సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ముంబాయి జుహు సముద్ర తీరంంంలో కె.వి.ఐ.సి ఏర్పాటు చేసిన పరిశుభ్రతా ప్రచారానికి నాయకత్వం వహించిన కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే,
ఈ పరిశుభ్రతా ప్రచారం, జాతిపిత మహాత్మాగాంధీ బోధనలలోని పరిశుభ్రత ప్రాధాన్యతకు అనుగుణంగా ఉందని శ్రీ నారాయణ రాణే అన్నారు.
ఇది పరిశుభ్రత విషయంలో పౌరుల బాధ్యతను తెలియజెప్పేలా వారికి ప్రేరణ నివ్వడంతోపాటు, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పరిసరాలు ఉంచుకునేలా చూస్తుందన్నారు.
Posted On:
01 OCT 2023 3:45PM by PIB Hyderabad
మహాత్మాగాంధీ, ప్రసంగాలనుంచి ప్రస్తావిస్తూ మంత్రి, “రాజకీయ స్వేచ్ఛ కంటే పరిశుభ్రత ఎంతో ప్రాధాన్యత కలిగినదని’’
మహాత్ముడు ప్రవచించారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ పరిశుభ్రతా ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వచ్ఛ భారత్ అభియాన్ను 2014లో ప్రారంభిస్తూ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ,
మురికి, బహిరంగ మలమూత్ర విసర్జనపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత అలవాట్లను మార్చుకుని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలన్నారు.
కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, ముంబాయి లోని జుహు బీచ్లో ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) ఏర్పాటు చేసిన,
పరిశుభ్రతా కార్యక్రమం, శ్రమదాన్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈ పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా , ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ శ్రీ రాణే,
ది పరిశుభ్రతా ప్రాధాన్యతను తెలియజెప్పిన మహాత్మాగాంధీ ప్రబోధానికి అనుగుణంగా చేపట్టిన కార్యక్రమమని చెప్పారు.
ఈ కార్యక్రమం పరిశుభ్రమైన, ఆరోగ్యకరంగా పరిసరాలు ఉండేలా చూసేందుకు పౌర బాధ్యతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన శ్రమదాన కార్యక్రమ ఉద్దేశం, దేశ ప్రజలను మరోసారి పరిశుభ్రతా కార్యక్రమంలో భాగస్వాములను చేయడమని చెప్పారు.
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) పరిశుభ్రతా కార్యక్రమంలో క్రియాశీలంగా పనిచేస్తున్నది. ఇది శ్రమదాన ప్రాధాన్యతను తెలియజేస్తూ, ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాలను ,పోటీలను, పాఠశాలలు,కళాశాలలు,స్థానిక కమ్యూనిటీలలో నిర్వహిస్తున్నది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిలుపుమేరకు, కె.వి.ఐ.సి సానుకూలంగా ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు శ్రీ నారాయణ్ రాణే తెలిపారు.
ఇది కేవలం ప్రధానమంత్రి బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యతగా పరిశుభ్రతను పాటించాలని ఆయన అన్నారు.
పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత గా కాకుండా, సమాజం, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన జీవనానికి కట్టుబడి పరిశుభ్రతను పాటించాలన్నారు.
పరిశుభ్రమైన భారతావనికి ప్రజలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సినీ నటుడు సురేష్ ఒబెరాయ్, స్థానిక ఎం.ఎల్.ఎ శ్రీ అమిత్ సతమ్, కెవిఐసి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వినీత్ కుమార్,
కెవిఐసి ఫైనాన్షియల్ అడ్వయిజర్ శ్రీ పంకజ్ బోధ్కె, కె.వి.ఐ.సి అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ పలు కార్యక్రమాల ద్వారా కార్బన ఉద్గార రహిత ఖాదీ, గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది.
***
(Release ID: 1963046)
Visitor Counter : 56