రక్షణ మంత్రిత్వ శాఖ
సింగపూర్లోని చాంగి చేరిన తొలి శిక్షణ స్క్వాడ్రన్ నౌకలు
Posted On:
06 OCT 2023 7:08PM by PIB Hyderabad
భారత నౌకాదళానికి చెందిన యువ సిబ్బందికి శిక్షణ, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలలో భాగంగా తొలి శిక్షణ స్క్వాడ్రన్ నౌకలైన (1 టిఎస్)– ఐఎన్ఎస్
తిర్, ఐఎన్ఎస్ సుజాత, శిక్షణ నౌక ఐఎన్ ఎస్ సుదర్శిని, ఐసిఇఎస్ సారతథి 2023 అక్టోబర్ 4న సింగపూర్ లోని చాంగి చేరకుకున్నాయి.
ఈ నౌకల పర్యటనలో భాంగా శిక్షణ పొందుతున్న వారు వివిధ ప్రాంతాలను సందర్శించడంతోపాటు , వృత్తిపరమైన
కమ్యూనిటీ సంభాషణలలో పాల్గొంటారు, అలాగే పలు క్రీడాంశాలు ఇతర కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.
1 టిఎస్ సీనియర్ ఆఫీసర్ కెప్టెన్ సర్వ ప్రీత్ సింగ్, షిప్ కమాండింగ్ అధికారులు కమాండర్ మారిటైమ్ ట్రైనింగ్ అండ్ డాక్ట్రిన్ కమాండ్(ఎంటిడిసి),
కల్నల్ రిన్సంన్ చువా హాన్ లియాత్ను కలుసుకున్నారు. అలాగే సింగపూర్లో ఇండియా హైకమిషనర్ డాక్టర్ శిల్పకళా అంబులే ను కూడా వీరు కలుసుకున్నారు.
నౌకల కమాండింగ్ అధికారులు, వారితో పాటు శిక్షణార్థులు చరిత్రాత్మక క్రాంజి యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి
అమరులకు నివాళులర్పించారు.
ఈ పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల నావికాదళాల మధ్య
పరస్పర సహకారానికి ఉపకరిస్తుంది.
(Release ID: 1965262)
Visitor Counter : 93