వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పరిశ్రమ, అధునాతన సాంకేతికతలలో పెట్టుబడులు, సహకారాన్ని పెంపొందించడానికి యూఏఈ-భారతదేశం అవగాహన ఒప్పందం
సప్లై చైన్ రెసిలెన్స్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ, హెల్త్‌కేర్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్‌తో సహా పరిశ్రమ, అధునాతన సాంకేతికతలో యూఏఈ, భారతదేశం పరస్పర సహకారం
పరిశ్రమను డీకార్బనైజ్ చేయడం, పునరుత్పాదక శక్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడం కూడా ఒప్పందం లక్ష్యం.
प्रविष्टि तिथि:
05 OCT 2023 5:53PM by PIB Hyderabad
యూఏఈ, భారతదేశం స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో మరింత సన్నిహితంగా సహకరించుకోడానికి ఎమిరేట్స్ ప్యాలెస్‌లో గురువారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసాయి. ఈ అవగాహన ఒప్పందంపై యూఏఈ పరిశ్రమ, అధునాతన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్, భారతదేశ వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన హిస్ హైనెస్ షేక్ హమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో సంతకం చేశారు.
పారిశ్రామిక పెట్టుబడులను సులభతరం చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, పరిశ్రమలలో కీలక సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణను ప్రారంభించడంపై దృష్టి సారించడం ద్వారా, ఎమ్ఒయు ఉమ్మడి పారిశ్రామిక, సాంకేతిక పరిణామాల ద్వారా రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. “యూఏఈ నాయకత్వం దార్శనికతకు అనుగుణంగా, స్థిరమైన, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని అల్ జాబర్ అన్నారు. ఆర్థిక, సాంకేతిక, సామాజిక డొమైన్‌లలో భారతదేశంతో యూఏఈ బలమైన సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని, అధునాతన సాంకేతికత, స్థిరత్వ ప్రమాణాలకు అనుగుణంగా పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి సంతోషిస్తున్నాము" అని జాబర్ తెలిపారు. ఇది జాతీయ పారిశ్రామిక వ్యూహం లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని, 'మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్' చొరవ, యూఏఈని అధునాతన పరిశ్రమలకు, ముఖ్యంగా భవిష్యత్ పరిశ్రమలకు ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఉందని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన పరిశ్రమలు, ఇంధన పరివర్తన పరిష్కారాలు, ఆరోగ్య సంరక్షణ, అంతరిక్షంతో సహా రెండు దేశాల జాతీయ ఆర్థిక వ్యవస్థల కోసం ప్రాధాన్యతా రంగాలలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను ఎమ్ఒయు కలిగి ఉంది. ఇది స్థిరత్వం, వాతావరణ తటస్థత ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే వినూత్న, సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక రంగాలలో సన్నిహితంగా పని చేయడం ద్వారా, యూఏఈ భారతదేశం స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయగలవు. వారి ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యపరచగలవు, మరింత పోటీతత్వం, సమర్థవంతమైన, స్థిరమైన పరిశ్రమలను ప్రోత్సహిస్తాయి.
“ఈ ఎమ్ఒయు సహకార ప్రయత్నాలను అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో సంస్థాగత విధాన చట్రాన్ని రూపొందించడానికి కొత్త తలుపులు తెరుస్తుంది. ఇది అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక శక్తి, కృత్రిమ మేధస్సు, అనేక ఇతర ముఖ్యమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో, అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది."
సరఫరా గొలుసు స్థితిస్థాపకత, పునరుత్పాదక శక్తి, ఇంధన సామర్థ్యం, ఆరోగ్యం, జీవ శాస్త్రాలు, అంతరిక్ష వ్యవస్థలు, ఏఐ, పరిశ్రమ 4.0, అధునాతన సాంకేతికతలు, అలాగే ప్రమాణీకరణ, మెట్రాలజీతో సహా ఏడు కీలక రంగాలపై అవగాహన ఒప్పందం దృష్టి సారిస్తుందని యూఏఈ మంత్రి జాబర్ వెల్లడించారు.
సరఫరా గొలుసు స్థితిస్థాపకతను నిర్మించడానికి, ముడి పదార్థాలను సరఫరా చేసే అవకాశాలను గుర్తించడానికి యూఏఈ భారతదేశం సహకరిస్తాయి. వారు పారిశ్రామిక ఎనేబుల్మెంట్, పారిశ్రామిక వృద్ధి, అభివృద్ధికి ప్రోత్సాహకంపై ఉత్తమ అభ్యాసాలను కూడా పంచుకుంటారు, ఉదాహరణకు ఇంధనం, భూమి, కాపెక్స్, ఓపెక్స్, సాంకేతికత, కార్మిక వంటి రంగాలలో..
ఇంధన రంగంలో యూఏఈ భారతదేశం ఇంధన నిల్వ సాంకేతికతలు, స్మార్ట్ గ్రిడ్, ఐఓటి విస్తరణ, పునరుత్పాదక శక్తి, ఇంధన సామర్థ్యంలో పరిశోధన, అభివృద్ధిలో సహకరించుకుంటాయి. అదేవిధంగా, ఆరోగ్యం, జీవిత శాస్త్రాలలో, దేశాలు ఔషధాల అభివృద్ధి, బయోటెక్నాలజీ వినియోగం, పరిశోధన అభివృద్ధి రంగంలో సహకరించుకుంటాయి. .
యూఏఈ, భారతదేశం కూడా అంతరిక్ష వ్యవస్థలలో సన్నిహిత సహకారం ద్వారా తమ సంబంధిత అంతరిక్ష పరిశ్రమలను మెరుగుపరచుకోవాలని కోరుతున్నాయి. వాణిజ్య అభివృద్ధి, కమ్యూనికేషన్, భూమి పరిశీలన కోసం చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడం, ఉపయోగించడం, అలాగే అంతరిక్ష పరిశోధనలో దేశాలకు సహకరించడానికి ఈ ఎమ్ఒయు సహాయపడుతుంది. అంతరిక్ష రంగంలో పరిశోధన అభివృద్ధితో పాటు, అంతరిక్ష సంబంధిత వస్తువుల లైసెన్సింగ్ అభివృద్ధిలో కూడా దేశాలు సహకరిస్తాయి.
ఏఐ రంగంలో, అంతరిక్ష రంగం, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, సరఫరా గొలుసులలో ఏఐ సాంకేతికతల విస్తరణలో యూఏఈ, భారతదేశం సహకరిస్తాయి. మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌లో ప్రాధాన్యతా రంగాలలో సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు కలిసి పని చేస్తాయి
ఎంఓయూ కింద, సహకారంలో పారిశ్రామిక, విద్యాపరమైన సహకారాలు అలాగే పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటాయి. శాస్త్ర సాంకేతిక విధానాలకు సంబంధించి దేశాలు కూడా ఉత్తమ పద్ధతులు ఇచ్చి పుచ్చుకుంటాయి.
***
(रिलीज़ आईडी: 1964877)
आगंतुक पटल : 173