భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

లక్ష్య సాధన కోసం పూర్తి స్థాయిలో స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించిన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ


కార్యక్రమం అమలు చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, ఏబీ లలో 250కి పైగా ప్రాంతాలు గుర్తించిన మంత్రిత్వ శాఖ
పనికిరాని వస్తువులు, నిరుపయోగంగా ఉన్న పదార్థాలు తొలగించడం ద్వారా 5 లక్షల చ.అ స్థలం తిరిగి వినియోగంలోకి వస్తుందని అంచనా వేసిన మంత్రిత్వ శాఖ

Posted On: 03 OCT 2023 7:05PM by PIB Hyderabad

దేశం వివిధ ప్రాంతాల్లో మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో స్వచ్ఛత కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం 3.0 ని అమలు చేయడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. కార్యక్రమాన్ని అమలు చేయడానికి 2023 సెప్టెంబర్ 15న మంత్రిత్వ శాఖ  సన్నాహాలు ప్రారంభించింది. 2023 అక్టోబర్ 2న ప్రారంభమైన ప్రధాన కార్యక్రమం 31 వరకు  అమలు జరుగుతుంది. స్థలం సద్వినియోగం,కార్యాలయాలలో పని వాతావరణాన్ని మెరుగు పరచడానికి ప్రత్యేక కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

 

 

కార్యక్రమాన్ని అమలు చేయడానికి దేశం వివిధ ప్రాంతాల్లో మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో  250కి పైగా ప్రాంతాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది. స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 ని అమలు చేయడానికి చేపట్టిన సన్నాహక కార్యక్రమంలో భాగంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరిశుభ్రత కార్యక్రమం అమలు చేయడానికి గుర్తించిన ప్రాంతాలను సందర్శించి లక్ష్యాల సాధన కోసం అమలు చేయాల్సిన చర్యలపై  సీనియర్ అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది చెత్త రహిత స్వచ్ఛ భారతదేశం నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిరోజూ సాధించిన ప్రగతిని ప్రత్యకంగా ఏర్పాటైన బృందం పర్యవేక్షిస్తూ సాధించిన ప్రగతిని పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఎస్సిపిడిఎం పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు స్వచ్ఛత కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. 

 

 

 లక్ష్యాల మేరకు కార్యక్రమం అమలు జరుగుతోంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత  పనికిరాని వస్తువులు, నిరుపయోగంగా ఉన్న పదార్థాలు తొలగించడం ద్వారా 5.6 లక్షల  చ.అ స్థలం తిరిగి వినియోగంలోకి వస్తుందని  మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. సమీక్షించడానికి 65,944 ఫైళ్లను మంత్రిత్వ శాఖ గుర్తించింది. గుర్తించిన ఫైళ్లలో 33,789 ఫైళ్లను తొలగిస్తారు. ఎలక్ట్రానిక్ ఫైళ్లలో 5017 ఫైళ్లను మూసి వేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కార్యక్రమంపై  అవగాహన కల్పించడానికి మంత్రిత్వ శాఖ తన అధికార సామాజిక మాధ్యమం ద్వారా X (ట్విట్టర్)లో 170 ట్వీట్లు చేసింది. లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి స్వచ్ఛత కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు జరుగుతోంది.  

 

***(Release ID: 1963944) Visitor Counter : 75


Read this release in: Urdu , English , Hindi , Tamil