నౌకారవాణా మంత్రిత్వ శాఖ
'స్వచ్ఛత మిమ్మల్ని దేవుడికి దగ్గర చేస్తుంది', అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి 'స్వచ్ఛతా హీ సేవ' డ్రైవ్ లో ప్రజలతో చేరిన శ్రీ సర్బానంద సోనోవాల్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో ఈ అద్భుత ఉద్యమం లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన అస్సాం ప్రజలను అభినందించిన శ్రీ సోనోవాల్
Posted On:
01 OCT 2023 5:03PM by PIB Hyderabad
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆదివారం అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి 'స్వచ్ఛతా హీ సేవ' ఉద్యమానికి నాయకత్వం వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో ఈ వినూత్న పరిశుభ్రత ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు అస్సాం ప్రజలకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, " మనం 'స్వచ్ఛతా హీ సేవ' ఉద్యమంలో పాల్గొని 'శ్రమ' చేస్తున్నప్పుడు, మన విలక్షణ నాయకుడు, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు నకు అస్సాం ప్రజలు ఎలా ప్రతిస్పందించారో , వారి ఉత్సాహపూరిత భాగస్వామ్యంతో ఈ ఉద్యమాన్ని ఎలా విజయవంతం చేశారో అన్నది సంతోషకరం. పరిశుభ్రతపై మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశం ఏమిటో, చెత్త రహిత భారతదేశం కోసం జన్ భాగీదారి ద్వారా అది ఎలా ప్రతిధ్వనిస్తుందో మనం గుర్తుంచుకోవాలి. పరిశుభ్రత మనల్ని దైవత్వానికి దగ్గర చేస్తుంది. మన నాయకుడు నరేంద్ర మోదీజీ దార్శనికత అయిన స్వస్థ భారత్ ను సాధించడానికి పరిశుభ్రమైన భారత్ అనే మహోన్నత లక్ష్యానికి మనం కట్టుబడి ఉండాలి” అన్నారు.
(Release ID: 1963082)
Visitor Counter : 94