ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ ప్రాంతాలలో ' కచ్ఛప్' కార్యక్రమాన్ని నిర్వహించి 955 సజీవ గంగా తాబేళ్లను రక్షించి ఆరు మంది అక్రమ వన్యప్రాణుల వ్యాపారులను అరెస్ట్ చేసిన డీఆర్ఐ

Posted On: 01 OCT 2023 4:55PM by PIB Hyderabad

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డీఆర్ఐ) నిన్న నాగ్‌పూర్, భోపాల్, చెన్నైలలో దాడులు నిర్వహించి అక్రమంగా రవాణా చేస్తున్న  వివిధ జాతులకు చెందిన 955 గంగా తాబేళ్లను స్వాధీనం చేసుకుని  6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. 

అంతరించిపోతున్న/ ప్రమాదం ఎదుర్కొంటున్న జాతులుగా గుర్తించి రెడ్ లిస్ట్, వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్ I,II లో  ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చేర్చిన జాబితాలో ఉన్న    ''గంగా తాబేళ్లు''ను కొందరు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి అక్రమంగా రవాణా చేస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది.  అక్రమ వ్యాపారం, ఆవాసాల క్షీణత ఈ జాతులకు ప్రధాన ముప్పుగా ఉంది. 

దేశంలోని వివిధ ప్రదేశాల్లో వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని  పట్టుకుని తాబేళ్లను రక్షించేందుకు  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్   అధికారులు జాతీయ స్థాయిలో అమలు చేయడానికి ఒక క్లిష్టమైన ప్రణాళికను రూపొందించారు.

జాతీయ స్థాయిలో అమలు చేసిన ప్రణాళికలో భాగంగా  30.09.2023న నాగ్‌పూర్, భోపాల్, చెన్నైలలో దాడులు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  మొత్తం 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి  సజీవంగా ఉన్న  955 ప్రత్యక్ష తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న గంగా తాబేళ్లలలో   ఇండియన్ డేరా తాబేలు, ఇండియన్ ఫ్లాప్‌షెల్ తాబేలు, క్రౌన్ రివర్ తాబేలు, నల్ల మచ్చలు/చెరువు తాబేలు, బ్రౌన్ రూఫ్డ్ రకం తాబేళ్లు ఉన్నాయి. 

వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 కింద ప్రాథమిక విచారణ జరిపిన   డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  నేరస్థులు, స్వాధీనం చేసుకున్న  గంగా తాబేళ్లను తదుపరి విచారణ కోసం సంబంధిత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అక్రమ వన్యప్రాణుల అక్రమ రవాణాను నివారించడానికి  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పటిష్ట చర్యలు అమలు చేస్తోంది. గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేశారు. అధికారులు రక్షించిన ప్రాణుల్లో కొన్ని అంతరించిపోతున్న/ ప్రమాదం ఎదుర్కొంటున్న జాతులుగా గుర్తించి రెడ్ లిస్ట్, వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్ I,II లో  ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చేర్చిన జాబితాలో ఉన్నాయి.   అక్రమ వ్యాపారం, మాంసం కోసం దోపిడీ, ఆవాసాల క్షీణత వల్ల ఈ జాతులు ముప్పు ఎదుర్కొంటున్నాయి. 

***

 


(Release ID: 1963062) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi , Tamil