మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీర గాథ ప్రాజెక్టు 3.0లో పాలుపంచుకోనున్న దేశ‌వ్యాప్తంగా 1.36 కోట్ల మంది పాఠ‌శాల విద్యార్ధులు

Posted On: 05 OCT 2023 6:27PM by PIB Hyderabad

మొత్తం 36 రాష్ట్రాలు, యుటిల నుంచి వ‌చ్చిన 1.36 కోట్ల పాఠ‌శాల విద్యార్ధులు వీర గాథ ప్రాజెక్టు 3వ ఎడిష‌న్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయుధ ద‌ళాల‌కు చెందిన అధికారులు/  సిబ్బంది త్యాగాలు, సాహ‌స కృత్యాల‌ను గౌర‌వించేందుకు విద్యార్ధులు క‌విత‌లు, పెయింటింగ్‌లు, వ్యాసాలు, వీడియోలు త‌దిత‌రాల‌ను పంపారు.  
ప్రాజెక్ట్ వీర గాథ‌ను గాలంట్రీ అవార్డ్స్ పోర్ట‌ల్ (జిఎపి- శౌర్య పుర‌స్కారాల పోర్ట‌ల్‌) కింద 2021లో ప్రారంభించారు.శౌర్య‌పుర‌స్కారాలు పొందిన వారి సాహ‌స చ‌ర్య‌ల వివ‌రాల‌ను, విద్యార్ధుల‌లోని సాహ‌స‌వంతుల జీవిత‌గాథ‌ల‌ను అందరికీ తెలియ‌చేయ‌డం ద్వారా దేశ భ‌క్తి స్ఫూర్తిని పెంపొందించి, పౌర చైత‌న్య విలువ‌ల‌ను వారిలో పెంపొందించే ల‌క్ష్యంతో దీనిని ప్ర‌వేశ‌పెట్టారు. 
పాఠ‌శాల విద్యార్ధులు శౌర్య అవార్డు విజేత‌ల జీవితాలు, చ‌ర్య‌ల ఆధారంగా సృజ‌నాత్మ‌క ప్రాజెక్టుల‌ను/  కార్య‌క‌లాపాల‌ను చేసేందుకు వేదిక‌ను అందించ‌డం ద్వారా ఈ గొప్ప ల‌క్ష్యాన్ని మ‌రింత తీవ్రం చేసింది. 
వీర గాథ ప్రాజెక్టు (ఎడిష‌న్‌-1 & ఎడిష‌న్‌-2)ను 2021లోను, 2022లోనూ నిర్వ‌హించారు. వీర గాథ ప్రాజెక్టు 3.0 కింద దిగువ‌న పేర్కొన్న కార్య‌క‌లాపాల‌ను నేటి వ‌ర‌కు నిర్వ‌హించారు -
పాఠ‌శాల స్థాయిలో కార్య‌క‌లాపాలుః పాఠ‌శాల‌లు 28-07-2023 నుంచి 30-09-2023 వ‌ర‌కు వివిధ ప్రాజెక్టుల‌ను, కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించి, ప్ర‌తి పాఠ‌శాల నుంచి 04 ఉత్త‌మ ఎంట్రీల‌ను మైగ‌వ్ (MyGov ) పోర్ట‌ల్‌పై అప్‌లోడ్ చేశారు. 
అదే స‌మ‌యంలో, దేశంలోని శౌర్య ప‌త‌కాల విజేత‌ల గురించి పాఠ‌శాల విద్యార్ధుల‌లో అవ‌గాహ‌న‌ను తెచ్చేందుకు త‌న క్షేత్ర సంస్థలు లేదా సైన్యం/  నావికాద‌ళం/  వైమానిక ద‌ళం ద్వారా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ  దేశ‌వ్యాప్తంగా పాఠ‌శాల‌ల కోసం వ‌ర్చువ‌ల్‌/  ముఖాముఖి అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు/  సెష‌న్ల‌ను నిర్వ‌హించింది. 
వీర గాథ ప్రాజెక్టు (ఎడిష‌న్‌-1)లో 8 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్ధులు పాలుపంచుకోగా, వీర‌గాథ్ ప్రాజెక్ట్ (ఎడిష‌న్‌-2)లో 19 ల‌క్ష‌ల‌కు పైగా విద్యార్ధులు భాగ‌స్వాములు అయ్యారు. 
వీర‌గాథ ప్రాజెక్ట్ (ఎడిష‌న్‌-1) & (ఎడిష‌న్‌-2) సంద‌ర్భంగా 25మంది విజేత‌లను (సూప‌ర్ 25) ఎంపిక చేశారు. వీరిని న్యూఢిల్లీలో విద్య మంత్రిత్వ శాఖ & ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ స‌త్క‌రించ‌నున్నాయి. కాగా, వీర గాథ ప్రాజెక్టు (3.0)లో జాతీయ స్థాయిలో 100మంది విజేత‌ల‌ను (సూప‌ర్ 100)ను ఎంపిక చేస్తారు, వీరిని న్యూఢిల్లీలో విద్యా మంత్రిత్వ శాఖ & ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా స‌త్క‌రించ‌నున్నాయి. ప్ర‌తి విజేత‌కు రూ. 10,000 న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌దానం చేస్తారు. 
ఈ ఏడాది, వీర గాథ ప్రాజెక్టు 3.0లో, జిల్లా స్థాయిలో (04 విజేత‌లు) & రాష్ట్ర‌/  యుటి స్థాయిలో (08 విజేత‌లు) స‌హా అటువంటి విజేత‌లు అంద‌రినీ ఆయా జిల్లాలు& రాష్ట్ర‌/  యుటిలు స‌త్క‌రిస్తాయి. 

 

***
 


(Release ID: 1964879) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi