గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ అర్జున్ ముండా నేతృత్వంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ


500 కి పైగా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన ఈఎంఆర్ఎస్, ట్రిఫెడ్ , నెస్ట్స్, ఎన్ఎస్టీఎఫ్డీసి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో నడుస్తున్న స్వచ్చంధ సేవా సంస్థలు

కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేసిన విద్యార్థులు, అధికారులు, గిరిజన సంఘం సభ్యులు

Posted On: 01 OCT 2023 10:42PM by PIB Hyderabad

స్వచ్ఛ్ భారత్ మిషన్‌ను బలోపేతం చేయడానికి ,ప్రజలకు  పారిశుద్ధ్య సేవలను అందించడానికి ప్రజల సహకారంతో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలు  నిర్వహించింది. న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

స్వచ్ఛతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్న శ్రీ ముండా ఈ కార్యక్రమం  పరిశుభ్రత ,పరిశుభ్రమైన పర్యావరణం అంశాలపై ప్రజల  బాధ్యత పెంపొందించిందని అన్నారు.ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోని బరిపాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో  కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ  మంత్రి   శ్రీ బిశ్వేశ్వర్ తుడు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన  స్వచ్ఛత కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ అనిల్ కుమార్ ఝా, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS), నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్అండ్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSTFDC), ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED), రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖలు,  ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు (TRIs) అనేక కార్యక్రమాలు నిర్వహించాయి.. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన  “ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్” స్వచ్ఛత శ్రమదానం కార్యక్రమంలో   ఈఎంఆర్ఎస్, ట్రిఫెడ్ , నెస్ట్స్, ఎన్ఎస్టీఎఫ్డీసి,  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో నడుస్తున్న స్వచ్చంధ సేవా సంస్థలు 500 కి పైగా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాయి. 

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత లక్ష్యంగా కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, 

 గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముఖ్యమైన కార్యక్రమంగా అమలు జరుగుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు   పాఠశాల ఆవరణలు, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రపరచడం కోసం ఒక గంట స్వచ్ఛంద సేవ చేశారు.  ఈ సహకారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా అమలు జరిగిన కార్యక్రమం పరిశుభ్రతను కాపాడుకోవడంలో సామూహిక బాధ్యతను ప్రతిబింబించే విధంగా సాగింది. 

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లతో పాటు నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్అండ్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశం వివిధ ప్రాంతాలల్లో కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజల సహకారంతో కార్యక్రమాలు అమలు జరిగాయి. న్యూ ఢిల్లీలోని నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్అండ్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్  ప్రధాన కార్యాలయం, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మరియు హైదరాబాద్‌లోని నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్అండ్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నాలుగు జోనల్ కార్యాలయాలలో కార్యక్రమాలు  జరిగాయి. డెహ్రాడూన్‌లో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారంతో  పార్కులు, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, వ్యర్థాల సేకరణ లాంటి కార్యక్రమాలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేశారు. స్థానిక ప్రజలతో పాటు విద్యార్థులు గిరిజన మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

****


(Release ID: 1963085) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Hindi