ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో స్వచ్ఛతా హి సేవా కార్యకలాపాలు
Posted On:
02 OCT 2023 3:34PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) 2 అక్టోబర్ 2023న ఎలక్ట్రానిక్స్ నికేతన్,ఎంఇఐటివైలో ఎంతో ఉత్సాహంతో ప్రత్యేక కార్యక్రమాన్ని (స్వచ్ఛత హి సేవ) నిర్వహించింది. ఇందులో ఎంఇఐటివైకు చెందిన 400 కంటే ఎక్కువ మంది అధికారులు, సిసిఏ, ఐసిఈఆర్‌టి, ఎస్‌టిక్యూసి, ఎన్‌ఐసి, యూఐడిఏఐ, ఎన్‌ఐఈఎల్‌ఐటి, ఎస్‌టిపిఐ, ఈఆర్‌ఎన్‌ఈటి, ఎస్‌టిపిఐ, ఈఆర్‌ఎన్‌ఈటి ఇండియా, ఎన్‌ఐఎక్స్‌ఐ, ఎన్‌ఐసిఎస్‌ఐ,సి-డాక్,మైగవ్,ఎన్‌ఇజిడి,డిఐసి,సిఎస్‌సి వంటి స్వయంప్రతిపత్తి/అటాచ్డ్ కార్యాలయాలు మరియు ఢిల్లీలో ఉన్న సిఐఎస్‌ఎఫ్ మరియు ఎన్‌సిఆర్ ఎలక్ట్రానిక్స్ నికేతన్ బిల్డింగ్‌లో ఉదయం 7.30 గంటలకు సమావేశమై కింది కార్యక్రమాలలో పాల్గొన్నారు:
- కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు
- ఈ-వ్యర్థాలపై అవగాహన మరియు పారవేయడంపై ఉపన్యాసం నిర్వహించబడింది.
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మరియు చెత్త పారవేయడం వంటి వాటిపై అవగాహన కల్పించడం కోసం ఎంఇఐటివై అధికారులచే నూక్కడ్ నాటక్ ప్రదర్శించబడింది.
- ప్రేక్షకుల్లో దేశభక్తి, పరిశుభ్రత భావాలను పెంపొందించేందుకు జానపద నృత్యం నిర్వహించారు.
- భవన ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అదనపు కార్యదర్శి, సీఈవో, యూఐడీఏఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- పాల్గొన్న వారందరూ "శ్రమదాన్" మరియు "ఫిట్ ఇండియా రన్"లో పాల్గొన్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ నికేతన్ బిల్డింగ్ నుండి ప్రగతి విహార్ హాస్టల్ వరకు ఫ్లాగ్ రన్ మరియు ఆ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల చెత్తను శుభ్రం చేశారు.
- తిరిగి వచ్చిన వారంతా స్వచ్ఛతా కటౌట్‌లతో సెల్ఫీ తీసుకున్నారు.
- స్వచ్ఛతా హి సేవపై వివిధ బ్యానర్లు, పోస్టర్లు ప్రముఖంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి అప్‌లోడ్ చేశారు.ఎంఇఐటివై మరియు దాని సంస్థల ద్వారా రోజువారీ ప్రాతిపదికన దశలవారీగా, మొత్తం కార్యాలయ ప్రాంగణం లోపల/బయట మరియు చుట్టూ శుభ్రపరిచే కార్యకలాపాలు కూడా ముమ్మరం చేయబడ్డాయి. నిర్వహించిన కార్యకలాపాలు క్రింద ఇవ్వబడ్డాయి: -
ఎంఇఐటివై మరియు దాని సంస్థల మొత్తం భవనంలో మరియు చుట్టుపక్కల సాధారణ శుభ్రత దశలవారీగా జరిగింది.
భవనం ప్రాంగణం లోపల మరియు వెలుపల అవసరమైన చోట మరమ్మతులు మరియు నిర్వహణ చేపట్టారు.
పాత/ఉపయోగించని ఫైల్‌లు/రిజిస్టర్‌లతో పాటు ఉపయోగించని వాటిని తొలగించడం మరియు పాత/ఉపయోగించని ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులను తొలగించడం జరిగింది.
గడ్డిని కత్తిరించడం మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం జరిగింది.
ఎంఇఐటివై మరియు దాని సంస్థల కార్యాలయాలు/భవనాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ జరిగింది.
***
(Release ID: 1963317)
Visitor Counter : 89