జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

100 % ఒడిఎఫ్ ప్లస్ మోడల్ హోదా పొందిన జమ్ము & కశ్మీర్


స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ కింద 6650 గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా ప్రకటించిన జమ్ము & కశ్మీర్

17.4 లక్షలకు పైగా ఇంటి మరుగుదొడ్లు, 5 లక్షల సోక్ పిట్లు, 1.8 లక్షల కంపోస్ట్ పిట్లు, 6509 వ్యర్థాలను వేరు చేసే షెడ్లు, 5523 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లను నిర్మించిన జమ్ము & కశ్మీర్

Posted On: 30 SEP 2023 5:52PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము & కశ్మీర్ లోని 20 జిల్లాలకు చెందిన 285 బ్లాక్  లలోని మొత్తం 6650 గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్  గ్రామాలుగా ప్రకటించడం ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ‘‘స్వచ్ఛత హే  సేవ’’ ప్రచార కార్యక్రమంలో మరో అద్భుత విజయం. యుటిలోని అన్ని గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ నమూనా గ్రామాలుగా ప్రకటించడం ఒక విశేషమైన మైలురాయి. ఈ కార్యక్రమం మరుగుదొడ్ల నిర్మాణానికే పరిమితం కాలేదు. ప్రతీ గ్రామంలోని మురుగునీరు, ఘన వ్యర్థాలను శుద్ధి చేయడానికి కూడా వ్యాపించింది. ఏదైనా గ్రామం ఒడిఎఫ్ ప్లస్ నమూనాగా గుర్తింపు పొందాలంటే మూడు దశలు దాటాలి. అవి ఆకాంక్ష, ఎదుగుదల, నమూనా. గ్రామంలో అతి తక్కువ పరిమాణంలోనే చెత్తాచెదారం, మురుగు నీరు కనిపించడంతో పాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ (ఎస్ఎల్ డబ్ల్యుఎం) వసతి  కూడా కలిగి ఉండి తగినంతగా స్వచ్ఛత చైతన్యం సాధించినట్టయితే దాన్ని ఒడిఎఫ్ ప్లస్ నమూనాగా ప్రకటిస్తారు.  

అన్ని గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్ నమూనా గ్రామాలుగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమం ప్రారంభించడానికి ముందే అందులో భాగస్వాములందరూ కలిసి కట్టుగా పని చేసేలా ఒక చోటికి చేర్చడం కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. ప్రతీ గ్రామానికి గ్రామీణ పారిశుధ్య సంతృప్తత ప్రణాళికలు (విఎస్ఎస్  పి) రూపొందించి ఆయా గ్రామాలకు ఎస్ఎల్ డబ్ల్యుఎం అందుబాటులో ఉండేలా చూశారు. ఆయా ప్రణాళికలకు అనుగుణంగా ఎస్ బిఎంజి, ఎంజిఎన్ఆర్ఇజిఏ కింద అవసరమైనన్ని ఎస్ఎల్ డబ్ల్యుఎం మౌలిక వసతులు కూడా అందుబాటులో ఉంచారు. అలాగే ఇళ్లలోని వంటగదులు, స్నానాల గదుల నుంచి వచ్చే వ్యర్థపు నీరు సేకరించడానికి ఇళ్ల వద్ద, కమ్యూనిటీ స్థాయిలో సోక్  పిట్లు, మాజిక్, లీచ్ పిట్లు నిర్మించారు. జమ్ము&కశ్మీర్  లో మొత్తం 4,83,404 వ్యక్తిగత సోక్  పిట్లు;  24,088 కమ్యూనిటీ సోక్  పిట్ల నిర్మాణం జరిగింది. కిచెన్  గార్డెన్లు ఉన్న ఇళ్లలో వ్యర్థపు నీటిని ఆ గార్డెన్లలోకి వదిలేలా గృహస్థులను చైతన్యవంతం చేశారు. బయో డీగ్రేడబుల్  వ్యర్థ నిర్వహణ పిట్లు,  కమ్యూనిటీ కంపోస్ట్  పిట్లు నిర్మించారు. ఎంజిఎన్ఆర్ఇజిఏ కింద ప్రజలు తమంత తాముగా గాని లేదా ప్రభుత్వం గాని 1,77,442 వ్యక్తిగల కంపోస్ట్  పిట్లు, 12621 కమ్యూనిటీ కంపోస్ట్  పిట్లు కూడా నిర్మించారు. స్వచ్ఛందంగా ఘన, ద్రవ ఆర్గానిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి అంగీకరించే విధంగా ప్రజలను చైతన్యపరిచేందుకు అధికసంఖ్యలో వీటిని నిర్మించారు. అలాగే పొడిచెత్త, తడి చెత్త రెండింటినీ వేరుచేసి తడిచెత్తను కంపోస్ట్  గా ప్రాసెస్  చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఒడిఎఫ్, ఒడిఎఫ్ ప్లస్ హోదా సాధించే ప్రయత్నంలో భాగంగా జమ్ము& కశ్మీర్  లో  మొత్తం 6509 వ్యర్థాల సేకరణ, వేరుచేసే షెడ్లను నిర్మించారు. 5523 కమ్యూనిటీ శానిటేషన్  కాంప్లెక్స్  లు; 17,46,619 ఇంటి మరుగుదొడ్లు నిర్మించారు.

పశువుల  పేడ, వంటగదుల వ్యర్థాలను సేకరించి వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు, తద్వారా బయోగ్యాస్/ బయో స్లరీ తయారుచేసేందుకు గోబర్ ధన్ పేరిట ఆర్గానిక్  బయో ఆగ్రో వనరులు  సేకరిస్తున్నారు. అలాంటి రెండు ప్రాజెక్టులు జమ్ము& కశ్మీర్  లో పని చేస్తున్నాయి. మరో 18 పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని పంచాయతీల్లోను ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించి వేరు చేసే ప్రక్రియలో స్థానికులు, యూత్ క్లబ్ లు, ఎన్ జిఓలు, నైపుణ్యం గల ఏజెన్సీల సేవలను వినియోగించుకుంటున్నారు. పేపర్, కలప, ప్లాస్టిక్ వంటివన్నీ ఒక్కొక్కటిగా వేరు చేస్తున్నారు. ప్రతీ ఇల్లు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థల నుంచి యూజర్  చార్జీలు వసూలు చేస్తారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టికి, వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపద సృష్టించేందుకు అన్ని జిల్లాల వ్యర్థాల సేకరణ ఏజెన్సీలకు ఒక ఆర్థిక నమూనా ఏర్పాటు చేశారు.  

గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతీ బ్లాక్  లోను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు (పిడబ్ల్యుఎంయు) ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ విభిన్న దశల్లో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ప్లాస్టిక్  ను శుద్ధి చేసి తుది డిస్పోజల్  కు సిద్ధం చేస్తారు. వ్యర్థాల నిర్వహణ పూర్తి కాలానుక్రమణికను పూర్తి చేస్తారు.

గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్ గా ప్రకటించడానికి స్పష్టమైన విజువల్స్, గ్రామ సభల వీడియోలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేందుకు వీలుగా ఆయా వీడియోలు, ఇతర మెటీరియల్  ను పోర్టల్  లో అప్  లోడ్  చేయాల్సి ఉంటుంది.  ఎస్ బిఎం-జికి చెందిన ఐఎంఐఎస్  పోర్టల్  లో  ఈ సమాచారం అంతటినీ సేకరించి ఎప్పటికప్పుడు అప్ డేట్  చేస్తూ ఉంటారు.

కార్యాలయాలు, గ్రామీణ స్థాయి సిబ్బంది, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల సామర్థ్యాల నిర్మాణం కోసం 20 జిల్లాల్లోని 285 బ్లాక్  లో సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సిబ్బందికి, స్వచ్ఛాగ్రహులకు ఈ మిషన్ సంపూర్ణ లక్ష్యాలు  సాధించేందుకు అనుకూలంగా శిక్షణ ఇచ్చారు.

పంచాయతీ స్థాయిలో సమాచారం పంపిణీకి, ఓరియేంటేషన్  కు ట్రెయినర్లకు శిక్షణ ఇచ్చారు. ఎస్ బిఎం (జి) కేవలం ఆస్తుల కల్పన విభాగం కాదు, ప్రతీ ఇంటిలోని వారి ప్రవర్తన మార్చే కార్యక్రమం.

పెయింటింగ్ లు, బ్యానర్లు, చైతన్య కార్యక్రమాలు, నుక్కడ్  నాటకాల ద్వారా చైతన్యం కల్పించడంపై సంబంధిత శాఖలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. స్వచ్ఛతా కార్వాన్, స్వచ్ఛతా కార్వాన్ 2.0, స్వచ్ఛతా ఇంటర్న్  షిప్, స్వచ్ఛతా యోధా ప్రతియోగిత, స్వచ్ఛతాన్, స్వచ్ఛతా బులెటిన్, స్వచ్ఛతా క్విజ్  ల వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం విజయవంతం చేసేందుకు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రజలను చైతన్యవంతం చేయడంలో పిఆర్ఐల పాత్ర కీలకం. ఇందులో కొందరు ఎంపికైన ప్రజా ప్రతినిధులు అసాధారణ కృషి చేస్తున్నారు. అందుకు వారికి అవార్డులు కూడా లభిస్తున్నాయి. జాతీయ  స్థాయి, యుటి స్థాయిలో ప్రశంసలు పొందుతున్నారు. నేడు జమ్ము కశ్మీర్  లోని ప్రతీ ఒక్క గ్రామంలోని ప్రతీ ప్రైవేలు, ప్రభుత్వ భవనంపై స్వచ్ఛతా సందేశం కనిపిస్తోంది.

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ రెండో దశ ప్రచారం జరుగుతున్న సమయంలో జమ్ము కశ్మీర్ అంతటా వినూత్న ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పాఠశాల హాజరును మెరుగుపరిచేందుకు ‘‘పింక్ టాయ్  లెట్లు’’ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శ్రీ అమర్  నాథ్  యాత్రీకుల జీరో ల్యాండ్ ఫిల్, పాలథీన్ ఇవ్వండి బంగారం పొందండి ప్రచారం, సంపూర్ణ అభివృద్ధి కోసం పింక్  సొసైటీలు, స్వచ్ఛతా సంవాద్  లు, స్వచ్ఛతా ఇంటర్న్ షిప్  లు,  స్వచ్ఛతా క్విజ్  లు, స్వచ్ఛతా యోధా ప్రతియోగిత నిర్వహిస్తున్నారు.

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్  లో పారిశుధ్య సవాళ్లను అధిగమించడానికి డైరెక్టరేట్ ఆఫ్ రూరల్ శానిటేషన్  విభాగం ‘‘వ్యర్థంపై యుద్ధం’’ చొరవ కింద మాజీ సైనికోద్యోగి పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత  కెప్టెన్ బినా సింగ్  ద్వారా నామినేషన్ సౌకర్యాన్ని ప్రకటించింది.

మరింత తెలుసుకోవడానికి ఈ క్లిక్ చేసి చదవండి : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1962357

స్వచ్ఛత హే  సేవ కార్యక్రమం కింద జమ్ము కశ్మీర్  కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రూరల్ శానిటేషన్ ‘‘స్వచ్ఛతా బులెటిన్’’ ప్రారంభించింది. ఎస్ హెచ్ఎస్ 2023 కింద జిల్లాలు నిర్వహించే సమాచార, విద్యా, కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యక్రమాల తాజా సమాచారం అందించడం దీని ప్రధాన లక్ష్యం. మరింత మంది కమ్యూనిటీ సభ్యులు ముందుకు వచ్చి స్వచ్ఛ, స్వస్థ భారత్  కు కృషి చేసే వాతావరణం ఇది కల్పిస్తుంది. కార్యక్రమం మదింపు, మెరుగుదలకు కూడా ఇది దోహదపడుతుంది.

ప్రజలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అందరి నిరంతర కృషితో ఒడిఎఫ్  ప్లస్ హోదా  సాధించడం సంబంధిత శాఖకు సాధ్యమయింది. అయితే జమ్ము కశ్మీర్  ను దేశంలో అత్యంత స్వచ్ఛమైన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించేందుకు నిరంతర కృషి కొనసాగేలా చూడడం ఒకక పెద్ద సవాలు.

విస్తారమైన మౌలిక వసతులతోనే సుస్థిరత సాధ్యమవుతుంది. జమ్ము కశ్మీర్  లోని గ్రామీణ ప్రాంతాల ఒడిఎఫ్  ప్లస్  నమూనాను నిలబెట్టుకోవడానికి పారిశుధ్య వసతుల నిరంతరాయ నిర్వహణ, నిర్మాణానికి గ్రామీణాభివృద్ధి శాఖ నిరంతర కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలు, బ్లాక్ లు, పంచాయతీల్లో మరుగుదొడ్లు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా సామాజిక, సాంస్కృతిక  బృందాలు, పిఆర్ఐలను ప్రత్యేకించి 90000 మహిళా ఎస్ హెచ్ జిలను భాగస్వాములను చేస్తున్నారు.

టెక్నాలజీ వినియోగం, ఇన్నోవేషన్ ద్వారా ఈ సుస్థిరత సాధ్యమవుతుంది.  స్మార్ట్ సొల్యూషన్లు,  రిమోట్  మానిటరింగ్, డేటా అనలిటిక్స్ వంటివి వినియోగిస్తున్నారు.

ఒడిఎఫ్  ప్లస్ హోదా సుస్థిరంగా ఉండడం అనేది ఒక సారి మాత్రమే సాధించే కార్యక్రమం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రవర్తనాపరమైన మార్పు, కమ్యూనిటీ భాగస్వామ్యం, ఆర్థిక సుస్థిరత, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ వంటి  బహుముఖీన వైఖరి అంసరం. ఈ సిద్ధాంతాలను పాటించడం ద్వారా జమ్ము  కశ్మీర్  ఒడిఎఫ్ ప్లస్ నమూనాను,  స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, మరింత సుస్థిరమైన భవిష్యత్తును రాబోయే తరాలకు  కూడా అందించగలుగుతుంది.

 

***


(Release ID: 1964062) Visitor Counter : 59


Read this release in: English , Urdu , Hindi , Tamil