శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా హి సేవా (ఎస్‌హెచ్‌ఎస్‌) ప్రచారం కింద పరిశుభ్రత మరియు పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించడానికి "రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఇఆర్"ను ఢిల్లీలోని సిఎస్‌ఐఆర్‌ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వం వహిస్తున్న టిడిబి నిధులతో "రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఈఆర్" కార్యక్రమం స్వచ్ఛతా హి సేవా ప్రచారానికి మరియు క్లీనర్ ఇండియా కోసం ప్రధానమంత్రి విజన్‌కు మద్దతు ఇస్తుంది

"మహాత్మా గాంధీ మనకు స్వచ్ఛత యొక్క ఆవశ్యకతను తెలిపారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దానిని జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు": డాక్టర్ జితేంద్ర సింగ్

రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఇఆర్ ప్రాజెక్ట్ భారతదేశంలో ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు మార్గదర్శక విధానాన్ని పరిచయం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం లేదు: డాక్టర్ జితేంద్ర సింగ్.

Posted On: 02 OCT 2023 5:11PM by PIB Hyderabad

ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు జరుపుకున్న స్వచ్ఛతా హి సేవా (ఎస్‌హెచ్‌ఎస్‌) ప్రచారానికి అనుగుణంగా కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, అణుశక్తి మరియు అంతరిక్షం రంగం డా.జితేంద్ర సింగ్ న్యూ ఢిల్లీలోని అనుసంధన్ భవన్‌లో విప్లవాత్మక "రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఈఆర్"ను ప్రారంభించారు.

కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ "రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఈఆర్' ప్రాజెక్ట్ స్వచ్ఛత హి సేవా ప్రచారం యొక్క స్వచ్ఛ భారత్‌ను పెంపొందించే లక్ష్యంతో సంపూర్ణంగా సరిపోలింది" అని అన్నారు. ఇది రవాణా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వ్యయాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇ-వ్యర్థాల నుండి విలువైన లోహాలను సమర్ధవంతంగా వెలికితీస్తుంది. వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందజేస్తుంది తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్‌ సాకరమవుతుందని చెప్పారు.

 

image.png


స్వచ్ఛతా హి సేవా థీమ్‌పై డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ "మహాత్మా గాంధీ మనకు స్వచ్ఛత యొక్క గొప్పతనాన్ని అందించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు" అని తెలిపారు.

మే 2014లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధాని మోదీ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చేందుకు 2014 ఆగస్టు 15న స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రకటించారని మంత్రి వివరించారు. కొద్ది సంవత్సరాల్లోనే స్వచ్ఛ మిషన్ సంస్థాగతమైందని అది ఒక జీవన విధానంగా, నిజమైన ప్రజా ఉద్యమంగా (జన ఆందోళన్) మారిందని ఆయన అన్నారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ స్వచ్ఛతా ప్రచారాన్ని అక్టోబర్ 2వ తేదీకి పరిమితం చేయలేదని  ఇది కొనసాగింపు యొక్క కొత్త కోణాన్ని పొందింది మరియు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. బాపూజీ జయంతి పరిశుభ్రత సంకల్పానికి పునరుద్ఘాటన మాత్రమేనని ఆయన అన్నారు.

"రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఈఆర్" గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ "ఈ ప్రాజెక్ట్ పరిశుభ్రతలో సఫాయిమిత్ర కీలక పాత్రను గుర్తిస్తుంది. బాధ్యతాయుతమైన ఇ-వ్యర్థాల తొలగింపు ద్వారా పర్యావరణం మరియు వారి ఆరోగ్యం రెండింటినీ సంరక్షిస్తుంది. నైపుణ్యాభివృద్ధిని అందించడం, ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపిఆర్)తో సమలేఖనం చేయడం మరియు సుస్థిరతను ప్రోత్సహించడం, శిక్షణ, రవాణా మరియు సాంకేతికత అనే నినాదానికి తోడ్పడడం, నైపుణ్యాలు, సమర్థవంతమైన రవాణా మరియు మెరుగైన భవిష్యత్తు కోసం సాంకేతికతతో అనధికారిక రంగానికి సాధికారత కల్పించడం ద్వారా ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది." అని కేంద్రమంత్రి వివరించారు.

ఇ-వ్యర్థాల నిర్మూలనపై అవగాహన పెంచాలన్న ప్రధాని మోదీ చేసిన పిలుపునకు ప్రతిస్పందనగా డాక్టర్ జితేంద్ర సింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) మరియు ముంబైకి చెందిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎం/ఎస్ ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా అంగీకరించారు. ఈ సంచలనాత్మక ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌కు టిడిబి నుండి రూ. 6.00 కోట్ల ఆర్థిక మద్దతు లభించింది.

"రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఈఆర్" గురించి మాట్లాడుతూ "ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు మార్గదర్శక విధానాన్ని పరిచయం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విధానం లేదు. ఇది స్థిరమైన ఇ-వేస్ట్ కోసం పూర్తిగా కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. అభ్యాసాలు, సమర్థత, ప్రాప్యత మరియు పర్యావరణ బాధ్యతలను మిళితం చేసే ప్రత్యేకమైన రూపకల్పన మరియు అమలు ద్వారా వర్గీకరించబడతాయి." అని వివరించారు.

image.png


'రీసైక్లింగ్ ఆన్ వీల్స్ స్మార్ట్-ఈఆర్' పరివర్తన ప్రయాణాన్ని మనం ప్రారంభించినప్పుడు స్వచ్ఛతా హి సేవా ప్రచారానికి చురుకుగా సహకరిస్తాము మరియు పరిశుభ్రత, పర్యావరణ బాధ్యత మరియు మన అంకితభావంతో ఉన్న సఫాయిమిత్రల శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేస్తాము. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక పిలుపు మేరకు అందరం కలిసి పరిశుభ్రమైన మరియు పచ్చదనంతో కూడిన భారతదేశాన్ని రూపొందిస్తున్నాము అని చెప్పారు.

డిఎస్‌ఐఆర్ సెక్రటరీ డాక్టర్ ఎన్. కళైసెల్వి మాట్లాడుతూ " బాపు దైవభక్తి పక్కన పరిశుభ్రత అని సరిగ్గానే ప్రస్తావించారు. పర్యావరణ మరియు వాతావరణ నిబంధనలకు అనుగుణంగా ఆహారం, నివాసం మరియు దుస్తులు అనే మూడు ముఖ్యమైన మరియు ప్రాథమిక భాగాల కోసం గాంధీజీ చేసిన కృషి గురించి వివరించారు.

image.png


దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 37 సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లు ఫిజికల్ క్లీనింగ్ మరియు ఈ-క్లీనింగ్ రెండింటిలోనూ నిమగ్నమై ఉన్నాయని డాక్టర్ కలైసెల్వి తెలిపారు. వచ్చే వారం నుంచి డీఎస్‌ఐఆర్‌, సీఎస్‌ఐఆర్‌లలో ఫైళ్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హామీ ఇచ్చారు.
 

<><><>


(Release ID: 1963473) Visitor Counter : 159


Read this release in: English , Urdu , Hindi