రైల్వే మంత్రిత్వ శాఖ
గుర్గావ్ రైల్వే స్టేషన్ లో 'స్వచ్ఛత కోసం శ్రమదానం' లో పాల్గొన్న రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం '14 నిమిషాల మిరాకిల్ క్లీనింగ్'ను ప్రారంభించిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే 12,700 కిలోమీటర్ల రైలు పట్టాలను శుభ్రం చేసింది 'స్వచ్ఛత' కోసం దాదాపు 7 లక్షల పనిగంటలను కేటాయించింది.
Posted On:
01 OCT 2023 6:01PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'స్వచ్ఛతా హీ సేవ' ప్రచారంలో భాగంగా 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' పిలుపు మేరకు రైల్వే, కమ్యూనికేషన్స్ , ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఆదివారం ఉదయం హర్యానాలోని గుర్గావ్ రైల్వే స్టేషన్ లో "స్వచ్ఛత కోసం శ్రమదానం" చేశారు. రైల్వే ట్రాక్ లు, స్టేషన్ ఆవరణను శుభ్రం చేసే కార్యక్రమంలో వైష్ణవ్ పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రైల్వే బోర్డు, ఉత్తర రైల్వే ఉన్నతాధికారులు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైల్వే మంత్రి గుర్గావ్ రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ కంటోన్మెంట్ వరకు 20977 అజ్మీర్ - ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ పరిశుభ్రత స్థాయిని పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు.
ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ వద్ద శ్రమదానం కార్యకర్తలు ('స్వచ్ఛ వందే వీర్స్' ) వందే భారత్ ఎక్స్ ప్రెస్ "14 నిమిషాల మిరాకిల్ క్లీనింగ్" ప్రదర్శనను కేంద్ర మంత్రికి చూపించారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను శుభ్రపరిచే ప్రక్రియను ఆయన లాంచనంగా ప్రారంభించారు.
"14 నిమిషాల మిరాకిల్ క్లీనింగ్" అనేది కోచ్ లను క్రమశిక్షణ ,ఖచ్చితత్వంతో శుభ్రపరచడం. ఫాస్ట్ క్లీనింగ్ డ్రిల్ వల్ల వందే భారత్ రైళ్ల టర్న్అరౌండ్ సమయం తగ్గుతుంది. ఈ ప్రక్రియలో బోగీల లోపల, వెలుపల డ్రై ,వెట్ మోపింగ్ కోసం బోగీల్లో సిబ్బందిని నియమించడం , చెత్త సంచులను సేకరించడం ,స్వచ్ఛతను ధృవీకరించడానికి వ్యర్థాలను తగిన విధంగా డిస్పోజబుల్ చేయడం జరుగుతుంది.
14 నిమిషాల మిరాకిల్ క్లీనింగ్'ను ప్రారంభించిన అనంతరం రైల్వే మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు సేవలను అందించడానికి కొత్త పద్ధతులు, మార్గాలను కనుగొనడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ప్రేరేపిస్తారని అన్నారు. శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ " వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు టర్న్ అవుట్ సమయాన్ని తగ్గించే ఈ 'స్వచ్ఛతా కా నయా సంకల్ప్'తో ఒక కొత్త ప్రోటోకాల్ ను ప్రారంభించాము" అని అన్నారు.వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రక్రియను ప్రారంభించామని, దీనిని క్రమంగా ముందుకు తీసుకెళ్తామని, తద్వారా పరిశుభ్రత భారతీయ రైల్వే అంతటా వ్యాపించేలా చూస్తామని ఆయన అన్నారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా రైల్వే మంత్రిత్వ శాఖ 15.09.23 నుండి 02.10.23 వరకు 'స్వచ్ఛతా హీ సేవా పఖ్వాడా' (ఎస్ హెచ్ ఎస్) ను నిర్వహిస్తోంది, ఈ ప్రచారాన్ని మరింత పచ్చగా , మరింత పర్యావరణ స్నేహపూర్వక రైల్వే వ్యవస్థను పెంపొందించడానికి , 'స్వచ్ఛ భారత్'ను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ఎస్ హెచ్ ఎస్ తొలి 15 రోజుల్లో 2.19 లక్షల మందికిపైగా 2050 కార్యక్రమాల్లో పాల్గొని 6,85,883 పనిగంటలను 'స్వచ్ఛత'కు కేటాయించారు.
రైల్వే ప్రాంగణం నుండి సుమారు 105 టన్నుల ప్లాస్టిక్ను తొలగించడం , వివిధ రైల్వే సంస్థల నుండి సేకరించిన సుమారు 1085 టన్నుల వ్యర్థాలను సేకరించడం ఈ కార్యక్రమాల కొన్ని ముఖ్యాంశాలు. రైల్వే ట్రాక్ ల చుట్టుపక్కల ప్రాంతాన్ని క్లియర్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ చొరవ కింద భారతీయ రైల్వే 12,700 కిలోమీటర్ల మార్గాలను శుభ్రం చేసింది.
***
(Release ID: 1963060)
Visitor Counter : 80