వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం, గతి శక్తి విశ్వవిద్యాలయం


పీఎం గతిశక్తి మొత్తం ప్రపంచానికి ప్రణాళికా సాధనంగా మారుతుంది: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్

అవగాహన ఒప్పందం అమృత్ కాల్ దార్శనికత, సాఫల్య చక్రానికి మార్గం వేస్తుంది : శ్రీ గోయల్

Posted On: 04 OCT 2023 8:45PM by PIB Hyderabad

పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గతి శక్తి విశ్వవిద్యాలయ (జీఎస్వి) భారతదేశ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయడానికి సంకల్పించాయి. ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం, వివిధ రాష్ట్రాల్లోని వివిధ కేంద్రాలలో పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి సంబంధించిన కోర్సులు, పాఠ్యాంశాలను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి,  పంపిణీ చేయడానికి జీఎస్వి భారతదేశం అంతటా నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పీఎం గతిశక్తి మొత్తం ప్రపంచానికి ప్రణాళికా సాధనంగా మారుతుందని  అన్నారు. లాజిస్టిక్స్ రంగంలో లాంఛనీకరణకు మార్గం సుగమం చేస్తూ లాజిస్టిక్స్ నిపుణుల నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణాన్ని అందించే జీఎస్వీ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. నీతి ఆయోగ్, సిబిసి సహా 16కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు ఎంఒయుపై సంతకాలు చేశాయి.  ప్రణాళిక, అమలు; నిర్మాణాత్మక ప్రత్యేక అభివృద్ధి; సామర్థ్యం పెంపుదల దిశగా ఇది పని చేస్తుంది. 

ఇది లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడానికి, సమర్థవంతమైన లాజిస్టిక్స్,  పోటీ వ్యాపార పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి దారితీసే పీఎం గతిశక్తి విధానానికి విద్యాపరమైన శక్తిని తీసుకువస్తుందని శ్రీ గోయల్ చెప్పారు. ఇది అమృత్ కాల్ కు మంచి దిశనిచ్చే చర్య అని అన్నారు. ఈ ఎంఓయూ భారత్ లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పారు. ఇది సమగ్ర లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి ఊపు నిస్తూ విశ్వగురువుగా మారడానికి భారత్ ప్రయాణాన్ని ఆరంభించడానికి మార్గం వేస్తుంది. 

కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, గతి శక్తి విశ్వవిద్యాలయ ఛాన్సలర్, శ్రీ అశ్విని వైష్ణవ్, రైల్వే, మెట్రో, హై-స్పీడ్ రైల్వేలపై పరిశ్రమ దృష్టి సారించిన ఇన్నోవేషన్ ఆధారిత విశ్వవిద్యాలయం కోర్సులను అందించే ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. నిర్దిష్ట పరిశ్రమ/రంగం కోసం కేంద్రీకృత కార్యక్రమాల అభివృద్ధిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.  ఉదాహరణకు, ట్రాక్స్ టెక్నాలజీ, రైల్-వీల్ ఇంటరాక్షన్, థర్మోడైనమిక్స్, సిగ్నలింగ్ సిస్టమ్‌లు మొదలైన వాటిపై దృష్టి సారించడంతో సహా రైల్వేపై ఐదు కోర్సులు అభివృద్ధి చేశారు. జీఎస్వీ లో  అందించే ఫోకస్డ్ కోర్సులు విద్యార్థులను భవిష్యత్ వర్క్‌ఫోర్స్‌కు సిద్ధం చేస్తాయి- 15000 మంది విద్యార్థులు దీనిలో శిక్షణ పొందుతారు. విమానయాన పరిశ్రమలో హామీ ఉద్యోగాలు పొందడానికి. జీఎస్వీ భారతీయ నైపుణ్యాభివృద్ధి అవసరాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నిర్ధారిస్తుంది.

ఎంఓయుపై గతి శక్తి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ మనోజ్ చౌదరి, లాజిస్టిక్స్ విభాగం జాయింట్ సెక్రటరీ, శ్రీ ఇ.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంత్రులు పీయూష్ గోయల్,  అశ్విని వైష్ణవ్ సమక్షంలో సంతకాలు చేశారు. 

***


(Release ID: 1964524) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi