అనుబంధ సంస్థలకు సూచనలు జారీ చేసింది. . పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి గతంలో అమలు చేసిన చర్యలు లక్ష్యాల మేరకు అమలు జరిగాయి. మొత్తం ర్యాంకింగ్‌లో మంత్రిత్వ శాఖ తన ర్యాంకింగ్ మెరుగు పరచుకుంటుందని ఆశిస్తున్నారు.
***
(Release ID: 1965263)
Visitor Counter : 119