ఆర్థిక మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 2023లో రూ.1,62,712 కోట్ల స్థూల జీఎస్టీ రాబడి; గత ఏడాది కన్నా 10% వృద్ధి నమోదు
2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం నాలుగొవ సారి 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రూ.9,92,508 కోట్ల స్థూల జీఎస్టీ సేకరణ 11 శాతం ఏటా వృద్ధిని సూచిస్తుంది 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ సేకరణ రూ.1.65 లక్షల కోట్లు 11 శాతం వృద్ధి
Posted On:
01 OCT 2023 3:40PM by PIB Hyderabad
సెప్టెంబర్, 2023 నెలలో స్థూల జీఎస్టీ రెవిన్యూ రూ.1,62,712 కోట్లు ఉండగా, అందులో సీజీఎస్టీ రూ.29,818 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఐజీ ఎస్టీ రూ. 83,623 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.41,145 కోట్లతో కలిపి), సెస్ కింద రూ. 11,613 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన ₹881 కోట్లతో కలిపి) సేకరణ అయింది.
ప్రభుత్వం ఐజీఈస్ట్ నుండి సీజీఎస్టీకి రూ.33,736 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.27,578 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత సెప్టెంబర్, 2023లో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ. 63,555 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.65,235 కోట్లు వచ్చింది.
సెప్టెంబరు, 2023 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 10 శాతం ఎక్కువ. నెలలో, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 14 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి.
సెప్టెంబరు, 2023తో ముగిసే 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో స్థూల జీఎస్టీ సేకరణ [రూ.9,92,508 కోట్లు] 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో స్థూల జీఎస్టీ సేకరణ కంటే 11 శాతం ఎక్కువ [రూ.8,93,334 కోట్లు] . 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు, ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రూ.1.49 లక్షల కోట్ల సగటు నెలవారీ స్థూల సేకరణ కంటే 11 శాతం ఎక్కువ.
ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయాల ట్రెండ్‌లను కింద పేర్కొనడం జరిగింది. సెప్టెంబర్ 2022తో పోలిస్తే సెప్టెంబర్ 2023 నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరణ అయిన జీఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను టేబుల్-1 పేర్కొనడం జరిగింది.
Chart: Trends in GST Collection
సెప్టెంబర్ 2023లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ రెవిన్యూ వృద్ధి [1]
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
సెప్టెంబర్ -22
|
సెప్టెంబర్ -23
|
వృద్ధి (%)
|
జమ్మూ కాశ్మీర్
|
428
|
563
|
32%
|
హిమాచల్ ప్రదేశ్
|
712
|
784
|
10%
|
పంజాబ్
|
1,710
|
1,866
|
9%
|
చండీగఢ్
|
206
|
219
|
6%
|
ఉత్తరాఖండ్
|
1,300
|
1,392
|
7%
|
హర్యానా
|
7,403
|
8,009
|
8%
|
ఢిల్లీ
|
4,741
|
4,849
|
2%
|
రాజస్థాన్
|
3,307
|
3,869
|
17%
|
ఉత్తరప్రదేశ్
|
7,004
|
7,844
|
12%
|
బీహార్
|
1,466
|
1,397
|
-5%
|
సిక్కిం
|
285
|
315
|
11%
|
అరుణాచల్ ప్రదేశ్
|
64
|
81
|
27%
|
నాగాలాండ్
|
49
|
52
|
5%
|
మణిపూర్
|
38
|
56
|
47%
|
మిజోరాం
|
24
|
27
|
14%
|
త్రిపుర
|
65
|
73
|
13%
|
మేఘాలయ
|
161
|
165
|
2%
|
అస్సాం
|
1,157
|
1,175
|
2%
|
పశ్చిమ బెంగాల్
|
4,804
|
4,940
|
3%
|
ఝార్ఖండ్
|
2,463
|
2,623
|
7%
|
ఒడిశా
|
3,765
|
4,249
|
13%
|
ఛత్తీస్గఢ్
|
2,269
|
2,684
|
18%
|
మధ్యప్రదేశ్
|
2,711
|
3,118
|
15%
|
గుజరాత్
|
9,020
|
10,129
|
12%
|
దాద్రా నాగర్ హవేలీ, దయ్యు దమన్
|
312
|
350
|
12%
|
మహారాష్ట్ర
|
21,403
|
25,137
|
17%
|
కర్ణాటక
|
9,760
|
11,693
|
20%
|
గోవా
|
429
|
497
|
16%
|
లక్షద్వీప్
|
3
|
2
|
-45%
|
కేరళ
|
2,246
|
2,505
|
12%
|
తమిళనాడు
|
8,637
|
10,481
|
21%
|
పుదుచ్చేరి
|
188
|
197
|
5%
|
అండమాన్ నికోబర్ దీవులు
|
33
|
23
|
-30%
|
తెలంగాణ
|
3,915
|
5,226
|
33%
|
ఆంధ్రప్రదేశ్
|
3,132
|
3,658
|
17%
|
లడఖ్
|
19
|
35
|
81%
|
ఇతర ప్రాంతాలు
|
202
|
207
|
2%
|
కేంద్రం పరిధిలో ఉన్న ప్రాంతాలు
|
182
|
196
|
8%
|
మొత్తం
|
1,05,615
|
1,20,686
|
14%
|
(Release ID: 1963180)
|