కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జొన్నిబార్స్ సంస్థ ఇందిరా ఐవీఎఫ్ సంస్థలో మెజారిటీ వాటా కొనుగోలుకు సీసీఐ ఆమోదం
- ఇందిరా ఐవీఎఫ్లో స్పేస్‌వే వెల్‌నెస్‌ను విలీనం చేయడానికి సీసీఐ సమ్మతి
Posted On:
03 OCT 2023 8:30PM by PIB Hyderabad
ఇందిరా ఐవీఎఫ్ సంస్థలో మెజారిటీ వాటాను జొన్నిబార్స్ కొనుగోలు చేయడానికి.. ఇందిరా ఐవీఎఫ్ సంస్థలోస్పేస్వే వెల్నెస్ను విలీనం చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కలయిక ఇలా ఉండవచ్చు:
a. ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇందిరా ఐవీఎఫ్) యొక్క మెజారిటీ వాటాను జొన్నిబార్స్ నెదర్లాండ్స్ బి.వి. (అక్వైరర్/జోన్నెబార్స్) కొనుగోలు చేయడం; మరియు
బి. ఇందిరా IVFతో మరియు దానిలో స్పేస్వే వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్పేస్వే) విళీనం.
జొన్నిబార్స్ అనేది ఈక్యూటీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఒక భాగం. ఇది దాని అనుబంధ సంస్థలు మరియు ఫండ్లతో కలిసి పెట్టుబడులు పెడుతుంది. ఇది ప్రపంచ స్థాయి పెట్టుబడి సంస్థ.ఇందిరా ఐవీఎఫ్ ప్రధానంగా భారతదేశంలోని ఆసుపత్రులు/ కేంద్రాల ద్వారా సంతానోత్పత్తి మరియు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్సను అందించడంలో నిమగ్నమై ఉంది. ఇందిరా ఐవీఎఫ్ ప్రమోటర్లలో స్పేస్వే ఒకటి. సీసీఐ యొక్క వివరణాత్మక ఆర్డర్ వెలువడాల్సి ఉంది.
****
(Release ID: 1963927)
Visitor Counter : 84