మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యాలను చురుగ్గా అమలు చేస్తున్న కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
శుభ్రపరిచేందుకు దేశవ్యాప్తంగా 40,000కు పైగా ప్రదేశాలను గుర్తించిన మంత్రిత్వ శాఖ
Posted On:
05 OCT 2023 2:30PM by PIB Hyderabad
కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థల్లో ప్రత్యేక ప్రచారం 3.0 చురుగ్గా అమలవుతోంది. 15 సెప్టెంబర్ 2023న ప్రారంభమైన ప్రత్యేక ప్రచారం 3.0 సన్నాహక దశలో అంగన్‌వాడీ కేంద్రాలు, వన్ స్టాప్ సెంటర్లు, శిశు సంరక్షణ సంస్థలు వంటి 40,000కు పైగా పరిశుభ్ర పరచాల్సిన ప్రదేశాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది. అక్టోబర్ 02న ప్రారంభమై అక్టోబర్ 31 వరకు కొనసాగుతున్న అమలు దశలో, గుర్తించిన లక్ష్యాలను విజయవంతంగా నెరవేర్చేందుకు మంత్రిత్వ శాఖ, స్వయంప్రతిపత్తి సంస్థలు పూర్తి ఉత్సాహంతో పని చేస్తున్నాయి. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచేలా కార్యాలయాల గదులను అందంగా తీర్చిదిద్దడం, ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
దేశాన్ని పరిశుభ్రంగా & వ్యర్థ రహితంగా మార్చడానికి, స్వచ్ఛత హి సేవ పఖ్వాడాలో భాగంగా మహిళా & శిశు అభివృద్ధి కార్యదర్శి మంత్రిత్వ శాఖ అధికారులందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
స్వచ్ఛత దివస్‌లో భాగంగా, మంత్రిత్వ శాఖ అధికారులు శ్రమదానంలో చురుకుగా పాల్గొన్నారు.
వివిధ భవనాల్లో ఉన్న మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, దస్త్రాల గదులను, ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా మహిళ & శిశు అభివృద్ధి కార్యదర్శి తనిఖీ చేశారు.
రోజువారీ పురోగతిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది, కేంద్ర పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగానికి చెందిన ఎస్‌సీపీడీఎం పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తుంది.
***
(Release ID: 1964718)
Visitor Counter : 130