సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
హస్తకళాకారులకు సాధికారత: ఖాదీ రంగంలో విశేషమైన అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీ నారాయణ్ రాణే ఖాదీ మహోత్సవ్ 2023ని ఆవిష్కరించారు
Posted On:
02 OCT 2023 5:41PM by PIB Hyderabad
మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈరోజు ముంబైలో ఖాదీ యాత్రను ప్రారంభించి అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 31, 2023 వరకు షెడ్యూల్ చేయబడిన 'ఖాదీ మహోత్సవాన్ని' ప్రకటించారు. ఈ పండుగ "వోకల్ ఫర్ లోకల్" చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీచే రూపొందించబడిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'కు మద్దతుగా చేపట్టబడింది.
శ్రీ నారాయణ్ రాణే తన ప్రారంభ ప్రసంగంలో కెవిఐసి (ఖాదీ మరియు గ్రామ పరిశ్రమ) సెక్టార్‌లోని అద్భుతమైన కార్యక్రమాలను హైలైట్ చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గణనీయమైన వృద్ధిని ప్రదర్శిస్తుంది. కెవిఐ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,34,629.91 కోట్లుగా నమోదయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 33,135.90 కోట్లుగా ఉంది. ఇది 306.29% పెరుగుదలను సూచిస్తుంది.కెవిఐ ఉత్పత్తి కూడా మూడు రెట్లు పెరిగి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 95,956.67 కోట్లుగా ఉంది. ఇది 2014-15 ఆర్ధిక సంవత్సరంలో 27,569.37 కోట్లుగా ఉంది. ఇది 248.05% పెరుగుదలను సూచిస్తుంది.
అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 31 వరకు దేశవ్యాప్తంగా జరిగే 'ఖాదీ మహోత్సవ్' గురించి శ్రీ రాణే తెలియజేశారు. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమలు, చేనేత, హస్తకళలు,ఓడిఓపి (ఒక జిల్లా ఒక ఉత్పత్తి) ఉత్పత్తులు మరియు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వివిధ సాంప్రదాయ మరియు కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ ఉత్సవంలో ఖాదీ బట్టలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తాలు, జాకెట్లు, బెడ్‌షీట్లు, కార్పెట్‌లు, రసాయన రహిత షాంపూలు, తేనె మరియు ఇతర గృహోపకరణాలు, అలాగే కళలు మరియు హస్తకళలతో సహా వివిధ రాష్ట్రాల నుండి వివిధ రకాల ఖాదీ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా ఖాదీ మహోత్సవ్ ప్రచారంలో భాగంగా పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మంత్రి డిజిటల్ చెల్లింపులు కూడా చేశారు.
కెవిఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వినిత్ కుమార్ మాట్లాడుతూ కెవిఐసి టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, ఐ&బి మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఇతర మంత్రిత్వ శాఖలు ఎంఈఐటివై సమన్వయంతో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 2 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా 'ఖాదీ మహోత్సవ్'ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పష్టమైన ఫలితాలను సాధించడానికి దేశవ్యాప్తంగా అనేక నిర్దిష్ట అవగాహన కార్యకలాపాలను ప్రభుత్వం గుర్తించింది.వీటిలో సెల్ఫీ పోటీలు, ఇ-ప్రతిజ్ఞలు, జింగిల్ పోటీలు, క్రియేటివ్ ఫిల్మ్ పోటీలు, వీధి నాటకాలు మరియు వీడియో గేమ్ పోటీలతో పాటుగా మైగవ్.ఇన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విద్యార్థులు మరియు సాధారణ ప్రజల కోసం క్విజ్ పోటీలు మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించబడతాయి.
ఈ సందర్భంగా ముంబయిలోని వివిధ పాఠశాలల నుంచి పలు పోటీల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులతోపాటు అధికారులు, ఉద్యోగులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఖాదీ బట్టలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, కుర్తాలు, జాకెట్లు, బెడ్‌షీట్లు, తివాచీలు, రసాయన రహిత షాంపూలు, తేనె మరియు ఇతర గృహోపకరణాలు, అలాగే సున్నితమైన కళలతో సహా వివిధ రాష్ట్రాల నుండి విభిన్న శ్రేణి ఖాదీ ఉత్పత్తులను కలిగి ఉన్న సుమారు 100 సంస్థలు ఈ ప్రదర్శనలో హస్తకళలు పాల్గొంటున్నాయి. కుటీర పరిశ్రమలో నిమగ్నమైన చేనేత కార్మికులు మరియు ఇతర కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ఉత్సవం లక్ష్యం.
***
(Release ID: 1963362)
Visitor Counter : 128