పర్యటక మంత్రిత్వ శాఖ
2023 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1 వరకు స్వచ్ఛత-హై-సేవ (ఎస్ హెచ్ ఎస్) కార్యక్రమం నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లో ఐహెచ్ఎం విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది, ప్రిన్సిపల్ తో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
01 OCT 2023 6:56PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ 2023 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1 వరకు స్వచ్ఛత-హై-సేవ (ఎస్ హెచ్ ఎస్) కార్యక్రమం నిర్వహించింది.
పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహణలో 20 క్షేత్ర స్థాయి కార్యాలయాలు, 21 హోటల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్లు పని చేస్తున్నాయి. గ్వాలియర్ లో ఐఐటిటిఎం (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్ మెంట్) 5 బ్రాంచిలు, ఎన్ సిహెచ్ఎంసిటిలతో పని చేస్తోంది.
సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు ఒకటో తీదీ వరకు 15 రోజుల పాటు జరిగిన కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా సెప్టెంబరు 27, అక్టోబరు 1 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రతీ ఏడాది సెప్టెంబరు 27న ప్రపంచ టూరిజం దినోత్సవం పాటిస్తారు. అదే సాంప్రదాయంతో 2023 సెప్టెంబరు 27వ తేదీన న్యూఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మిషన్ లైఫ్ కు చెందిన సెక్టోరల్ కార్యక్రమం గ్లోబల్ లాంచ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ లైఫ్ ప్రధానమంత్రి ప్రారంభించారు. పర్యాటక, రక్షణ శాఖల సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీమతి వి.విద్యావతి; పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి లీనా నందన్, టూరిజం శాఖ అడిషనల్ కార్యదర్శి శ్రీ రాకేశ్ వర్మ, టూరిజం మంత్రిత్వ శాఖ డిజి శ్రీమతి మనీషా సక్సేనా, సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ జ్ఞాన్ భూషణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రావెల్ ఫర్ లైఫ్ కార్యకలాపాల్లో భాగంగా 196 పర్యాటక ప్రాధాన్యత గల ప్రాంతాల్లోను, సందర్శకులు అధిక సంఖ్యలో ఉండే 108 ఎఎస్ఐ స్మారక స్థలాల్లోను ట్రావెల్ ఫర్ లైఫ్ ప్రతిన చేయించారు. భారత పర్యాటక కార్యాలయాలు, విద్యా సంస్థలు, పర్యాటక కేంద్రాల్లో స్వచ్ఛత కార్యకలాపాలు, హెరిటేజ్ వాక్, ఇతర కార్యకలాపాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, టూరిజం గైడ్లు పాల్గొన్నారు. ట్రావెల్ ఫర్ లైఫ్ చొరవ కింద ప్రత్యేక సందేశంతో రెండు మెట్రో రైళ్లను ప్రత్యేకంగా ముస్తాబు చేసి ద్వారకా సెక్టర్ 21 మెట్రో స్టేషన్ నుంచి నడిపారు. స్వచ్ఛ పర్యావరణం, ఏక వినియోగ ప్లాస్టిక్ నిర్మూలన (ఎస్ యుపి) ప్రోత్సహించడానికి హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ‘‘డిజైన్ చాలెంజ్ ఫర్ ఎడిబుల్ కట్లరీ’’ పేరిట హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులుఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం కోసం విభిన్న ప్రదేశాల్లో హెరిటేజ్ వాక్ లు, టూరిజం క్విజ్, ఇతర పోటీలు నిర్వహించారు.
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ భారత టూరిజం కార్యాలయాలు, హోటల్ మేనేజ్ మెంట్ సంస్థల్లో స్వచ్ఛతా కార్యకలాపాలు నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛత హై సేవ పోర్టల్ పై పర్యాటక మంత్రిత్వ శాఖ 886 కార్యక్రమాలు, వాటి వివరాలు అప్ లోడ్ చేసింది.
పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లోరి ఐహెచ్ఎం, హైదరాబాద్ లో విద్యార్థులు, ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్ తో కలిసి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబర్ పేట ప్రాంతంలోను, ఫీవర్ ఆస్పత్రి వద్ద, ఐహెచ్ఎం హైదరాబాద్ లోను మంత్రి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యదర్శి (పర్యాటకం) శ్రీమతి వి.విద్యావతి, డిజి (టూరిజం) శ్రీమతి మనీషా సక్సేనా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యన కూడా శ్రమదానం నిర్వహించారు. పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు, ఎఎస్ఐ సిబ్బంది, పార్క్ హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది, యువ టూరిజం క్లబ్ (వైటిసి) అధికారులు, పాఠశాల విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, ఏక వినియోగ ప్లాస్టిక్ ను సంచుల్లో సేకరించి తొలగించారు. జంతర్ మంతర్ లోపలి భాగంతో పాటు వెలుపల పార్కింగ్, రోడ్డుపై కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందు డిజి శ్రీమతి మనీషా సక్సేనా జంతర్ మంతర్ వద్ద స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న వారందరితోనూ స్వచ్ఛత ప్రమాణం చేయించారు.
భవిష్యత్తులో కూడా పర్యాటక ప్రాధాన్యం గల, ట్రావెల్ ఫర్ లైఫ్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన 108 ప్రదేశాల్లో మరుగుదొడ్ల క్లీనింగ్, మంచినీటి వసతి కల్పన వంటి మౌలిక స్వచ్ఛతా కార్యకలాపాలు కొనసాగించాలని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
***
(Release ID: 1963602)
Visitor Counter : 92