మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 05న తిరువనంతపురం చేరుకోనున్న సిఆర్‌పిఎఫ్ మహిళా మోటర్‌సైకిల్ యాత్ర -2023
మహిళా రైడర్లను సత్కరించనున్న కేంద్ర సహాయ మంత్రి వి. మురళీధరన్
Posted On:
04 OCT 2023 8:34PM by PIB Hyderabad
సిఆర్‌పిఎఫ్ మహిళా అధికారుల కోసం నిర్వహించిన ఆల్ వుమెన్ మోటర్‌సైకిల్ ఎక్స్‌పెడిషన్ -2023లో పాలుపంచుకున్న మహిళలను 05 అక్టోబర్ (గురువారం) 2023న తిరువనంతపురంలోని పల్లిపురంలోని సిఆర్‌పిఎఫ్ శిబిరంలో సత్కరించనున్నారు. విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడకు చేరుకోనున్న మహిళా అధికారులను సత్కరిస్తారు. రాష్ట్రీయ ఏకతా దివస్‌లో భాగంగా 05 అక్టోబర్ నుంచి 31 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు సిఆర్‌పిఎప్ మహిళా అధికారుల 3 బైక్ యాత్రలు నిర్వహిస్తున్నారు. దాదాపు 25మంది మహిళా అధికారులతో కూడిన మూడు బృందాలు శ్రీనగర్, షిల్లాంగ్, కన్యాకుమారి నుంచి యాత్రలను ప్రారంభించనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ 05 అక్టోబర్ 2023న ఉదయం 10.30 గంటలకు కన్యాకుమారి నుంచి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించనున్నారు. దాదపు 50మంది మహిళా అధికారుల బృందం 25 బైక్‌లపై అదే రోజున తిరువనంతపురం చేరుకోనున్నారు. అనంతరం మదురై వెళ్ళనున్న మోటర్‌సైకిల్ ర్యాలీని ఒలింపియన్ శ్రీమతి ఒమానా కుమారి జెండా ఊపి అక్కడి నుంచి ప్రారంభిస్తారు.
****
(Release ID: 1964523)