గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దేశంలో నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు 2014 నుంచి ఇంతవరకు 18 లక్షల కోట్ల రూపాయల ఖర్చు.... గృహ నిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ ఎస్ పూరి
పట్టణ స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులుఎక్కువగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి... శ్రీ హర్దీప్ ఎస్ పూరి
పట్టణ స్థానిక సంస్థల సామర్థ్య పెంపుపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహణ
టూల్‌కిట్‌తో పాటు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరు నగరాల వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక విడుదల
Posted On:
05 OCT 2023 5:10PM by PIB Hyderabad
“సాంప్రదాయ పద్ధతిలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆలోచించడం సరిపోదు. ఈ విధానానికి కాలం తీరింది. భవిష్యత్తు అవసరాల మేరకు సౌకర్యాలు అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సేవలు అందేలా చూసేందుకు సమగ్ర సంపూర్ణ వ్యవస్థ నిర్మాణం కోసం దృష్టి సారించాలి. కార్యక్రమాలు, పథకాలు పటిష్టంగా అమలు చేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఏకీకరణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ” కేంద్ర గృహ నిర్మాణం,పట్టణ వ్యవహారాలు,పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి అన్నారు. పట్టణ స్థానిక సంస్థల సామర్థ్య పెంపుపై జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో మంత్రి ప్రసంగించారు. “భవిష్యత్తు లక్ష్యాలు సాధించడానికి, వ్యక్తిగతంగా, సంస్థాగతంగా సామర్థ్యాలను మెరుగు పరచడం లక్ష్యంగా వర్క్‌షాప్ జరుగుతుంది” అని ఆయన అన్నారు.
పట్టణ స్థానిక సంస్థల సామర్థ్య పెంపుపై నిర్వహిస్తున్న జాతీయ వర్క్‌షాప్ లక్ష్యాలను శ్రీ పూరి వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బి) సామర్థ్యం పెంపుదలకు ఏకీకృత విధానాన్ని పెంపొందించాలని లక్ష్యంగా వర్క్‌షాప్ జరుగుతుందని మంత్రి చెప్పారు.
గతంలో పట్టణీకరణ అంశానికి తగినంత ప్రాధాన్యత లభించలేదని శ్రీ పూరి పేర్కొన్నారు. పట్టణ ప్రాంత అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించిన శ్రీ పూరి 2004 నుంచి 2014 మధ్య పట్టణ ప్రాంతాల అభివృద్ధికి 1.78 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించారని వివరించారు.
2014 నుంచి కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి వివరించారు. భారతదేశ పట్టణాభివృద్ధి నమూనాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విప్లవాన్ని తీసుకువచ్చారని శ్రీ పూరి అన్నారు. నగరాలు , పట్టణాల పరివర్తన కోసం 2014 నుంచి ఇంతవరకు 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు.
యుఎల్‌బిలకు ఎక్కువ ఆర్థిక వనరులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోందని శ్రీ పూరి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి అన్నారు. . 2010-11 నుంచి 2014-2015 మధ్య కాలంలో 13వ ఆర్థిక సంఘం యుఎల్‌బిలకు 23,111 కోట్లు రూపాయలు కేటాయించిందని శ్రీ పూరి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ఈ కేటాయింపులను ఆరు రెట్లు పెంచి 2021-22 నుంచి 2025-2026 మధ్య 1,55,628 కోట్ల రూపాయలు కేటాయించింది అని ఆయన తెలిపారు.
మూలధన పెట్టుబడులను మార్కెట్ నుంచి సమీకరించడానికి అమృత్ మిషన్ కింద ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు.మున్సిపల్ బాండ్ల ద్వారా 12 నగరాలు రూ. 4,384 కోట్ల రూపాయలు సమీకరించాయని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు యుఎల్‌బిల రుణ యోగ్యతను పెంచి వాటిని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానాలుగా మార్చాయని ఆయన అన్నారు.
పట్టణ ప్రణాళికలో అమలు చేస్తున్న సంస్కరణల అంశాన్ని ప్రస్తావించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి పట్టణ ప్రణాళిక సంస్కరణలను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నేరుగా నిధులు అందించిందన్నారు.. భవన నిర్మాణ చట్టాల ఆధునికీకరణ, రవాణా ఆధారిత అభివృద్ధి, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కుల స్వీకరణ, సహజ విధానాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, సక్రమ పునరావాసం ద్వారా గృహ సౌకర్యం కల్పన, సామర్థ్యం పెంపుదల,జిఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లానింగ్, ఆన్‌లైన్ లో అనుమతులు జారీ చేయడం లాంటి సంస్కరణలు ప్రాధాన్యతా క్రమంలో అమలు జరుగుతున్నాయని శ్రీ పూరి వివరించారు.
దేశంలో స్థానిక పట్టణ సంస్థల సామర్ధ్య నిర్మాణాన్ని ఏకీకృత విధానంలో పెంపొందించడానికి మిషన్ కర్మయోగి కింద కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంయుక్తంగా జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ఈ రోజు నిర్వహించాయి. సవాళ్లను గుర్తించడం, యుఎల్‌బి స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను మెరుగుపరచడానికి పరిష్కారాలను అమలు చేసి జాతీయ-స్థాయి ప్రాధాన్యతలకు అనుగుణంగా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా .వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
వర్క్‌షాప్ లో మూడు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరు నగరాలు (అహ్మదాబాద్, భువనేశ్వర్, మైసూరు, రాజ్‌కోట్, నాగ్‌పూర్ పూణే) వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక, సామర్థ్య నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేయడానికి రూపొందించిన టూల్‌కిట్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో శ్రీ పూరితో పాటు ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్,కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి పాల్గొన్నారు.
కార్యక్రమంలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన మున్సిపల్ కమీషనర్లు / పట్టణ స్థానిక సంస్థల సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, పరిజ్ఞానం మరియు పరిశ్రమ భాగస్వాములు, శిక్షణ సంస్థల అధ్యాపకులు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.సామర్ధ్య నిర్మాణంపై వర్క్‌షాప్ లో చర్చలు జరిగాయి.
6 పైలట్ నగరాల (అహ్మదాబాద్, భువనేశ్వర్, మైసూరు, రాజ్‌కోట్, నాగ్‌పూర్ , పూణే) వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక రూపొందించడంలోఅమలు చేసిన విధానం, పరిశీలనలు, అభ్యాసాల గురించి ప్రతినిధులకు వివరించారు.యుఎల్‌బి స్థాయిలో కార్యక్రమాలు, యుఎల్‌బి లు,శిక్షణా సంస్థల మధ్య ఉత్తమ అభ్యాసాలు, వనరుల మార్పిడి, భవిష్యత్తులో ఇతర యుఎల్‌బి లకు వర్తించే వ్యవస్థ, విధానం రూపకల్పన తదితర అంశాలను చర్చించారు.ఆరు యుఎల్‌బి లకు చెందిన 3,852 మంది అధికారులు కర్మయోగి కార్యక్రమం 4,561 కోర్సులను పూర్తి చేశారు.
మిషన్ కర్మయోగి లక్ష్యాలను సాకారం చేయడంలో వర్క్‌షాప్ కీలకమైన ముందడుగుగా ఉంటుంది. , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాల మేరకు నవ భారతదేశం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉన్న యుఎల్‌బి లు జాతీయాభివృద్ధికి , పాలనకు సమర్ధవంతంగా దోహదపడేలా చూసేందుకు . గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కృషి చేస్తున్నాయి.
మిషన్ కర్మయోగి గురించి
పౌర-కేంద్రీకృత పాలనను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (NPCSCB) - మిషన్ కర్మయోగి ప్రారంభించింది.సామర్థ్యం పెంపుదల, మానవ వనరుల నిర్వహణ కోసం 'నియమ-ఆధారిత' విధానం ద్వారా కాకుండా ' హోదా ఆధారిత' శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడానికి మిషన్ కర్మయోగి ద్వారా కృషి జరుగుతుంది. 'రోల్-బేస్డ్' లెర్నింగ్ సిస్టమ్‌కు మారడాన్ని సులభతరం చేస్తుంది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగి ని రూపొందించింది. అధికార యంత్రాంగంలో సామర్థ్య-నిర్మాణం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి బలోపేతం చేయడానికి మిషన్ కర్మయోగి ద్వారా కృషి జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలు అందించి దేశాభివృద్ధి, పరిపాలన అంశాలు వారు సమర్థవంతంగా నిర్వర్తించేలా చూసేందుకు మిషన్ ప్రయత్నిస్తుంది.
***
(Release ID: 1964930)
Visitor Counter : 128