నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఎ టు జీరో ఏసియాన్ శిఖరాగ్ర సమ్మేళనంలో ఐ.ఆర్.ఇ.డి.ఎ పెవిలియన్ ను ప్రారంభించిన మలేసియా ఉప ప్రధాని.


హరిత హైడ్రోజన్ వృద్ధికి పరిశోధన, ఆవిష్కరణలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చిన ఐ.ఆర్.ఇ.డి.ఎ సి.ఎం.డి.

Posted On: 05 OCT 2023 6:58PM by PIB Hyderabad

మలేసియా ఉప ప్రధానమంత్రి దాతక్ సెరి ఫదిల్లా యూసుఫ్, 2023 అక్టోబర్ 5న మలేసియాలోని కౌలాలంపూర్ లో ఎ టు జీరో (యాక్సిలరేట్ టు నెట్ జీరో) ఏసియాన్ శిఖరాగ్ర సమ్మేళనంలో , భారత పునరుత్పాదక ఇంధన,
అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ ఇడిఎ) పెవిలియన్ ను ప్రారంభించారు. ఏసియాన్ శిఖరాగ్ర సమ్మేళనం 2023 అక్టోబర్ 4నుంచి 6 వరకు కౌలాలంపూర్ లో నిర్వహిస్తున్నారు.

ఐఆర్ఇడిఎ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ , పలువురు సీనియర్ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మలేసియా డిప్యూటి ప్రధానమంత్రి ఇచ్చిన మద్దతుకు   శ్రీ ప్రదీప్ కుమార్ దాస్    కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాలో పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన చొరవ ను మరింత ముందుకు  తీసుకువెళ్లడంలో ఐఆర్ఇడిఎ పాత్ర , అది సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు.

భారత ప్రభుత్వ దార్శనికత , నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడానికి ఐఆర్ఇడిఎ కట్టుబడి ఉందని సిఎండి తెలిపారు..‘‘మలేసియా ఉప ప్రధానమంత్రి ఐఆర్ఇడిఎ పెవిలియన్ ను ప్రారంభించడం
ఆనందదాయకం. ఈ వేదిక ద్వారా మా నైపుణ్యాలను తెలియజేయడానికి, భాగస్వామ్యాలు కుదర్చుకోవడానికి, ప్రపంచం సాగిస్తున్న హరిత, సుస్థిర ఇంధన భవిష్యత్ కార్యకలాపాల కృషికి తమ వంతు సాయం చేయడానికి ఉపకరిస్తుంది.”అని ఆయన అన్నారు.
ఐఆర్ఇడిఎ పెవిలియన్, కంపెనీ సాధించిన విజయాలు, నైపుణ్యాలు, పునరుత్పాదక ఇంధన రంగానికి అది చేసిన కృషిని తెలియజేస్తుంది. ఈ వేదిక అంతర్జాతీయ భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి, పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం సాధించిన పురోగతిని తెలియజేయడానికి,
ఉపకరిస్తుంది. ఇది ప్రతినిధులు, పరిశ్రమ నిపుణులు, స్టేక్హోల్డర్లతో చర్చలు జరపడానికి, కొలాబరేషన్లకు, భవిష్యత్ పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో అవగాహన పెంచుకోవడానికి దోహదపడుతుంది.
దీనికితోడు, ఎ టు జీరో ఏసియాన్ శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా, ఐఆర్ఇడిఎ  సిఎండి రెండు పానెల్ చర్చలలో పాల్గొన్నారు. అవి ‘ హరిత ఇంధన ఆర్ధికత– ఏసియాన్ లో లోపాలు అంతరాలను చక్కదద్దడం”
‘హైడ్రోజన్ ఆర్ధిక వ్యవస్థ దిశగా విధానపరమైన మద్దతు, వాల్యూ చెయిన్ అభివృద్ధి, నీలి, హరిత హైడ్రోజన్ దిశగా ఆవిష్కరణలు’. ఐఆర్డిఎ సంస్థ ఐపిఒ (ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్)కు వెళ్లే ఆలోచనలో ఉన్నదని,
ఇది కంపెనీ భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన పెట్టుబడిని సమకూర్చుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.

ఫైనాన్సియర్లు, పరిశ్రమ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, హరిత ఫైనాన్సింగ్ విషయంలో బహుళ సవాళ్లు ఉన్నాయని, వీటికి ప్రత్యేక పరిష్కారాలు అవసరమని చెపారు. ఈ సవాళ్లు కొన్ని సంప్రదాయబద్ధమైనవని, మరికొన్ని కొత్తవి,
నూతన , అభివృద్ధి చెందుతున్న రంగాలకు సంబంధించినవని అన్నారు. పరిశ్రమ వర్గాలు ఈ సమస్యలను సమర్దంగా  ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, డిమాండ్ , సరఫరా వైపు దృష్టిపెట్టాలన్నారు.
 అద్భుతమైన హరిత హైడ్రోజన్ వాతావరణం కల్పించే  నేపథ్యంలో డిమాండ్, సరఫరా అంశాల విషయంలో తగిన చొరవ ఉండాలన్నారు. పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడి, ఆవిష్కరణల ద్వారా హరిత హైడ్రోజన్ వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈ పెట్టుబడులు హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి  తక్కువ ఖర్చు అయ్యే పద్ధతులను గుర్తిస్తాయని తెలిపారు. అలాగే రవాణా (పైప్లైన్, ద్రవరూప ఇంధనం), హైడ్రోజన్ హబ్ ల ద్వారా నిల్వ సదుపాయాలు కల్పించడం వంటి వాటిపై దృష్టిపెట్టాలన్నారు.
ఈ హబ్లు మౌలికసదుపాయాలను మరింతగా వినియోగించుకోవడానికి, హరిత హైడ్రోజన్ రంగం మరింత ముందుకు వెళ్లడానికి ఉపకరిస్తుందన్నారు.

గమనిక : భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్ తగిన చట్టబద్ధ నిబంధనలు, నియంత్రణా సంస్థల అనుమతులు, ఆమోదాలకు, మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా సంస్థ ఈక్విటీ వాటాల కోసం
ఐపిఒను తీసుకురానున్నది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (డిఆర్ హెచ్పి)ని 2023 సెప్టెంబర్ 7 వ తేదీతో, సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద 2023 సెప్టెంబర్ 8న
 దాఖలు చేసింది.డిఆర్హెచ్పి సెబి వెబ్ సైట్www.sebi.gov.in, బిఎస్ఇ వెబ్ సైట్ www.bseindia.com, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ www.nseindia.com, అలాగే ఐఆర్ఇడిఎ వెబ్ సైట్
www.ireda.in, బిఆర్ఎల్ఎం వెబ్ ఐట్, ఐడిబిఐ కాపిటల్ మార్కెట్స్, సెక్యూరిటీస్ లిమిటెడ్ వైబ్ సైట్ www.idbicapital.com,బిఒపి కాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ www.bobcaps.in,
ఎస్.బి.ఐ కాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ www.sbicaps.com లలో చూడవచ్చు. ఈక్విటీ షేర్లలో పెట్టుబడి అత్యంత రిస్క్ తో కూడుకున్నది కనుక, రిస్క్ కు సంబంధించిన అంశాలను డిఆర్హెచ్పిలోని రిస్క్అంశాలు పేర్కొన్న పేజీ 34ను చదువుకోవలసి ఉంటుంది.
బిడ్డర్లు కంపెనీ సెబి వద్ద దాఖలు చేసిన డిఆర్ హెచ్పి మీద మాత్రమే ఆధారపడి తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోరాదు.
ఈక్విటీ షుర్లు అమెరికా సెక్యూరిటీస్ చట్టం 1933 కింద గానీ లేదా అమెరికాలోని ఏదైనా రాష్ట్ర సెక్యూరిటీల చట్టం కింద కానీ రిజిస్టర్ కాలేదు. అందువల్ల ఇవి అక్కడ రిజిస్టర్ అయితే తప్ప అమెరికాలో వాటిని ఆఫర్ చేయడానికి,
 లేదా విక్రయించడానికి వీలులేదు. ఇందుకు సంబంధించి అమెరికా సెక్యూరిటీల చట్టం, అమ్మకానికి, రిజిస్ట్రేషన్కు  మినహాయింపు ఇస్తే తప్ప కుదరుదు.
అందువల్ల ఈ క్విటీషేర్లు  అమెరికా వెలుపల ఆఫ్ షోర్ లావాదేవీలుగా అందించడం జరుగుతుంది. దీనిని ఆయా సంబంధింత చట్ట పరిధిలో చేపట్టడం జరుగుతుంది. అమెరికాలో ఈ ఈక్విటీ షేర్లను పబ్లిక్కు ఆఫర్ చేయడం ఉండదు.



 

***



(Release ID: 1964885) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Hindi , Punjabi