సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో గల గ్రామోద్యోగ్‌ భవన్‌లో గాంధీ జయంతి వేడుకలు


సంస్మరణ వేడుకలను ఘనంగా నిర్వహించిన విశిష్ట మంత్రులు, నాయకులు

ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్, ఖాదీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత మేరకు రూపొందించిన కెవిఐ ఉత్పత్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Posted On: 02 OCT 2023 8:59PM by PIB Hyderabad

భారతదేశంలో ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు స్వీకరించడం అనే మహాత్మా గాంధీ దృక్పథాన్ని సాధికారపరచడంలో గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను, విశేషమైన నాయకత్వాన్ని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఖాదీ ఇండియా జరుపుకుంటుంది. ఖాదీ గ్రామోద్యోగ్ భవన్‌లో గాంధీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో  కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం, సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మరియు సైన్స్ & టెక్నాలజీ సహాయమంత్రి (ఇండిపెండెంట్‌చార్జ్‌) డాక్టర్ జితేంద్ర సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ  జెపి నడ్డా, లోక్‌సభ సభ్యులు శ్రీ మనోజ్ తివారీ, పలువురు ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

image.png


ఈ సందర్భంగా భవన్‌కు భారీగా సందర్శకులు తరలివచ్చారు. వారంతా మేక్ ఇన్ ఇండియా వస్తువులను చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తుల శ్రేణిని కొనుగోలు చేశారు తద్వారా ఈ స్వదేశీ వస్తువుల పట్ల తమకున్న ప్రగాఢ అభిమానాన్ని ప్రదర్శించారు. మహాత్మా గాంధీ  వారసత్వాన్ని ప్రతిబింబించే సూక్ష్మ చరఖా మరియు గాంధీ టోపీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 

image.png


ఎంపిక చేసిన వస్తువులపై  60% తగ్గింపు, ఖాదీ ఉత్పత్తులపై 20% తగ్గింపు మరియు విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులపై  10% తగ్గింపుతో సహా ప్రత్యేక ఆఫర్లను భవన్‌ అందించింది.
 

image.png


కార్యక్రమంలో భాగంగా భవన్ ముందు ఓమ్జా కోల్డ్ ప్రెస్ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు. ఓమ్జా ఆయిల్స్ అండ్ ఆగ్రో అనేది పిఎంఈజిపి యూనిట్. ఈ వ్యాన్ అక్కడికక్కడే సన్‌ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె ఉత్పత్తిని ప్రదర్శించింది. ఈ ప్రక్రియను చూసేందుకు సందర్శకులకు ప్రత్యేక అవకాశం కలిగింది.

ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల శాశ్వత స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మహాత్మా గాంధీ సూచించిన ఆదర్శాలు మరియు సూత్రాలను పొందుపరిచింది. ఈ వేడుకకు లభించిన అఖండమైన స్పందన ప్రతి భారతీయుడిలో స్థానికుల కోసం తమ వాయిస్‌ను వినిపించాలన్న స్ఫూర్తిని ప్రదర్శించింది.

 

****



(Release ID: 1963467) Visitor Counter : 107


Read this release in: Urdu , English , Hindi