సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జైపూర్ లో సుపరిపాలనపై రెండు రోజుల ప్రాంతీయ సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారతావని 'వికసిత్' భారత్ కు నాంది పలికేందుకు చేస్తున్న అమృత కాల యాత్రను ప్రశంసించారు.


భారతదేశం ప్రధాని మోడీ నాయకత్వంలో 'వికసిత్' భారత్ గా ఆవిర్భవించే దశకు చేరుకుంది. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆరంభ పనులు సమర్ధవంతంగా సాధించడం జరిగింది: డాక్టర్ జితేంద్ర సింగ్

మోదీ ప్రభుత్వం సుపరిపాలన పద్ధతుల్లో అనేక ప్రగతిశీల చర్యలు తీసుకుందని, వీటిలో కొన్నింటిని ఇతర దేశాలు కూడా పేర్కొంటూ ఉదహరిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

"ఆత్మ నిర్భర్ భారత్‌" నిర్మించే లక్ష్యం దిశగా మనం ప్రారంభించిన ఈ ప్రయాణం క్యూ చివరలో ఉన్న చివరి వ్యక్తికి కూడా శ్రేయోదాయకంగా ఉండాలి. దేశ ప్రగతి, సంపద ఫలాలకు తనను దూరం చేశారని భావించకుండా చూసుకోవాలి." అని అన్నారు.

Posted On: 04 OCT 2023 5:10PM by PIB Hyderabad

 

          జైపూర్‌లో బుధవారం  సుపరిపాలనపై 2-రోజుల ప్రాంతీయ సదస్సును ప్రారంభిస్తూ, కేంద్ర శాస్త్ర & సాంకేతిక, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) , సిబ్బంది, ప్రజా సమస్యలు/ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి మరియు రోదసి శాఖల  సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశం 'వికసిత్' భారత్ ను  ప్రారంభించేందుకు అమృత్ కాలం వైపు సాగిస్తున్న   ప్రయాణాన్ని ప్రశంసించారు.

, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత్ "విక్షిత్" భారత్‌గా ఆవిర్భవించే దశకు చేరుకుంటోందని,  డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సమర్థవంతంగా పునాది వేశామని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇప్పుడు దేశం 'వికసిత్' భారత్ గా ఆవిర్భవించే దశకు చేరుకుంటోందని  అన్నారు.


       పౌరులకు సుపరిపాలన మరియు మెరుగైన సేవల బట్వాడా / పంపిణీ కోసం నవ్య సాంకేతిక పరిజ్ఞానాన్నిఅవలంభించడానికి మోడీ  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.  ఈ పద్ధతులకు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువమంది భాగస్వాములు అయ్యేటట్లు చూడాలి.   తద్వారా ఇతరులు కూడా వీటిని  అనుకరించగలరని మంత్రి అన్నారు. ఆశావహ జిల్లాలు, గతిశక్తి మరియు కోవిడ్ వ్యాక్సిన్ వంటి
ఉత్తమ అలవాట్లు కొన్ని ఇతరులకు ఆదర్శంగా మారాయని, ఇతర దేశాలు కూడా వీటిని ఉదాహరిస్తున్నాయని ఆయన అన్నారు.  

         దేశ పౌరులకు డిజిటల్ సాధికారత కల్పించడం ద్వారా "గరిష్ట పాలన - కనిష్ట ప్రభుత్వం' విధానం వాస్తవరూపం దాల్చిందని కేంద్ర మంత్రి అన్నారు.  శాస్త్ర & సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పౌరుల సాధికారతలో పురోగతివల్ల పడుతున్న పెద్ద పెద్ద అడుగుల్లో భారతావని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది" అని కేంద్ర మంత్రి అన్నారు.


          డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 'మన పౌరులను సాధికారులను చేయాలనే దృష్టితో 'ఆత్మ నిర్భర్ భారత్ (భారతావని స్వావలంబన) నిర్మాణం దిశగా మనం  ఈ ప్రయాణం ప్రారంభించాం.  అంతేకాక వరుస చివరలో ఉన్న వ్యక్తి శ్రేయస్సును  కూడా వదలకుండా ప్రగతి ఫలాలు అతనికి అందేలా చూడాలి' అని అన్నారు.

“ప్రధాని మోదీ తరచూ ఉద్బోధిస్తున్నట్లుగా- మన పౌరులకు సాధికారత కల్పించడం అంటే మన దేశంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ఉపాధి వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండేలా చూడడం. ప్రతి పౌరుడు, ప్రభుత్వ ఉద్యోగి  తమ పూర్తి
సామర్ధ్యం మేరకు పనిచేసే అవకాశం ఉన్న వాతావరణాన్ని సృష్టించడం అని కూడా దీని అర్థం, ”అని ఆయన అన్నారు.
 
“సుపరిపాలనపై నిర్వహిస్తున్న  ప్రాంతీయ సమావేశాలు ఉభయతారకంగా, ఉమ్మడి ప్రయోజనకారిగా ఉండే జ్ఞానం, అలవాట్ల మార్పిడికి ముఖ్యమైన వేదికగా పనిచేస్తాయి. జ్ఞానం మరియు అభ్యాసాలను బదిలీ చేయడానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తాయి.  పౌరులు కేంద్రకంగా పనిచేసే అధికారుల బృందాలను ప్రతి జిల్లాలో  ఏర్పాటు చేసి, దేశ అభివృద్ధిలో సత్వర పురోగతి సాధించడానికి వారి సామర్ధ్యాన్ని పెంపొందించాలి" అని ఆయన అన్నారు.

 సిటిజన్ సెంట్రిసిటీతో కూడిన అధికారుల బృందాలను ఏర్పాటు చేసి, దేశం అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధించడానికి ప్రతి జిల్లాలో వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, ”అని ఆయన అన్నారు.

పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదులు/సాధకబాధకాల శాఖ (DARPG) గత 9 సంవత్సరాలలో 24 ప్రాంతీయ సమావేశాలను నిర్వహించింది, ఒక్క 2022లోనే ఐదు జరిగాయి. ఈ సమావేశాలు భారతదేశం ఆమూలాగ్రములో ఏర్పాటు చేయడం జరిగింది. లేహ్ నుండి శ్రీనగర్ నుండి భోపాల్ నుండి బెంగుళూరు నుండి తిరువనంతపురం నుండి ముంబై వరకు, షిల్లాంగ్, కోహిమా మరియు ఇటానగర్ వరకు సమావేశాలను నిర్వహించడం జరిగింది.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,  300 ఉత్తమ అభ్యాసాల సంకలనాన్నిDARPG వెలువరించిందన్నారు.  దీనిని అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు  అమలు చేస్తాయి.  ఇది 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' మరియు 'హోల్ ఆఫ్ సైన్స్' విధానాన్ని నొక్కి చెప్తుంది.

ప్రజాస్వామ్యంలో ఫిర్యాదుల పరిష్కారం అత్యంత ముఖ్యమైన అంశం అని ప్రధాని మోడీ  నొక్కిచెప్పారని, డాక్టర్ జితేంద్ర సింగ్ అంటూ , 2014లో CPGRAMSను ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయని, ఈ రోజు మన దగ్గర దాదాపు 20 లక్షలు అంటే  10 రెట్లు ఎక్కువ. DARPG చేపట్టిన సంస్కరణల ఫలితంగా  కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఫిర్యాదులు పరిష్కరించే  సగటు సమయం 2021లో 32 రోజుల నుండి 2022లో 27 రోజులకు మరియు 2023 జనవరిలో 19 రోజులకు తగ్గుతూ వచ్చిందని వెల్లడించారు.  

"ఫిర్యాదుల పరిష్కారం జరుగుతున్న తీరుపై  ప్రజలకు  పెరిగిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు.

స్వచ్ఛతా ప్రచారానికి ప్రధాని ఇచ్చిన పిలుపు  ప్రజా ఉద్యమంగా మారిందని,  ప్రజలందరూ శ్రమ దానంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని డాక్టర్ జితేంద్ర యంగ్ విజ్ఞప్తి చేశారు.  గతంలో నిర్వహించిన రెండు ప్రత్యేక ప్రచారాలు విజయవంతం కావడంవల్ల భారత ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు  ప్రత్యేక ప్రచారం 3.0 నిర్వహిస్తోందని  తెలిపారు.  ఈ ప్రచారంలో స్వచ్ఛతతో పాటు
ప్రభుత్వ కార్యాలయాలలో అపరిష్కృత ఫైళ్లపై సంపూర్ణ  దృష్టి పెడతారు.

"ఇప్పుడు భారతావని రాష్ట్రాలన్నీ కలసికట్టుగా పనిచేసి గ్రామ స్థాయిలో సుపరిపాలన వాస్తవరూపం దాల్చడానికి కృషి చేయాలి.  సమన్వయము, సమన్విత నిర్మాణం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. "

 

***


(Release ID: 1964389) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi , Tamil